బాధల కోర్చి యపర్ణయుమోదంబున శివుని పతిగ మున్నుగ పొందెన్.మేదుర గతితో మెలగు యుమా ధవుని శిరమ్ము నెక్కె మందాకినియే.
ఈ ధరణీ తలమున హిమభూధరమును చేరుటకును మును, పరిణయమై, స్వాధీన పతికయయ్యె - ఉమాధవుని శిరమ్మునెక్కె మందాకినియే!
చింతా రామకృష్ణారావు గారూ,ఆచార్య ఫణీంద్ర గారూ,ఆణిముత్యాల్లాంటి పూరణ లందించారు. ధన్యవాదాలు.
ఈ ధర జేరగ వీడుచు మాధవుని, శిరమ్మునెక్కె మందాకినియేమా ధవుని జటను ముడివడి వేదనతో మ్రొక్క, భవుడు వేడ్కను వదలెన్ !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,మీ పూరణ బాగుంది. అభినందనలు‘మందాకిని + ఏమి + ఆ ధవుని’ అని చూడాలంటారా?
శంకరార్యా ! ధన్యవాదములు. మా.. ధవుని ( శివుని) అని నాభావన.అనవచ్చా ?
చిన్న సవరణ తో ..ఈ ధర జేరగ వీడుచుమాధవుని, శిరమ్మునెక్కె మందాకినియేవేద నుతుని జట ముడివడివేదనతో మ్రొక్క, భవుడు వేడ్కను వదలెన్ !
బాధల నోర్తు ననగనె; ను మాధవుని శిరమ్ము నెక్కె మందాకినియేమాధవు డొల్లక పోవగ శ్రీధరు కాళ్ళ కడ జేరె శ్రీరమ కడలిన్
బాధల కోర్చి యపర్ణయు
రిప్లయితొలగించండిమోదంబున శివుని పతిగ మున్నుగ పొందెన్.
మేదుర గతితో మెలగు యు
మా ధవుని శిరమ్ము నెక్కె మందాకినియే.
ఈ ధరణీ తలమున హిమ
రిప్లయితొలగించండిభూధరమును చేరుటకును మును, పరిణయమై,
స్వాధీన పతికయయ్యె - ఉ
మాధవుని శిరమ్మునెక్కె మందాకినియే!
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిఆచార్య ఫణీంద్ర గారూ,
ఆణిముత్యాల్లాంటి పూరణ లందించారు. ధన్యవాదాలు.
ఈ ధర జేరగ వీడుచు
రిప్లయితొలగించండిమాధవుని, శిరమ్మునెక్కె మందాకినియే
మా ధవుని జటను ముడివడి
వేదనతో మ్రొక్క, భవుడు వేడ్కను వదలెన్ !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు
‘మందాకిని + ఏమి + ఆ ధవుని’ అని చూడాలంటారా?
శంకరార్యా ! ధన్యవాదములు. మా.. ధవుని ( శివుని) అని నాభావన.
రిప్లయితొలగించండిఅనవచ్చా ?
చిన్న సవరణ తో ..
రిప్లయితొలగించండిఈ ధర జేరగ వీడుచు
మాధవుని, శిరమ్మునెక్కె మందాకినియే
వేద నుతుని జట ముడివడి
వేదనతో మ్రొక్క, భవుడు వేడ్కను వదలెన్ !
బాధల నోర్తు ననగనె; ను
రిప్లయితొలగించండిమాధవుని శిరమ్ము నెక్కె మందాకినియే
మాధవు డొల్లక పోవగ
శ్రీధరు కాళ్ళ కడ జేరె శ్రీరమ కడలిన్