30, ఆగస్టు 2010, సోమవారం

సమస్యా పూరణం - 81

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
గర్భమునందున్న పులియె గాండ్రించె నయో!

7 కామెంట్‌లు:

  1. గర్భము నందున శిశువై
    నిర్భీతిఁ జెప్పెను కహోలు నేరమి తగు సం
    దర్భమున సవితుకు, నెలమి
    గర్భమునందున్న పులియె గాండ్రించె నయో!

    అష్టావక్రుడు గర్భంలో ఉండగానే తండ్రి తప్పు ఎత్తి చూపాడు. తండ్రి కహోలుడు కోపించి అష్టావక్రుడుగా పుట్టమని శపిస్తాడు.

    రిప్లయితొలగించండి
  2. అర్భకుడొక్కడు వెడలెను
    దర్భలు గొనితేవ వనిని తప్పెను దారిన్
    దుర్భరమౌ విధినావన-
    గర్భమునందున్న పులియె గాండ్రించెనయో!

    రిప్లయితొలగించండి
  3. రవి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    అయితే రెండవ పాదంలో గణదోషం ఉంది. దానిని ఇలా సవరించాను.
    "నిర్భీతిఁ బలికె కహోలు నేరమి తలు సం"

    రిప్లయితొలగించండి
  4. నారాయణ గారూ,
    మీ పూరణ ఉత్తమోత్తమం, నిర్దోషం. అభినందనలు, ధన్యవాదాలు.
    నా పూరణగా వ్రాసిపెట్టుకున్న పద్యం చూసినవారు అది మీ పద్యానికి కార్బన్ కాపీ అని కచ్చితంగా అనుకుంటారు. అందుకని దానిని ప్రచురించడం లేదు.

    రిప్లయితొలగించండి
  5. శంకరయ్య మాస్టారు, "నిర్భీతి" లో మొదటి అక్షరం గురువవుతుంది కాబట్టి, ఆ పదప్రయోగం మార్చాను.

    గర్భము నందున శిశువై
    నిర్భయము బలికె కహోలు నేరమి తగు సం
    దర్భమున సవితుకు నెలమి
    గర్భమునందున్న పులియె గాండ్రించె నయో!

    చూచి, గుణదోషాలు సవరించగలరు.

    రిప్లయితొలగించండి
  6. అర్భకు డొక్కడు వనిలో
    గర్భవతి యైనట్టి పులిని గాంచుచు నరవన్
    ఆర్భాటము వినుచు పులికి
    గర్భమునందున్న పులియె గాండ్రించె నయో!

    రిప్లయితొలగించండి