16, ఆగస్టు 2010, సోమవారం

సమస్యా పూరణం - 68

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
యమున కేల వస్త్ర మాభరణము?
వారాంతపు సమస్యా పూరణం - 5
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

15 కామెంట్‌లు:

  1. అక్కరకు వచ్చు ఆభరణమువిద్యయె!అన్ధకారమున జ్నానదీపము అతివకుచదువు,
    సమ్స్కారమెన్తయొ నెర్పి న సమాజమునకె మెలు
    ఆ రమణి కి ,రూ పు దాల్చిన విద్యా విన
    యమునకెల వస్ర మాభరణము

    రిప్లయితొలగించండి
  2. namaste mastaaru,thankyou sir.sorry for the trouble.I complete this telugu version with difficult.I try to write in telugu only

    రిప్లయితొలగించండి
  3. హీరోయిన్ ఉవాచ:
    చనులు కొంత పైట జారిబయలువడ
    కురియు సిరిలు గనన కోట్లు కోట్లు
    అర్ధ నగ్నికనయి ఆడెదగాక, కా
    యమున కేల వస్త్ర మాభరణము?

    రిప్లయితొలగించండి
  4. మనసు పడిన యట్టి మగువతోడ పరిణ
    యమున కేల వస్త్ర మాభరణము?
    పెళ్ళి పేరు జెప్పి భేషజం జూపంగ
    పసిడి నగలు, కంచి పట్టు లేల?

    రిప్లయితొలగించండి
  5. చిన్నా గారూ,
    మీరిచ్చిన భావాన్ని ఉన్నదున్నట్లుగా, పూర్తిగా ఆటవెలది లాంటి చిన్న పద్యంలో కుదించడం కష్టమే. ఏదో నాకు చేతనైనంత వరకు ప్రయత్నించాను. ఎలా ఉందో మీరే చెప్పాలి.

    విద్య వలనఁ గలుగు వినయమ్ము శీలమ్ము
    జ్ఞానదీప మగువు చదువు గనుక
    తరుణి చదివి రూపు దాల్చిన యా విన
    యమున కేల వస్త్ర మాభరణము.

    రిప్లయితొలగించండి
  6. ఊకదంపుడు గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    రెండవ పాదంలో "సిరిలు గనన" అన్న చోట "సిరులు గనగ" అంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  7. నా పూరణలు -
    (1)
    పుట్టి నపుడు తేము బట్టలు నగలెవ్వి
    పోవు వేళ వెంట రావు నిజము
    చితిని జేరి కాలి జీర్ణమైపోవు కా
    యమున కేల వస్త్ర మాభరణము?
    (2)
    కడు రయమ్ముతోడ నడిపెను వాహనం
    బయ్యె నాక్సిడెంటు నతని కాసు
    పత్రిలోన శస్త్ర వైద్యమ్ము సేయ కా
    యమున కేల వస్త్ర మాభరణము?

    రిప్లయితొలగించండి
  8. రెండవ పాదంలో "సిరిలు గనన" అన్న చోట "సిరులు గనగ" అంటే బాగుంటుంది.
    శంకరయ్య గారూ,
    నా ఉద్దేశ్యం కూడా అదే నండీ, అవి నిద్రావస్థలో వచ్చిన ముద్రారాక్షసాలు

    రిప్లయితొలగించండి
  9. శంకరయ్య గారూ,
    నా ఉద్దేశ్యం కూడా అదే నండీ, అవి నిద్రావస్థలో వచ్చిన ముద్రారాక్షసాలు

    రిప్లయితొలగించండి
  10. మంచి పద్యాలు అందచేస్తున్నందుకు ధన్యవాదములు ...అన్ని పూరణ లు బాగున్నాయండి ..మీకు అభినందనలు ..నాకు ఎప్పటి నుండో ఒక సందేహం మీకు వీలైతే తీర్చగలరు ......ఎవరికి వారే యమునా తీరే ..అంటే ఎవరి దారి వారిది అనే అర్ధం లో వాడతారు కదా ! మరి యమునా తీరానికీ ఎవరి గోల వారిది అనటానికీ సంబంధం ఎమిటి? లేకపొతే తీరు - -విధము అనే అర్ధం లో వాడారా ?

    రిప్లయితొలగించండి
  11. యముని పూజ జేయ నామె వచ్చెన ? నోనొ !
    యమున కేల? వస్త్ర మాభరణము.
    య! ముని పూజ జేయ నదిగొ తెచ్చెను చూడు
    యమున కేల, వస్త్ర మాభరణము.

    కేల = చేతిలో

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నో..నొ.. ఇలా డొంకతిరుగుడులా చెప్తే ఎలా? ఇలాగే ఉండాలంటారా? యా.. యా.. అర్థమైంది. ఓకే. మీకు పాస్ మార్కులు పడ్డాయండీ! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పౌరుషములతోటి వీరత్వమును జూపి,
    ధూషణముల జేసి దురితమోపి,
    పగల సెగలు రేగు పలనాటి సీమ క
    య్యమునకేల వస్త్ర మాభరణము.

    రిప్లయితొలగించండి