21, ఆగస్టు 2010, శనివారం
గళ్ళ నుడికట్టు - 45
అడ్డం
1. అడవి మొల్లచెట్టు, మంచిమనుషులు చిత్రంలో నాగభూషణం భార్యగా నటించిన నటి అస్తవ్యస్తంగా (3)
4. మనవి, విజ్ఞాపనం (3)
6. మాతాపితలు (5)
7. సంపద కలది, గర్భిణులకు చేసే ఉత్సవం (3)
9. పద్మం. వనరుహం, నీరజం (3)
11. వెడల్పు మూతి గల నీటిపాత్ర. కొప్పు ఎరవేస్తే తెలుస్తుందా? (3)
13. క్రూరుడు. కూసింత కళను పోషించమంటాడు (2)
14. లేదు సంస్కృతంలో (2)
15. పిలనగ్రోవి (3)
16. వాంఛ. నరుడా! ఏమి నీ ...... ? (3)
18. పుకారు. వట్టిదంటే తిడతావు (3)
20. బాలవ్యాకరణం, నీతి చంద్రిక వ్రాసిన పండితుడు (5)
22. పిలిచి చిలిపిగా చూస్తే అస్తవ్యస్తమయింది (3)
23. నీచం, అల్పం. ఒకని కాష్ఠంలో వెదకండి (3)
నిలువు
1. సరస్వతి, లక్ష్మి కలిస్తే ఒకప్పటి హీరోయిన్ (3)
2. ఎల్లప్పుడు. సంతసం సాంతం (3)
3. సమూహం. బృందావనంలో (2)
4. ధర. విడిచిన వలువలో (3)
5. అడ్డం 9 లోనిదే. బురదలోంచి పుట్టింది (3)
8. పానకాల స్వామి కొలువున్న క్షేత్రం (5)
10. కన్నులకు మోదం (5)
11. కొట్టండి అంటే పశువుల్ని కట్టే పాకను చూపుతావేం? చివర ము ప్రత్యయం (3)
12. ధ్వని. ఒక హీరోయిన్ పేరు (3)
16. స్త్రీ. కోమలంగా ఉంటుంది (3)
17. పిచ్చిక తేలిపోయి తలక్రిందయింది (3)
18. శ్రేష్ఠం. ఎవరిష్ఠం వారిది అనొచ్చా? (3)
19. తీరిక కస్త తగ్గితే మెలిక (3)
21. యజ్ఞం చేసినవాడు. యతి జ్వరంలో (2)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అడ్డం; padakeli;45
రిప్లయితొలగించండి1 వాసం తి
4విన్నపం
6తల్లిదన్ద్రులు
7స్రీ మంతం
9వనజ
11.కొప్పెర
13.నాస్తి
15.మురళి
16.కొరిక
18.వదంతి
20.చిన్నయ సురి
23.స్తం ని క
.నిలువు;
1.వాతిసం
2సంతతం
3బ్రందం
4.విలువ
5.పంకజం
.8.మంగళగిరి
11కొట్టుము
12.రవళీ
10నయనానందం
16.కొమలి
22.కచిపి
21.యజ్ని
18.వరిస్తం
19.తిరిక
అడ్డము:
రిప్లయితొలగించండి1)వాతిసం,4)విన్నపం,6)తల్లిదండ్రులు,7)శ్రీమంతం,9)వనజం,11)కొప్పెర,13)కూళ,14)నాస్తి,15)మురళి,16)కోరిక,18)వదంతి,20)చిన్నయసూరి,22)లిచిపి,23)ష్టంనిక.
నిలువు:
1)వాణిశ్రీ,2)సతతం,3)బృంద,4)విలువ,5)పంకజం,8)మంగళగిరి,10)నయనానందం,11)కొట్టము,12)రవళి,16)కోమలి,17)కచిపి,18)వరిష్టం,19)తిరిక,21)యజ్వ.
అడ్డం: 1.వాతిసం, 4.విన్నపం, 6.తల్లిదండ్రులు, 7.శ్రీమంతం, 9.వనజం, 11.కొప్పెర, 13.కూళ,14.నాస్తి, 15.మురళి, 16.కోరిక, 18.వదంతి, 20.చిన్నయసూరి, 21.లిచిపి,23.ష్ఠంనిక
రిప్లయితొలగించండినిలువు:1.వాణిశ్రీ, 2సంతతం, 3.బృందం,4.విలువ, 5.పంకజం, 8.మంగళగిరి, 10.నయనానందం, 11.కొట్టుము, 12.రవళి, 16.కోమలి, 17.కచిపి, 18.వరిష్ఠం, 19.తిరిక, 21.యజ్వ
గడి 45.అడ్డం 1.జరోస.4.విన్నపం.6.తల్లిదండ్రులు.7.శ్రీమంతం. .9.వనజం.11.కొప్పెర.13.కళ.14.నాహీ.15.మురళి.16.కోరిక.18.వదంతి.20.చిన్నయసూరి.22.లిచిపి.[చిలిపి ] 23.తేలిక
రిప్లయితొలగించండినిలువు .1.జయశ్రీ..2.సతతం 3.బృందం .4.విలువ.5.పంకజం.8.మంగళగిరి.10.నయనానంద.11.కొట్టము 12.రవళి.16.కోమలి.17.కచిపి [ పిచిక ] 18.వరితే 19.తిరిక.21.యమి.
చిన్నా గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానాలలో అడ్డం- 1,13, నిలువు- 1 తప్పులు. మిగిలిన వాటిలో అక్షరదోషాలు ఎక్కువగా ఉన్నాయి.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
మీ సమాధానాలన్నీ కరెక్ట్. అభినందనలు. కాకుంటే కొన్ని అక్షరదోషాలు ఉన్నాయి.
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
మీ గడి పూరణ 100% కరెక్ట్. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
మీ సమాధానాలలో అడ్డం - 1,13,14,23, నిలువు - 1,18,21 తప్పులు.