8, ఆగస్టు 2010, ఆదివారం

సమస్యా పూరణం - 60

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
ఎలుకతోలు నుతికి తెలుపు చేసె.

17 కామెంట్‌లు:

 1. షష్టి పూర్తియయ్యె చక్కంగ యని కవి
  మాంత్రికుండు చూపె మంత్ర మహిమ.
  రామ చరిత లోన రాముని యోడించె;
  ఎలుకతోలు నుతికి తెలుపు చేసె.

  రిప్లయితొలగించండి
 2. ఎలుక దేవుడంచు తలచి గుడిని గట్టె
  మూల కణము తీయ ఎలుకనెంచె
  తోలు వలిచి మంచి డోలు జేయ దలచి
  ఎలుకతోలు నుతికి తెలుపు చేసె

  http://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%B2%E0%B1%81%E0%B0%95

  రిప్లయితొలగించండి
 3. చింతా రామకృష్ణారావు గారూ,
  ఈమధ్య పూరణలలో నన్నే లక్ష్యంగా చేసికొని పద్యబాణాలు వదులుతున్నారు కదా. ధన్యవాదాలు.
  నచికేత్ గారూ,
  పద్యం అర్థం కాలేదు. రెండవ పాదంలో యతి తప్పింది.

  రిప్లయితొలగించండి
 4. నా పూరణ ..............
  బట్ట లుతుకు సబ్బు ప్రకటనలో నొక్క
  సుందరాంగి టీవియందు మెరసి
  రండు చూడు డంచు గ్రాఫిక్సు మాయతో
  నెలుక తోలు నుతికి తెలుపు చేసె.

  రిప్లయితొలగించండి
 5. మూలకణాల (stem cells) పరిశొధనలో మొదటి సారి ఎలుకనుండి మూలకణాలను సేకరించారు. ప్రాస యతిలో ప్రాస పూర్వాక్షరాలు రెండూ గురువూ, లేదా లఘువు కలవాలన్న నియమాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను.

  రిప్లయితొలగించండి
 6. సబ్బు లెన్నొ తెచ్చి సరసంగ చూపించి
  ఒక్క సబ్బు చాలు నొక్కటు తుక
  సబ్బు తోడి చేయు సరసాల మాయలు
  ఎలుక తోలు నుతికి తెలుపు చేసె

  రిప్లయితొలగించండి
 7. ఆర్యా! శంకరయ్య గురు పుంగవా!
  ఈ సమస్యతో అరవై యవ పూరణ పూర్తవుతోందని గుర్తు చేసి అభినందించాను.సహృదయులైన మీకు అర్థం కాక పోదని నాకు తెలుసు.
  నమస్తే.

  రిప్లయితొలగించండి
 8. చింతా వారూ,
  అర్థం చేసుకున్నాను కనుకే ధన్యవాదాలు తెలిపాను.

  రిప్లయితొలగించండి
 9. రాజేశ్వరి నేదునూరి గారూ,
  పద్యం నిర్దోషంగా, చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. 60 సమస్యా పూరణల షష్టి పూర్తి " సంధర్భం గా శంకరయ్య గారికి హృదయ పూర్వక శుభాభినందనలు

  రిప్లయితొలగించండి
 11. నలుపు తెలుపు జేయు ననుచు నొక్కడు మందు
  పిల్లి కమ్మెనొక్క ఫిల్ము నందు
  పని తనమ్ము జూడ ప్రక్కనే యున్నట్టి
  ఎలుక తోలు నుతికి తెలుపు చేసె.

  రిప్లయితొలగించండి
 12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది. అభినందనలు.
  ఇంతకీ ఆ ఫిల్ము ‘టామ్ & జెర్రీ’ యా?

  రిప్లయితొలగించండి
 13. శంకరార్యా ! ధన్యవాదములు. అవునండీ ..‘టామ్ & జెర్రీ’..అంతే కదా..

  రిప్లయితొలగించండి
 14. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  దారిదోపిడీలు చేసే దొంగను మునిగా(వాల్మీకి) మార్చిన నారద మహర్షి :

  01)
  _____________________________________

  పాప పుణ్యము లవి - పంచుకో రెవ్వరూ
  రామ నామ మొకటె - రక్ష జేయు
  ననుచు తెలిపి లటుని - యతివర్యుగా మార్చె !
  ఎలుక తోలు నుతికి - తెలుపు జేసె !
  _____________________________________

  లటుడు = దొంగ

  రిప్లయితొలగించండి
 15. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి