29, ఆగస్టు 2010, ఆదివారం

సమస్యా పూరణం - 80

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
బాసు భళి యటంచు ప్రణతుఁ డయ్యె.

15 కామెంట్‌లు:

 1. డెడ్డు లైను దాటి దేకగా ప్రాజెక్టు
  పగలు రేయి మరిచి పనులు చేయ
  క్లైంటు తోడ జెప్పి గడువును పెంచగా
  బాసు భళి యటంచు ప్రణతుఁ డయ్యె.

  రిప్లయితొలగించండి
 2. మబ్బు కరగె గాన మాధురీ గరిమచే
  జల్లు కురిసె ఎదలు ఝల్లుమనగ
  మేఘమల్హరు ఒదవ అకుబరు సెహ-
  బాసు! భళి! యటంచు ప్రణతుడయ్యె.

  ( గణాలకోసం అక్బరు అకుబరు అవ్వవలసి వచ్చింది!:( )

  రిప్లయితొలగించండి
 3. నాతి మీద కినుక నడిరేయి వరకైన
  ఫైలు మీద ఫైలు పంపె కసిగ
  విసుగు చెంద కుండ వెనువెంట పూరించ
  బాసు భళి యటంచు ప్రణతుడయ్యె

  రిప్లయితొలగించండి
 4. హరి దోర్నాల గారూ,
  మంచి పూరణ. అభినందనలు. కాని మొదటి పాదంలో డ, ద లకు యతి చెల్లదు కదా!

  నారాయణ గారూ,
  మీ పూరణ అద్భుతంగ ఉంది. ధన్యవాదలు. పద్య రచనలో అక్బర్ అకుబరు కావడంలో దోషమేమీ లేదు. మల్కిభరాముడు మలికిభరాముడు కాలేదా? కాని మూడవ పాదంలో యతి తప్పినట్లుంది.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  మీ పూరణ నిర్దోషంగా, చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. క్షమించాలి.. నా పూరణ మూడవ పాదంలో టైపింగు తప్పు- ఒక 'గ' తక్కువ వచ్చింది-
  సవరించిన పూరణ:
  మబ్బు కరగె గాన మాధురీ గరిమచే
  జల్లు కురిసె ఎదలు ఝల్లుమనగ
  మేఘ మల్హరు ఒదవగ అకుబరు సెహ-
  బాసు! భళి! యటంచు ప్రణతుడయ్యె.

  రిప్లయితొలగించండి
 6. కందిశంకరయ్య గారు, యతి సరిగా చూసుకోలేదు.

  'తినుచు వాయిదాలు దేకగా ప్రాజెక్టు' అంటే సరిపోతుందనుకుంటాను.

  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. నారాయణ గారూ,
  మూడవ పాదంలో ఇప్పటికీ యతిదోషం ఉంది. ఘ, గ లకు ప్రాసయతి చెల్లదు కదా! దానిని ఇలా సవరిస్తే ఎలా ఉంటుంది?
  "మేఘ మల్ హ రొదవ మెచ్చి అక్బరు సెహ
  బాసు .................."
  అన్నట్టు మీరు లేఖినినే వాడుతున్నారా? నేను లేఖినిలో ఎంత ప్రయత్నించినా ల కు హ వత్తు టైపు చేయలేక పోయాను

  రిప్లయితొలగించండి
 8. హరి దోర్నాల గారూ,
  ఇప్పుడు సరిపోయింది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. మరీ మౌలికమైన తప్పులు చేస్తున్నానట్లుందండీ. ఓపికతో దిద్దుతున్నందుకు ధన్యవాదాలు. (గ,ఘ లకు ప్రాసయతి చెల్లదనేది నాకస్సలు తెలీదు! :( రెండు మూడు రోజుల క్రితం కూడా సుజనరంజనిలోను, వికీపీడియాలోను ప్రాసయతి గురించి చూశాను-గానీ ఈ సంగతి అక్కడ ఉన్నట్లు లేదు. 'ఆమాత్రం తెలిసి ఉండాలి' అనుకొని ఉండచ్చు వాళ్ళు!)

  నేను లైనక్సు నుండి పని చేస్తుంటాను. స్కిం-ఆర్టీయస్ వాడి తెలుగు తెప్పించుకుంటాను. ఇందులో ల్ నొక్కి హ నొక్కితే అది వెంటనే ళ్ అయిపోతున్నది. కానీ ల్ నొక్కి, ఒక స్పేసు-మళ్లీ బ్యాక్ స్పేసు నొక్కి, ఆ పైన హ్ నొక్కితే ల్ కు హ్ వత్తుగా వస్తున్నది. ఇదే పద్ధతి లేఖినిలో కూడా పనిచెయ్యచ్చు- చూడండి.
  పోతే నాకు అరసున్నా రావట్లేదు.. మీరు ఎలా తెప్పిస్తారో చెప్పగలరు.

  రిప్లయితొలగించండి
 10. నారాయణ గారూ,
  మీరు చెప్పిన టెక్నిక్ లేఖినిలో పనిచేయలేదు.
  ఇక లేఖినిలో అరసున్నాకు ఇఁక i@mka. అఁట a@mTa. రాముఁడు rAmu@mDu.

  రిప్లయితొలగించండి
 11. కందిశంకరయ్య గారు,
  లేఖినిలో ల కు హ వత్తు l&ha ల్హ

  రిప్లయితొలగించండి
 12. ధన్యవాదాలు శంకరయ్య గారు, మీరు చెప్పిన పద్ధతిలో అరఁసున్న వచ్చింది నాకు.. లేఖినిలో ల్హ ఎలా తెప్పించాలో చూసి చెప్పి, ఆ ఋణం తీర్చుకోగలను.

  రిప్లయితొలగించండి
 13. గురువుగారూ, లేఖినిలో రాసి చూశాను mal&haru అని రాస్తే మల్హరు అని వచ్చింది! :)

  రిప్లయితొలగించండి
 14. ^ లేఖిని లో ల్హ కావాలంటే l (ల) , ha (హ) కి మద్య
  & (AND symbol) వాడవలసి ఉంటుంది. దీన్ని force
  combination అని వ్యవహరిస్తారు.

  రిప్లయితొలగించండి
 15. కోడీహళ్ళి మురళీమొహన్ గారికి, నారాయణ గారికి ధన్యవాదాలు.
  రంజని గారికి స్వాగతం, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి