20, ఆగస్టు 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 72

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......

హనుమంతుఁడు రావణునకు హారతి పట్టెన్.
వారాంతపు సమస్యా పూరణం - 5
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

5 కామెంట్‌లు:

  1. వనమెల్లా తా జేరి ద
    హనమున్ సల్పిన తరుణము, అరుదెంచగ రా
    వణ, వనమే పళ్ళెముగా
    హనుమంతుఁడు రావణునకు హారతి పట్టెన్

    రిప్లయితొలగించండి
  2. నచికేత్ గారూ,
    మీ పూరణ చూసి నేనూ, మా మిత్రులు హాయిగా నవ్వుకున్నాం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. నా పూరణ -
    అనిలాత్మజుఁ డెవ్వఁడు? మే
    ఘనాథుఁ డెవ్వనికి సుతుఁడు? కదనంబున గె
    ల్చిన పతి కే మిచ్చెను సతి?
    హనుమంతుఁడు; రావణునకు; హారతి పట్టెన్.

    రిప్లయితొలగించండి
  4. చని కాల్చెను లంకాపురి
    హనుమంతుఁడు;.రావణునకు హారతి పట్టెన్
    ఘనముగ నా మండోదరి
    వినకయె తన భర్త చనగ వేగమె రణమున్

    రిప్లయితొలగించండి