18, ఆగస్టు 2010, బుధవారం

సమస్యా పూరణం - 70

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఖర పదములఁ బూజ సేయఁ గలుగున్ సుఖముల్.
వారాంతపు సమస్యా పూరణం - 5
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

13 కామెంట్‌లు:

 1. పరమే ముఖ్యము జ్ఞానికి
  పరఁగి గృహపతి సుఖమందు పరమునిహమునన్.
  పరమో! ఇహమో! శశిశే
  ఖర పదములఁ బూజ సేయఁ గలుగున్ సుఖముల్.

  రిప్లయితొలగించండి
 2. నేనూ ఇలాంటిదే ఓ సమస్య మీకు పంపుదామనుకున్నాను.
  ఖరవదనుని కరము కన్య బట్టె.

  - గళ్ళనుడికట్టు రద్దు చేశారు కాబట్టి, వ్యాఖ్యలు ఎప్పటిదప్పుడు కనబడేలా అమరికలు మార్చగలరు.

  రిప్లయితొలగించండి
 3. సిరిపతి వెలసిన సప్త శి
  ఖర పదములఁ బూజ సేయఁ గలుగున్ సుఖముల్
  పరలోక మేగినంతట
  సురకాంతల జూడవచ్చు సురలోకంబున్!!

  రిప్లయితొలగించండి
 4. రవి గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  మీరిచ్చిన సమస్యను ఈ రోజే కొత్త పోస్ట్ లో పెడుతున్నాను.
  గళ్ళ నుడికట్టును రెండు రోజులకొకటి ఇవ్వబోతున్నాను. అందువల్ల వ్యాఖ్యల మాడరేషన్ కొనసాగుతుంది. నేను ఎప్పటి కప్పుడు నా మెయిల్ చెక్ చేస్తూ వ్యాఖ్యలను ప్రచురిస్తూ ఉంటాను. ఎలాగూ రిటైర్ అయి ఖాళీగానే ఉంటున్నాను కదా!

  రిప్లయితొలగించండి
 5. నచికేత్ గారూ,
  మీ పూరణ ప్రశంసార్హం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. నా పూరణ .........................
  హర కార్ముకమును ద్రుంచియు
  ధరణీసుతఁ బెండ్లి యాడి దనుజాంతకుఁడై
  వరలిన శ్రీ రఘుకుల శే
  ఖర పదములఁ బూజసేయఁ గలుఁగున్ సుఖముల్.

  రిప్లయితొలగించండి
 7. చతికేత్ గారు మీ పూరణ చాలా బాగుంది అందుకే నేమొ " స్వర్గాని కెళ్ళినా శవతి పోరు తప్పదు " అనే సామెత వచ్చింది

  రిప్లయితొలగించండి
 8. హరి శ్రీకృష్ణునిగా అవ
  తరించి కారాగృహమున, తన తండ్రికి తా
  నెరిగింప జేసిన నిజము -
  "ఖర పదములఁ బూజసేయఁ గలుఁగున్ సుఖముల్!"

  రిప్లయితొలగించండి
 9. ఆచార్య ఫణీంద్ర గారూ,
  సముచితమైన పూరణ. అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
  మీ అనుమతి లేకుండా మీ బ్లాగునుండి మీ గురువుగారు నండూరి వారి విశేషాలను కాపీ చేసి నా బ్లాగులో పేస్ట్ చేసాను. మన్నించాలి.

  రిప్లయితొలగించండి
 10. సాహితీ బాంధవులు శంకరయ్య గారు!
  అందరూ ’ఖర’ను ’శేఖర’ చేస్తారని తెలుసు. అలా కాకుండా పూరించాలని ప్రయత్నం చేసాను.
  అలాగే, మా గురువుగారికి మీ బ్లాగులో సముచితమైన గౌరవాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 11. సాహితీ బాంధవులు శంకరయ్య గారు!
  అందరూ ’ఖర’ను ’శేఖర’ చేస్తారని తెలుసు. అలా కాకుండా పూరించాలని ప్రయత్నం చేసాను.
  అలాగే, మా గురువుగారికి మీ బ్లాగులో సముచితమైన గౌరవాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. పరుగిడి భాగ్యపు నగరికి
  పొరలుచు దండమ్ములనిడి ప్రొద్దున రాత్రుల్
  మొరలిడి తెలగాణపు శే
  ఖర పదములఁ బూజ సేయఁ గలుగున్ సుఖముల్

  రిప్లయితొలగించండి