1, ఆగస్టు 2010, ఆదివారం

సమస్యా పూరణం - 53

కవి మిత్రులారా,
ఈరోజు పూరించ వలసిన సమస్య ఇది ....
సత్యభామను పెండ్లాడె శంకరుండు.

9 కామెంట్‌లు:

  1. ఎదిరె నరకుని కృష్ణుడు నెవతె గూడి?
    భామ రుక్మిణిని హరియు ఏమి జేసె?
    ఈ సమస్య రూపమునందె యెవరి చేత?
    సత్యభామను; పెండ్లాడె; శంకరుండు.

    రిప్లయితొలగించండి
  2. శంకరుండను యువకుండు చారుశీలి
    చక్కనైనట్టి చిన్నదీ సత్యభామ
    కులము గోత్రంబు వేరైన కొదువ యేమి?
    సత్యభామను పెండ్లాడె శంకరుండు

    రిప్లయితొలగించండి
  3. రవి గారు,
    "ఈ సమస్య రూపమునందె యెవరి చేత" - చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. భామ నీవింత సౌందర్య భాగ్య మేల
    వెరసి నీవెంట వచ్చెద నెంత దవ్వు,
    చావు బ్రతుకైన నీతోటె నాక మనగ
    సత్య భామను పెండ్లాడె శంకరుండు.

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి గారూ,
    మీ పద్యంలో 2,3 పదాల్లో యతి తప్పింది. ఆ పద్యాన్ని ఇలా సవరించాను.
    భామ! నీకింత సౌందర్య భాగ్యమేల?
    కాంత! నీవెంట వచ్చెద నెంతదవ్వు
    చావు బ్రతుకైన నీతోటె స్వర్గమనఁగ
    సత్యభామను పెండ్లాడె శంకరుండు.

    రిప్లయితొలగించండి
  6. రవి గారూ,
    నచికేత్ గారూ,
    మీ యిద్దరి పూరణలు సమర్థంగా ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. నా పూరణ
    ఆ శ్యమంతక మణిఁ దెచ్చి యచ్యుతుండు
    సత్యభామను పెండ్లాడె; శంకరుండు
    మన్మథుని బూది చేసి హిమక్షితిధర
    తనయ పార్వతిం బెండ్లాడె మనము మురియ.

    రిప్లయితొలగించండి
  8. మీ పూరణ చాలా బావుందండి. నా పూరణలో మీ పేరు "శంకరుండు" అని వాడుకున్నందుకు అన్యథా భావించకండి.

    రిప్లయితొలగించండి