27, ఆగస్టు 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 78

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అర్ధరాత్రి సూరుఁ డస్తమించె.

వారాంతపు సమస్యా పూరణం - 6

తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

9 కామెంట్‌లు:

 1. శ్వేతరాత్రులని - విశేషమది భువిని
  లెనిను గ్రాడు నగరిఁ లీల నొప్పు.
  పొద్దు పొడిచె జగతి సద్దునకు మునుపు,
  అర్ధరాత్రి సూరుఁ డస్తమించె.

  రిప్లయితొలగించండి
 2. అర్ధ రాత్రి యైన నుద్ధరించ గజగతి
  కక్ష నందు తిరుగు శిక్ష యితని
  యిచటి నుండి పోయి ఎచటనో నుదయింప
  అర్ధ రాత్రి సూరు డస్త మించె

  రిప్లయితొలగించండి
 3. ఫిన్నులాండుయందు వేసంగి కాలాన
  అర్ధరాత్రి సూరుఁ డస్తమించు,
  శీతకాలమందు చీకటే రోజంత
  మనసు తేలికగును మంచు కురియ

  రిప్లయితొలగించండి
 4. అస్త మించు టనగ నావశ్యకత లేదు
  యిచట నుండి కదలి యచటి కేగు
  జగతి నుద్ధరించ జీవిత ధ్యేయమన
  అర్ధ రాత్రి సూర్యు డస్త మించె

  రిప్లయితొలగించండి
 5. ఫిన్నులాండునందు వేసంగి కాలాన
  అర్ధరాత్రి సూరుఁ డస్తమించు
  శీతకాలమందు చీకటే రోజంత
  మంచు కురియు వేళ మధుర లీల

  రిప్లయితొలగించండి
 6. పోరు బాట నడచి పోరాడె ఆజాదు
  గుండె బలము తోడ గుండ్ల నెదిరె
  మాటు వేసి పట్టి మాటుగా చంపిరే
  అర్థ రాత్రి సూరు డస్తమించె!

  (మావోయిస్టు నేత ఆజాదును పోలీసులు పట్టుకొని పాయింటు బ్లాంకు రేంజిలో కాల్చి చంపారని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది..)

  రిప్లయితొలగించండి
 7. రవి గారూ,
  రాజేశ్వరి నేదునూరి గారూ,
  నచికేత్ గారూ,
  మీ అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. నారాయణ గారూ,
  ఈ సమస్యకు వచ్చిన పూరణలలో మీది అత్యుత్తమం. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. నా పూరణ ...........

  కలుసుకొంద మెవరుఁ గననట్టి యీనాటి
  యర్ధరాత్రి; సూర్యుఁ డస్తమించె
  నిప్పటి కిక యేగు మేక్షణంబున నైన
  మగఁడు వచ్చు, మనదు మర్మ మెఱుఁగు.

  రిప్లయితొలగించండి