చిత్రం! ఈ రోజు ఒక్కరు కూడా సమస్యాపూరణం చేయలేదు. కారణం తెలియదు. నాకైతే తప్పదు కదా! నా పూరణ - జరిగె రామపూజ చైత్ర బహుళ పక్ష నవమి నాఁడు; వచ్చె నాగ చవితి యాశ్వయుజములోన నదె బహుళ పక్షాన కొలువవలెను నాగకులము నేఁడు.
నిన్న రాత్రి వరకు ఒక్క పూరణ కూడా రాకపోయే సరికి కొద్దిగా నిరుత్సాహపడ్డాను. కాని ఆశ్చర్యం! ఆ తర్వాత ఒకటి వెంట ఒకటి నాలుగు పూరణలు వచ్చాయి. ఈ ఉదయం చూసి ఎంతో సంతోషించాను. నేదునూరి రాజేశ్వరి గారు తమ పద్యంలోని గణ యతి దోషాలను తామే సవరించి పోస్ట్ చేసారు. చింతా రామకృష్ణారావు గారు, రవి గారు చక్కని పూరణలు పంపారు. అందరికీ వందనాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, అద్భుతమైన విరుపుతో చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు. ‘పుట్టినింటికి(న్) + అమల’ పుట్టినింటికి నమల అవుతుంది. ‘పుట్టినింటికి లత/కళ/సతి/మణి .. ఏదైన రెండక్షరాల పేరు’ సరిపోతుంది కదా.
చిత్రం! ఈ రోజు ఒక్కరు కూడా సమస్యాపూరణం చేయలేదు. కారణం తెలియదు. నాకైతే తప్పదు కదా!
రిప్లయితొలగించండినా పూరణ -
జరిగె రామపూజ చైత్ర బహుళ పక్ష
నవమి నాఁడు; వచ్చె నాగ చవితి
యాశ్వయుజములోన నదె బహుళ పక్షాన
కొలువవలెను నాగకులము నేఁడు.
చవితి నాటి పూజ చండీశు తనయునకు
రిప్లయితొలగించండిదశమి నాడు చేస్తి దుర్గ పూజ
వరము లెన్నొ కోరి వరలక్ష్మి పూజించి
నవమినాడు వచ్చె నాగ చవిత్
మనము చేయగ పను లొనరింపఁ దగనట్టి
రిప్లయితొలగించండినవమి నాఁడు వచ్చె. నాగ చవితి
యైన నవమి కన్న హాయిని గొలుపును.
నవమి కన్న చవితి నయము తలప.
చవితి నాటి పూజ చండీశు సుతునకు
రిప్లయితొలగించండిదశమి నాడు చేస్తి దశమి పూజ
వరము లెన్నొ కోరి వరలక్ష్మి పూజించి
నవమి నాడు వచ్చె నాగ చవితి.
నీఁదు కోర్కెఁ దీర్ప నేనశక్తుఁడ, రామ
రిప్లయితొలగించండినవమి నాఁడు; వచ్చె నాగ చవితి
రేపుమాపనంగ.ఓపుమల్లుఁడ దయ
నంతవరకు.విడకు నాలి నిచట!
నిన్న రాత్రి వరకు ఒక్క పూరణ కూడా రాకపోయే సరికి కొద్దిగా నిరుత్సాహపడ్డాను. కాని ఆశ్చర్యం! ఆ తర్వాత ఒకటి వెంట ఒకటి నాలుగు పూరణలు వచ్చాయి. ఈ ఉదయం చూసి ఎంతో సంతోషించాను.
రిప్లయితొలగించండినేదునూరి రాజేశ్వరి గారు తమ పద్యంలోని గణ యతి దోషాలను తామే సవరించి పోస్ట్ చేసారు.
చింతా రామకృష్ణారావు గారు, రవి గారు చక్కని పూరణలు పంపారు.
అందరికీ వందనాలు.
పుట్టినింటికమల పురిటికి శ్రీరామ
రిప్లయితొలగించండినవమి నాఁడు వచ్చె; నాగ చవితి
దాటె, కలిగె నొక్క తనయుడు ముద్దార
జూపి మురిసె భర్త చూడ రాగ.
( పుట్టినింటికి + అమల)
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన విరుపుతో చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
‘పుట్టినింటికి(న్) + అమల’ పుట్టినింటికి నమల అవుతుంది. ‘పుట్టినింటికి లత/కళ/సతి/మణి .. ఏదైన రెండక్షరాల పేరు’ సరిపోతుంది కదా.
శంకరార్యా ! చక్కని సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండి