17, ఆగస్టు 2010, మంగళవారం

గళ్ళ నుడికట్టు - 43


అడ్డం
1. బలరాముడు. రౌహిణేయుడు (7)
6. ముస్లిం సాయెబు అస్తవ్యస్తమయ్యాడు (3)
7. వినడం. డి లోపించిన వినికిడి (3)
9. బంగారం. దీనికై ఆనక కనమంటారా? (3)
10. లోహపు కమ్మీ. సకలాత్మునిలో వెదకు (3)
11. చేయి. చతుర్థీ విభక్తి ప్రత్యయం (1)
12. లోకోక్తి. ఏదో ... చెప్పినట్లు (3)
13. రేణువు. ఇదంటే అలుసు (3)
15. వేశ్యాలోలుడు అస్తవ్యస్తంగా (3)
17. తాకట్టు. దీనికి కొదువ లేదు (3)
18. ఖద్యోతం. మిడుగురు బురువు (7)
నిలువు
2. హిమ సమూహం. కోల్డ్ క్రీం (3)
3. దాహం. తప్పక తాగాలి (3)
4. మన్మథుడు తిరగబడ్డాడు. కాంతుడు కాడు (3)
5. సూర్యుడు, అగ్ని, శివుడు. బంగారం రేతస్సుగా కలవాడు (7)
7. నమ్మకాన్ని దెబ్బ కొట్టినవాడు (7)
8. కోపం. కనుక మంచిది కాదు (3)
12. భోజనం. ఏ పేటు తప్పినా ఇది తప్పదు (3)
13. తొమ్మిదవ తిథి (3)
14. మాయమవడం, పారడం. జిగురు సుమా అని ఇట్నుంచి వెదకండి (3)
16. వీచడం, తిరగలి ఆడించడం (3)

2 కామెంట్‌లు:

 1. అడ్డము:
  1)రోహిణీకుమరుడు,3)ముహీర,7)వినికి,9)గనకా,10)సలక,11)చే,12)సామెత,13)నలుసు,15)టువిడు,17)కుదువ,18)మిడుగురుపురుగు.
  నిలువు:
  2)హిమాని,3)మజ్జిగ,4)డుముకా,5)హిరణ్యరేతస్సుడు,7)విశ్వాసఘాతకుడు8)కినుక,9)సాపాటు,13)నవమి,14)గురుసు,16)విసురు.

  రిప్లయితొలగించండి
 2. గళ్ళ నుడికట్టు - 43 సమాధానాలు
  ఎవ్వరూ స్పందించలేదని నిరుత్సాహ పడ్డాను. భమిడిపాటి సూర్యలక్ష్మి గారు కాస్త ఆలస్యంగా సమాధానాలు పంపారు. వారికి అభినందనలు.
  అడ్డం -
  1.రోహిణీనందనుడు; 6.తురక; 7.వినికి; 9.కనకం; 10.సలాక; 11.కై; 12.సామెత; 13.నలుసు; 15.టువిడు; 17.కుదువ; 18.మిణుగురుపురుగు.
  నిలువు -
  2.హిమాని; 3.దప్పిక; 4.డుతుకం; 5.హిరణ్యరేతసుడు; 7.విశ్వాసఘాతకుడు; 8.కినుక; 12.సాపాటు; 13.నవమి; 14.సురుగు; 16.విసరు.

  రిప్లయితొలగించండి