19, ఆగస్టు 2010, గురువారం

సమస్యా పూరణం - 71

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను రవి గారు పంపించారు. ఇది నిన్నటి సమస్య లాంటిదే.
ఖర వదనుని కరము కన్య బట్టె.
వారాంతపు సమస్యా పూరణం - 5
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

8 కామెంట్‌లు:

  1. ఘన విముక్తమైన కౌముది సోమునిఁ
    గలియుఁ పగిది ఎడము తొలఁగి మనము
    తేటఁ వడగ హృదయ దీఁపుని,పూర్ణశే
    ఖరవదనుని కరము కన్య బట్టె.

    రిప్లయితొలగించండి
  2. బావ మరదలెల్ల బలిసిన కామాన
    మునికి జెప్పకుండ మునిగె రతిన
    గాధ తెలిసి తిట్టె గాడిద కమ్మని
    ఖర వదనుని కరము కన్య బట్టె!

    రిప్లయితొలగించండి
  3. వింత వేషధారి వేడుకల్ జరుగంగ
    గాడ్దె వేషమేసె గడుసు ఒకడు
    గడుసు తనము జూసి కామమే కల్గెనో,
    ఖర వదనుని కరము కన్య బట్టె!!

    రిప్లయితొలగించండి
  4. రవి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    మీరు అనవసరమైన స్థానాలలో అరసున్నాలు పెడుతున్నారు. అర్ధానుస్వారాలను పెట్ట వలసిన చోట్లలో పెట్టడం మంచిది. లేకుంటే అసలు పెట్టక పోవడం ఇంకా మంచిది.

    రిప్లయితొలగించండి
  5. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మంచి పూరణ పంపినందుకు ధన్యవాదాలు.
    రెండవ పాదం చివర "రతిన" కాకుండా "రతిని" అంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  6. నచికేత్ గారూ,
    చమత్కారంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    పద్యాలలో గ్రాంథిక భాషాప్రయోగమే యుక్తం. మీ పద్యంలో అంతా బాగుండి "గాడ్దె వేషమేసె" అని గ్రామ్యభాష వాడారు.
    అన్నట్టు ... నిన్న మా మిత్రుడు కలిసాడు. వాళ్ళ మనమడికి "నచికేత్" అని పేరు పెట్టారట! "నచికేత్ ఎవరు? ఆ శబ్దానికి అర్థం ఏమిటి?" అని అడిగాడు. నేను ఆ పేరుతో నాకొక బ్లాగు మిత్రుడున్నాడు. అడిగి చెప్తానన్నాను.

    రిప్లయితొలగించండి
  7. 5.నిలువు బహుస " సంతాన లక్ష్మి " అని ఉండ వచ్చు నేమొ అనుకుంటున్నాను.ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  8. నచికేత్ నా అసలు పేరు కాదండి, ఈ పేరును మా అబ్బాయికి పెట్టాలనుకొని పెట్టలేదు. చివరికి బ్లాగులో నేను ఈ పేరును వాడుకుని ఆ సరదా తీర్చుకుంటున్నాను.

    నచికేతుడు వజ్రసాయనుడనే ముని కుమారుడు. ఇతడికి యముడు ఆత్మ ఙ్న్యానాన్ని అందజేసాడు.

    రిప్లయితొలగించండి