9, ఆగస్టు 2010, సోమవారం

సమస్యా పూరణం - 61

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ............
హరుఁడు మోదమలర సిరిని వలచె.

4 కామెంట్‌లు:

 1. హరిని గాంచెను సిరి. హరినేత్ర నాహరి
  మరల మరల గాంచె మరులు గొలుప.
  హరిని వలచె సిరియు. కరుణించి సిరి మనో
  హరుఁడు మోద మలర సిరిని వలచె.

  రిప్లయితొలగించండి
 2. విష్ణు మాయఁ జూపి కృష్ణరూపమునంది
  పరఁగి కూర్మిఁ గొనఁగ వన్నెకాడై
  పశువులనిల గాఁచు శిశుపాలశీర్షప్ర
  హరుఁడు మోదమలర సిరిని వలచె.

  రిప్లయితొలగించండి
 3. హరిని గాంచి నంత మురిపించె సిరిగాన
  కడలి దాటియైన కదలి రాడ
  వనిత వలచి నంత వదలడీశ్వరుడైన
  హరుడు మోద మలర సిరిని వలచె

  రిప్లయితొలగించండి
 4. చింతా రామకృష్ణారావు గారూ,
  మంచి పద్యాన్నిచ్చారు. ధన్యవాదాలు.

  రవి గారు,
  పూరణ చాలా బాగుంది. "శిశుపాల శీర్షప్రహరుఁడు" ప్రయోగం అద్భుతం. అభినందనలు. రెండవ పాదం చివర "డై" గురువు కదా! "వన్నెకాఁడై" బదులు "వన్నెలొలుక" అంటే సరిపోతుంది.

  నేదునూరి రాజేశ్వరి గారూ,
  పద్యం సలక్షణంగా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి