3, ఆగస్టు 2010, మంగళవారం

సమస్యా పూరణం - 56

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
రాముఁ డోడె గెలిచె రావణుండు.

12 కామెంట్‌లు:

  1. చలన చిత్ర రంగ చతురుడ ననివీగు
    వర్మ దీయు సిన్మ కర్మ గాల,
    మణియు దీసి జూపె మంచి ఫిల్ము
    "రాము" డోడె గెలిచె "రావణుండు".

    రిప్లయితొలగించండి
  2. రామ్యుఁడతఁడు; ముక్తి రమ నిచ్చునని యెంచి
    రాము నెదురు కొనియె రావణుండు.
    ముక్తి యిచ్చి; భక్తి శక్తియే ఘనమన
    రాముఁ డోడె గెలిచె రావణుండు.

    రిప్లయితొలగించండి
  3. సీత నడవి కంపె, శీలంబె శంకించె,
    రాముఁ డోడె; గెలిచె రావణుండు
    ప్రజల హృదయములను; బదులు కోరెనెపుడు?
    చెళ్ళి ముక్కు చెవులు కోసినటుల!!

    రిప్లయితొలగించండి
  4. ఆత్మజుల నెఱుగఁక ఆవహము సలిపి
    రాముఁ డోడె. గెలిచె రావణుండు
    ఆత్మలింగ మెలమి ఆత్మార్పణము జేసి
    భవహరునకు, మహిత భక్త మూర్తి.

    రిప్లయితొలగించండి
  5. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మంచి పూరణ. అభినందనలు. మూడవ పాదాన్ని పొరపాటున 2,4 పాదాల్లాగే రాసారు. దాన్ని ఇలా సవరించాను.
    మణియు దీసి జూపె మంచి ఫిల్మని మాకు

    రిప్లయితొలగించండి
  6. చింతా రామకృష్ణారావు గారూ,
    మంచి పద్యాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. నచికేత్ గారూ,
    రవి గారూ,
    మీ యిద్దరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మాధురి గారూ,
    మీరు ఏ విషయంలో నా ప్రతిస్పందన కోరుతున్నారు? క్షమించాలి. నాకు మతిమరుపు.

    రిప్లయితొలగించండి
  9. నా పూరణ -
    గ్రామ నాటకమున రామ రావణ పాత్ర
    ధారు లొక్కనాడు తగవు పడిరి
    ఎవ్వ రడ్డుకున్న నేమి? యా తగవులో
    రాముఁ డోడె గెలిచె రావణుండు.

    రిప్లయితొలగించండి
  10. కంది శంకరయ్య గారూ!!..
    కరక్టే! తొందరగా పూర్తి చేసి పంపి ఆఫీసు పని చేసుకుందామనే
    ధ్యాస తో అలా పరుగులు తీస్తూ ఉంటుంది.

    వెంకటప్పయ్య.

    రిప్లయితొలగించండి
  11. నా పద్యంలో నాల్గవ పాదంలో యతి తప్పింది. "చెళ్ళి ముక్కు చెవులు చెక్కినటుల" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి