26, ఆగస్టు 2010, గురువారం

సమస్యా పూరణం - 77

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్.

వారాంతపు సమస్యా పూరణం - 6
తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

6 కామెంట్‌లు:

 1. పొరుగున యుండెడి రాముడు
  కోరగ ముస్లిము యువతిని, కొట్టిరి బాగా,
  పరిణయమాడెను వెంటనె
  వరలక్ష్మీ వ్రతము జేసె వహిదా రెహమాన్

  రిప్లయితొలగించండి
 2. త్వరపడి గృహిణి తనింటను
  వరలక్ష్మీ వ్రతముఁ జేసె; వహిదా రెహమాన్
  జరిపిన నృత్యము జూచుచు
  మురిసెను టెలివిజను యందు మొగుని జతనటన్.

  రిప్లయితొలగించండి
 3. తురకాయన బెండ్లాడగ
  తరళాయె వహీద-గాని, తన పతి మతము ఇ-
  తరమని తలుపక, భక్తిన్
  వరలక్ష్మీ వ్రతము జేసె వహిదా రహమాన్!

  కందంతో కుస్తీ పట్టటమే అవుతున్నదింకా. తప్పుల్ని ఎత్తిచూపితే సవరిస్తూ ఇంకొంత లాభపడగలను.

  రిప్లయితొలగించండి
 4. తురక మతంబున బుట్టియు
  చిరకాలము పేరుగాంచె సినిమా నటిగాన్ !
  తెరపై హిందూ స్త్రీయై,
  వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్.

  రిప్లయితొలగించండి
 5. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు.
  కాని రెండవ పాదాన్ని గురువుతో ప్రారంభించారు. కందంలో మొదటి పాదం మొదటి అక్షరం గురులఘువులలో ఏది ఉంటుందో మిగిలిన పాదాల మొదటి అక్షరం అదే ఉండాలని నియమం.

  రవి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.

  నారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  అయితే రెండవ పాదం చివర లఘువున్నది. కందంలో రెండవ, నాల్గవ పాదాల చివర తప్పనిసరిగా గురువుండాలని నియమం. మీ పద్యాన్ని ఇలా సవరించాను.
  తురకాయనఁ బెండ్లాడఁగ
  తరళాయె వహీద, కాని తన పతియొ మతే
  తరుఁడని తలఁపక భక్తిన్
  వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్.

  డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
  మీ అద్భుతమైన పూరణలతో నా బ్లాగు శోభ ద్విగుణీకృత మౌతున్నది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. సరసపు సినిమా లోనను
  విరబూసిన పూల తోడ విరిసిన జడతో
  పరువపు హీరోయినుగా
  వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్

  రిప్లయితొలగించండి