23, ఆగస్టు 2010, సోమవారం

సమస్యా పూరణం - 74

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
మేఘుఁ డర్జునునకు మేనమామ.

4 కామెంట్‌లు:

 1. రాజ శేఖరుండు రాజ్యమెక్కిన యంత
  తెలుగు నాట కరవు తీరెనంట!
  ఊరకనుటగాని, నుడువనే అయ్యెనా
  మేఘుడర్జునునకు మేనమామ?

  (మరో రకంగా కూడా పూరించేందుకు ప్రయత్నిస్తాను..)

  రిప్లయితొలగించండి
 2. జలధితనయ లక్ష్మి; జలధిజ పతి హరి
  వారిదంబు హరికి బావ యౌను
  హరికి మరొక బావ నరుడిక యగునెట్లు
  మేఘుడర్జునుననకు మేనమామ?

  రిప్లయితొలగించండి
 3. నారాయణ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. మంచి పద్యాలిచ్చినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 4. నా పూరణ ........

  కువలయమున వానఁ గురిపించు నెవ్వఁడు?
  శివుఁడు పాశుపతము నెవని కిచ్చె?
  మాతృసోదరుండు మనకెట్టి చుట్టమ్ము?
  మేఘుఁ; డర్జునునకు; మేనమామ.

  రిప్లయితొలగించండి