హరి దోర్నాల గారూ, చింతా రామకృష్ణారావు గారూ, నచికేత్ గారూ, ముగ్గురి పూరణలు దేనికదే ప్రత్యేకంగా, అద్భుతంగా ఉండి అలరించాయి. అందరికీ ధన్యవాదాలు. నేను రాసిపెట్టుకున్న పూరణ హరి గారి పూరణకు కార్బన్ కాపీలాగా ఉంది. అందుకే దాన్ని ఇవ్వడం లేదు. మరో భావంతో పూరించాలి.
సంసార విరక్తుడయి ప్ర
రిప్లయితొలగించండిశంసగ జీవించనెంచి చనె కానలకున్
హింసించగ కౌపీనము
సంసారిగ మారి యోగి సంతసమందెన్.
కంసారి సోదరీ మణి
రిప్లయితొలగించండిసంసేవల నందె యోగి చక్కగ; నామెన్
హింసింపక చేపట్టెను.
సంసారిగ మారి యోగి సంతసమందెన్.
సంసారిని కాదు, పరమ
రిప్లయితొలగించండిహంస ననుచు నమ్మబలికె, అద్భుతముగ మీ
మాంసను భోదించె, కడకు
సంసారిగ మారి యోగి సంతసమందెన్
హరి దోర్నాల గారూ,
రిప్లయితొలగించండిచింతా రామకృష్ణారావు గారూ,
నచికేత్ గారూ,
ముగ్గురి పూరణలు దేనికదే ప్రత్యేకంగా, అద్భుతంగా ఉండి అలరించాయి. అందరికీ ధన్యవాదాలు. నేను రాసిపెట్టుకున్న పూరణ హరి గారి పూరణకు కార్బన్ కాపీలాగా ఉంది. అందుకే దాన్ని ఇవ్వడం లేదు. మరో భావంతో పూరించాలి.
శాంసన్ యోగీ నక్సల్
రిప్లయితొలగించండిహంసా లక్ష్మిని వరింఛి ; ఆమెయె జెప్పన్
హింసా ప్రవృత్తి విడచి
సంసారిగ మారి యోగి సంతసమందెన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివాహ్! ఏం ఆలోచన చేసారండీ అద్భుతం! అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిహంసల కొలనుకు ప్రక్కన
రిప్లయితొలగించండిసంసారము వీడి శూలి జరుపుచు తపమున్
ధ్వంసము జేయగ మరునున్
సంసారిగ మారి యోగి సంతసమందెన్