15, ఆగస్టు 2010, ఆదివారం

చమత్కార పద్యాలు - 16

వ్యాజ స్తుతి
ఒక కవి ముగ్గురు వ్యక్తులపై క్రింది పద్యం చెప్పాడు.
ఆ.వె.
అతఁడు నందికేశ్వరావతార; మతండు
పుత్రకుండు భోగిభూషణునకు;
శౌరి మూఁడవ యవతార మాతండ; సా
క్షాత్తు నొకరి కొకరు ఘనులు గారె!

వాచ్యార్థం చూస్తే ఒకడు నందీశ్వరుడనీ, మరొకడు పాము భూషణంగా గల శివుని కొడుకనీ, ఇంకొకడు విష్ణువు మూడవ అవతారమనీ ప్రశంసించినట్లే ఉంది. వ్యంగ్యార్థాన్ని గమనిస్తే ఒకడు ఎద్దు ( నందికేశ్వరుని అవతారం ) అనీ, మరొకడు కుక్క ( శివుని పుత్రుడు ) అనీ, ఇంకొకడు పంది ( విష్ణువు మూడవ అవతారం ) అనీ నిందించినట్లుగా తెలుస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి