8, ఆగస్టు 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 4

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ...
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

4 కామెంట్‌లు:

 1. పుంసత్వంబన మాంసభక్షణము కాబోలంచభక్ష్యంబులన్
  సంసేవించి దిఱుంగు బాఁపనయ ఓ స్వామీజి బోధింప మీ
  మాంసావృత్తవిచేతసుండయి వెసన్ మాంసంబు వర్జించి ని
  ర్మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

  రిప్లయితొలగించండి
 2. నా పూరణ .................
  హింసావృత్తి వహించి జంతు హననంబే నిత్య కర్మంబుగా
  సంసారమ్ముఁ దరించు నాటవికుడే సర్వత్ర ఘోషించులే
  మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్; మాన్యుండయెన్ విప్రుఁడే
  కంసధ్వంసి పదాంబుజ స్మరణ సంస్కారంబె వాంఛించుచున్.

  రిప్లయితొలగించండి
 3. హంసన్ కోయుచు వండి పెట్టె తురకే హంగామ లేకుండనే
  మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్;... మాన్యుండయెన్ విప్రుఁడే
  హింసల్ వీడురటంచు చాటి తినుచున్ హీనంపు వంకాయలన్
  ధ్వంసం జేయుచు పప్పు ముద్దలనుభల్ ధట్టించుచున్ నేతితో :)

  రిప్లయితొలగించండి