23, ఆగస్టు 2010, సోమవారం

వారాంతపు సమస్యా పూరణం - 6

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ....
తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

2 కామెంట్‌లు:

 1. తాలిమి తోడుతందనదు దారల గూడి విలాసకేళిలో
  తేలెడు యక్షుగాంచి యొక తన్వి మనంబొక తూరి సొక్కె న-
  ప్పాలుషి కట్టు దప్పెనని పాతి సతిన్వధియింప పంప, నా
  తల్లిని జంపియున్ సుతుడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితో.

  యక్షరాజు చిత్రరధుడిని చూసి ఒక్కసారి మనసు తూలిన రేణుకను ఆమె భర్త భరద్వాజుడు తిరస్కరించి, ఆమెను చంపమని తన కుమారులను నియోగించాడట. వారిలో నాలుగవ వాడైన భార్గవ రాముడు తండ్రి ఆనతి మేరకు తల్లి తల నరికాడట. (ఈ కథ నాకు వ్యక్తిగతంగా అస్సలు నచ్చని కథ, ఏ విధంగానూ సమర్థనీయం కాని కథ. అయినా ఇలా పూరించి చూద్దామని ప్రయత్నించాను.. వేరే రకంగా మళ్ళీ చూస్తాను)

  రిప్లయితొలగించండి
 2. అల్లన భార్గవుండుగద యాత్రలు తీరగ రాగనింటికిన్
  "తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్"
  మెల్లగ చెప్పెదన్ వినుము మిక్కిలి విట్టివి పూరణమ్ములన్
  కొల్లలు కొల్ల గాథలుర కోపము వచ్చును నాకు చద్వగా :)

  రిప్లయితొలగించండి