3, ఆగస్టు 2010, మంగళవారం

సమస్యా పూరణం - 55

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
ఏనుఁగులం దిను ఘనుఁ డతఁ డెలుకలు గొప్పా?
వారాంతపు సమస్యా పూరణం - 3
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

5 కామెంట్‌లు:

 1. లాలూ, రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు:

  యానఁపు శాఖకు మంత్రిగ
  వేనకు వేలయిన కోట్లు వీడును మ్రింగెన్
  కానుడి యన ప్రజ దలఁచిరి -
  ఏనుఁగులం దిను ఘనుఁ డతఁ డెలుకలు గొప్పా?

  రిప్లయితొలగించండి
 2. పీనుగులచెంత బాసలు
  తానే చేసియు మరచెను ధనమే బ్రతుకై
  కానడు జనుల మనంబును
  ఏనుఁగులం దిను ఘనుఁ డతఁ డెలుకలు గొప్పా?

  రిప్లయితొలగించండి
 3. పేనుకు పెసరుల చేనును
  కానుక గా యిచ్చెవిభుడు; కాంచిన ఎలుకల్
  రాణితొ వాపోయె నిటుల
  ఏనుఁగులం దిను ఘనుఁ డతఁ డెలుకలు గొప్పా?

  రిప్లయితొలగించండి
 4. పేను, పెసర చేను కధ గుర్తుకొచ్చి ఇలా పూర్తి చేశాను. సమస్య పూర్తిగా అర్ధం కాలేదు.

  రిప్లయితొలగించండి
 5. దేనికి ప్రచారమింకను?
  మానుము రేవంతు రెడ్డి మంచిగ చెపెదన్:
  "ఈనాటి చంద్ర శేఖరు
  డేనుఁగులం దిను ఘనుఁ డతఁ డెలుకలు గొప్పా?"

  రిప్లయితొలగించండి