10, ఆగస్టు 2010, మంగళవారం

సమస్యా పూరణం - 62

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
వేశ్య కప్పగించె వెలఁది పతిని.
వారాంతపు సమస్యా పూరణం - 4
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

6 కామెంట్‌లు:

 1. పతిని భక్తి గొలుచు పరమసా ధ్వీమణి
  మగని మనసు దెలిసి మధన పడియె
  తపము నాచరించ తానేగె నడవుల
  వేశ్య కప్ప గించె వెలది పతిని.

  రిప్లయితొలగించండి
 2. వేశ్యయయ్యు తాను పేటి గుణములకు
  నడుగ చారుదత్తు నతివ పేర్మిఁ,
  నయఁపు మృచ్ఛకటిక నాటకాంతమునందు
  వేశ్యకప్పగించె వెలఁది పతిని.

  మృచ్ఛకటికంలో చివర్న వసంతసేన అనే వేశ్యకు ధూత అనే చారుదత్తుని భార్య, పతిని ఒప్పజెబుతుంది.

  రిప్లయితొలగించండి
 3. వేలు విలువ చేయు వెండి బంగరుఆభ
  రణములెన్నొగోరి, రవ్వ జేసి,
  దీర్చువరకునిచ్ఛ దీర్చననిబలికి
  వేశ్య కప్పగించె వెలఁది పతిని.

  రిప్లయితొలగించండి
 4. లాస్య మాడి నంత లలనకు లోనైన
  హాస్య మన్న గాని దాస్య మనదు
  భార్య యన్న నేమి భరియించు నది గాదు.
  వేస్య కప్ప గించె వెలది పతిని.

  రిప్లయితొలగించండి
 5. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  రవి గారూ,
  ఊకదంపుడు గారూ,
  నేదునూరి రాజేశ్వరి గారూ,
  అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. నా పూరణలు -
  (1)
  కామ మోహితుండు ఘనమైన సంపదల్
  వేశ్య కప్పగించె; వెలఁది పతిని
  బాగుపరచ మంచు బంధు హితులఁ గుల
  పెద్ద లందఱకును వినతి చేసె.
  (2)
  పతిని నమ్మి యతఁడె ప్రత్యక్ష దైవ మం
  చెడము గాక యిడుము లెన్నియైన
  సైచు సుమతి మగఁడు సాకాంక్షుఁడై కోర
  వేశ్య కప్పగించె వెలఁది పతిని.

  రిప్లయితొలగించండి