రవి గారూ, పద్యం బాగుంది. అభినందనలు. నేనూ "శర్వాణీ పుత్రునకు" అనే పద్యాన్ని సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు మరో రకంగా ఆలోచించాలి. మీ పద్యంలో బెణకయ, స్మరణుడు పదాలు అర్థం కాలేదు.
మాణవకుడు = బాలుడు బెణకయ = బెణకప్ప అంటే వినాయకుడు కాబట్టి బెణకయ అని వాడాను.గణపతి అని మారుస్తున్నాను. స్మరణుడు = ఇది తప్పు ప్రయోగమనిపిస్తున్నది. స్మరణీయుడు అన్న పదం కరెక్టు. పద్యం ఇలా మారుస్తున్నాను.
మాణవకుఁడగు గణపతి ప్రాణముఁ దీయ హరుఁడు, ఘన వారణ ముఖుడై రాణించె. దనరు నా శ ర్వాణీ పుత్రునకు నెలుక వాహన మయ్యెన్.
బాలుడైన గణపతి ప్రాణాన్ని హరుడు తీస్తే, ఏనుగుముఖం తో బతికి, రాణించాడు. అట్టి శర్వాణీ పుత్రునకు ఎలుకవాహనమయ్యింది.
ఏ నాటిదొ యీ కర్మము.
రిప్లయితొలగించండిప్రాణప్రద భవ్య సుతుని భాగ్యమదేమో!
నే నేమని చెప్పుదు నో
వాణీ! పుత్రునకు నెలుక వాహన మయ్యెన్.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిచక్కని పద్యం అందించారు. ధన్యవాదాలు.
చింతా వారి పూరణ ఎంత బాగుందో అభినందనలు
రిప్లయితొలగించండిమాణవకుఁడగు బెణకయ
రిప్లయితొలగించండిప్రాణముఁ దీయ హరుఁడు, ఘన వారణ ముఖుడై
రాణించె. స్మరణుఁడా శ
ర్వాణీ పుత్రునకు నెలుక వాహన మయ్యెన్.
- న, ణ లకు ప్రాస కుదురుతుందాండి?
రవి గారూ,
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. అభినందనలు. నేనూ "శర్వాణీ పుత్రునకు" అనే పద్యాన్ని సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు మరో రకంగా ఆలోచించాలి. మీ పద్యంలో బెణకయ, స్మరణుడు పదాలు అర్థం కాలేదు.
నా పూరణ -
రిప్లయితొలగించండివీణయె భూషణ మెవనికి?
ప్రాణ భయముఁ బిల్లిఁ జూచి పాఱెడి దేదో?
యేణ మనిలునకు నేమయె?
వాణీ పుత్రునకు; నెలుక; వాహనమయ్యెన్.
( ఏణము = జింక. వాయుదేవునకు వాహనము జింక )
మాణవకుడు = బాలుడు
రిప్లయితొలగించండిబెణకయ = బెణకప్ప అంటే వినాయకుడు కాబట్టి బెణకయ అని వాడాను.గణపతి అని మారుస్తున్నాను.
స్మరణుడు = ఇది తప్పు ప్రయోగమనిపిస్తున్నది. స్మరణీయుడు అన్న పదం కరెక్టు. పద్యం ఇలా మారుస్తున్నాను.
మాణవకుఁడగు గణపతి
ప్రాణముఁ దీయ హరుఁడు, ఘన వారణ ముఖుడై
రాణించె. దనరు నా శ
ర్వాణీ పుత్రునకు నెలుక వాహన మయ్యెన్.
బాలుడైన గణపతి ప్రాణాన్ని హరుడు తీస్తే, ఏనుగుముఖం తో బతికి, రాణించాడు. అట్టి శర్వాణీ పుత్రునకు ఎలుకవాహనమయ్యింది.
వీణను మీటుట నాపుము
రిప్లయితొలగించండివాణీ ! విను, భవుని లీల వాక్కొన వశమే?
రాణీ!గజముఖ మును శ
ర్వాణీ పుత్రునకు; నెలుక వాహనమయ్యెన్ !!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిప్రాణము పోసెడి వాడను
రిప్లయితొలగించండిబోణీగా తప్పిదమును బొంకక చెపుదున్
వాణీ! అలసటతో ! శ
ర్వాణీ పుత్రునకు నెలుక వాహన మయ్యెన్!