15, ఆగస్టు 2010, ఆదివారం

సమస్యా పూరణం - 67

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ..........
స్వాతంత్ర్య ఫలమ్ము నందు జనులేరి కనన్.

8 కామెంట్‌లు:

 1. స్వాతంత్ర్య భారతము ఆ
  సాంతం దోపిడి నిలయము, సామాన్యుడి వే
  దాంతం ఆకలి గీతం
  స్వాతంత్ర్య ఫలమ్ము నందు జనులేరి కనన్

  రిప్లయితొలగించండి
 2. paratantrapu sankela veedi daaridryapu panjaramaaye bathuku,
  jaati vilavila lede swardhapu koralandu
  swatantrya phalammu nandu januleri kanan

  రిప్లయితొలగించండి
 3. నచికేత్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  చిన్నా గారూ,
  36 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పిల్లలకు హోం వర్కులు ఇచ్చిన నాకు మీరు హోం వర్క్ ఇస్తున్నారు. సంతోషం! మీ వ్యాఖ్యకు నాకు చేతనైనంతలో పద్యరూపం ......

  జాతి మనది పరతంత్రపు
  భీతిని విడనాడి కూడ పేదగ నుండెన్
  ఏ తీరు స్వార్థ మడఁగునొ
  స్వాతంత్ర్య ఫలమ్ము నందు జనులేరి కనన్.

  రిప్లయితొలగించండి
 4. నా పూరణ ...........
  నేతల త్యాగ ఫలంబయి
  చేతికి లభియించె మనకు స్వేచ్ఛయె కానీ
  యే తీరుగఁ గలదో గన
  స్వాతంత్ర్య ఫలమ్ము నందు జనులేరి కనన్.

  రిప్లయితొలగించండి
 5. శంకరయ్య గారూ, చిన్న సందేహం:
  "ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను" అనే ప్రాస నియమము ప్రాసాక్షరమునకు పూర్ణ బిందువు ముందు ఉన్నప్పుడా, లేక తరువాత ఉన్నప్పుడా?

  అంటే సాంత, స్వాతంత్ర్య లో దేనికి ఈ నియమం అమలు చేయాలి?

  రిప్లయితొలగించండి
 6. నచికేత్ గారూ,
  బిందుప్రాసలో సున్నా అక్షరానికి ముందున్నదే.
  ఉదా.
  1) కుంక. టెంక, మంకు, లంకె
  2) ఇంద్రుడు, సంద్రము, పంద్రా, సాంద్రము
  3) నింద్యము, వంద్యము, మాంద్యము, వంద్యుడు
  స్వాతంత్ర్యంలో "ంత్ర్య".

  రిప్లయితొలగించండి
 7. శంకరయ్య గారూ, ధన్యవాదాలు.
  నేను కష్టపడి ప్రాసాక్షరం తరువాత బిందువు తెప్పించి చివరికి ప్రాసా దోషంతో పూర్తిచేశాను లాగుంది.

  రిప్లయితొలగించండి
 8. ప్రాసా దోషాన్ని సరిచేశాను..

  స్వాతంత్ర్య భారతము అవి
  నీతీ, దోపిడి నిలయము, నిర్భాగ్యుడి జీ
  వితమొక ఆకలి గీతం
  స్వాతంత్ర్య ఫలమ్ము నందు జనులేరి కనన్

  రిప్లయితొలగించండి