31, ఆగస్టు 2010, మంగళవారం

సమస్యా పూరణం - 82

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అమెరికాలోన లభియించె నావకాయ.

8 కామెంట్‌లు:

 1. తెలుగు వారంత కలసిన వెలుగు బాట
  మలచి పూయించి రందరు మావి తోట
  వెలయు చున్నవి నగరపు వీధులందు.
  అమెరికాలోన లభియించె నావ కాయ .

  రిప్లయితొలగించండి
 2. తెలుగు వారన్న వెలుగుల జిలుగు వారు
  యెచట నున్నను గెలుపొందు రచటె వారు.
  మలచి పూయించి రంతట మావి తోట ,
  అమెరికాలోన లభియించె నావకాయ .

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి నేదునూరి గారూ,
  ఈ సమస్యకు స్పందన ఎక్కువగా ఉంటుందనుకున్నాను. కాని మీ రొక్కరే పంపారు. పద్యం నిర్దోషంగా బాగుంది.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 4. నా పూరణ ...............

  పరిఢవిల్లు సాంకేతిక ప్రగతి వలన
  దూర భారాల తిప్పలు తొలగిపోయె
  గారె లిడ్లీలు దొరికె నింగ్లాండులోన
  నమెరికాలోన లభియించె నావకాయ.

  రిప్లయితొలగించండి
 5. పూట కూళ్ళమ్మ పెద్దమ్మ స్టేటు కేగె,
  ముద్ద పప్పుయు, గోంగూర, మునగ చారు,
  పెరుగు ఆవడ, వడియము, పెసర గారె,
  అమెరికాలోన లభియించె నావకాయ.

  రిప్లయితొలగించండి
 6. కంది శంకరయ్య గారూ , గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, రాజేశ్వరి గారూ మీపూరణ "తెలుగు వారన్న వెలుగుల జిలుగు వారు"
  మీ పూరణలు బ్రహ్మాండముగా ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ కను"విందు" చేసింది. అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి