17, ఆగస్టు 2010, మంగళవారం

సమస్యా పూరణం - 69

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సతిఁ గోరినవాని కింట స్థానం బొసఁగెన్.
వారాంతపు సమస్యా పూరణం - 5
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

4 కామెంట్‌లు:

 1. సతతము ధర్మము నెఱఁపెడు
  యతులిత గుణధాముఁడయిన హాలికవరుఁడో
  యతిథి తన గృహము వచ్చి వ
  సతిఁ గోరిన, వాని కింట స్థానం బొసఁగెన్.

  రిప్లయితొలగించండి
 2. సతి యనగ నర్ధ భాగము
  సతతము వెన్నంటి గాచు పతి భక్తి నిడన్
  యతికైన నర్ధ రాత్రము
  సతి గోరిన వాని కింట స్థానంబొసగెన్

  రిప్లయితొలగించండి
 3. రవి గారూ,
  అత్యుత్తమమైన పూరణ. అభినందనలు.

  రాజేశ్వరి గారూ,
  రెండవ పాదంలో యతి తప్పింది. భావంకూడ సందిగ్ధంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 4. అతివ పతివ్రత నవ్వుచు,
  సతి తోడుత వెడలుచుండి శ్రావణ మందున్
  మితి మీరంగను తడిసి వ
  సతిఁ గోరినవాని కింట స్థానం బొసఁగెన్

  రిప్లయితొలగించండి