24, మార్చి 2012, శనివారం

సమస్యాపూరణం - 656 (చిరు లతయె రావి చెట్టును)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

చిరు లతయె రావి చెట్టును చీరి యణచె.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

  1. రావివారింట బుట్టెను రాముడతడు
    రాక్ష సంబుగా జెరచెను లతను నాడు
    శిక్ష బొందెను నేడామె చేయ పోరు
    చిరు లతయె రావి చెట్టును చీరి యణచె.

    రిప్లయితొలగించండి
  2. చిన్నవాడయ్యు, విష సరీసృపము జంపి
    బాలగోపడు తనతోటి వారి కాచె,
    గోవులను కాచె, కాళింది గొప్పయడచె.
    చిరు లతయె రావి చెట్టును చీరి యణచె.

    రిప్లయితొలగించండి
  3. చిన్న శిశువయ్యు కృష్ణుండు చన్ను ద్రావి
    ఘోర రాక్షసి పూతనన్ గూల ద్రోసె
    యాదవాంగన లెంతయు నబ్బురపడ
    చిరు లతయె రావి చెట్టును చీరి యణచె

    రిప్లయితొలగించండి
  4. హిరణ్యకశ్యపుని వధానంతరము కొందరు రాక్షసగణములు తమలో తాము అనుకుంటున్నట్లుగా ఊహ.

    హరియె సర్వాత్మకుండని యనుచు నిలను
    రాక్షసాంతకుడయ్యె ప్రహ్లాదుడిపుడు
    దుష్టుడొక్కండు చాలు సద్భుద్ధి జెఱుప
    చిరులతయె రావి చెట్టును చీరి యణచె.

    ( వ్యతిరేక భావముతో వ్రాసినాను, సరియౌనో కాదో తెలుపగలరు గురువు గారూ ).

    రిప్లయితొలగించండి
  5. దేశమున కరప్షను రావి చెట్టై ఊడలు వేయగ
    ఒక చిరు దీపం అన్నా హజారే పిలుపునివ్వగ
    జన సందోహం పార్లీమెంటును వణికింప
    చిరులతయే రావిచెట్టును చీరి యణచె

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  6. మహ్మదీయాధినాథుని మట్టిగరపి
    బాల్యదశయందె స్వారాజ్యభవన మవుర!
    భోన్సలేశుడు నెలకొల్పె భువనమందు
    చిరులతయె రావిచెట్టును చీరి యడచె.

    రిప్లయితొలగించండి
  7. నందనానికందరికీ హృదయ పూర్వక వందనములు మరియు శుభాకాంక్షలు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________


    చిన్ని బాలుడు కృష్ణుడే - వన్నెకెక్కె
    చిత్ర చిత్రాతి చిత్ర, వి - చిత్ర మైన
    చేత లెన్నియొ , చేసెను - చిఱుత వయసు
    చేర వచ్చిన రాక్షసా - చేతనణచి !
    చిరు లతయె రావి చెట్టును - చీరి యణచె !

    _____________________________________________

    రిప్లయితొలగించండి
  8. నందనానికందరికీ హృదయ పూర్వక వందనములు మరియు శుభాకాంక్షలు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    జిలేబీగారి స్పూర్తితో :


    02)
    _____________________________________________


    రావిచెట్టల్లె యవినీతి - రాక్షసముగ
    దేశమందున నూడలన్ - దింపుకొనగ
    అన్న హజారే యనునొక - యర్భకుండు
    దేశపౌరులు తనవైపు - తిరిగి మసల
    పార్ల మెంటును గడబిడ - పరచె నంత !

    _____________________________________________
    అర్భకుడు = కృశుఁడు = a weak or lean man

    రిప్లయితొలగించండి
  9. నందనానికందరికీ హృదయ పూర్వక వందనములు మరియు శుభాకాంక్షలు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    జిలేబీగారి స్పూర్తితో :


    02)
    _____________________________________________


    రావిచెట్టల్లె యవినీతి - రాక్షసముగ
    దేశమందున నూడలన్ - దింపుకొనగ
    అన్న హజారే యనునొక - యర్భకుండు
    దేశపౌరులు తనవైపు - తిరిగి మసల
    పార్ల మెంటును గడబిడ - పరచె నంత !
    చిరు లతయె రావి చెట్టును - చీరి యణచె !


    _____________________________________________
    అర్భకుడు = కృశుఁడు = a weak or lean man

    రిప్లయితొలగించండి
  10. చిరు లత యె రావి చెట్టును చీ రి యణ చె
    కలి యు గంబున నయ్యది కలుగ వచ్చు
    పుట్ట చీ మలు బారినై గిట్టు పాము
    ఇంత నింతలు జరుగును వింత లెన్నొ .

    రిప్లయితొలగించండి
  11. vasantha kishore gaaruu------
    3va paadamlo ya gana prayogam chelladu kadaa.
    savarinchandi.

    jileebee gaaruu-------
    idi padyaala blog kadaa. mee vachana kavithalaku
    deenito samanvayam cheyadametlaa. sankarayya garuu
    ee jilebee chuttalu mee blog lo meerelaa anumathisthunnaro telupagalaru.

    రిప్లయితొలగించండి
  12. మూతి మీదను మీసలే మొలవనట్టి
    బాలుడైనట్టి రాముడు కోలబట్టి
    కొండవలెనుండు తాటకి గూల్చెను భళా
    చిరు లతయె రావిచెట్టును చీరియణచె

    లక్ష్మీదేవి గారి పద్యం మూడవపాదమును
    కాళీయు గొప్పనడచె అంటే ఇంకా బాగుణ్ణేమో?

    రిప్లయితొలగించండి
  13. March 2012

    శంక రార్యుని రోగము శమయ జేసి
    యాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
    పూర్వ స్వాస్థ్యము చేకూర్చు శర్వ ! శంభు
    నందనా నీ కు వేవేల నతు లొ నర్తు .

    రిప్లయితొలగించండి
  14. పెద్దలకు ప్రణామములు.

    అంపశయ్యపై నున్న తనను చూడవక్కిన శ్రీకృష్ణుతో కురుకులపితామహు డంటున్న మాటలు:

    ఐతరేయమునఁ "దథైతద్వచో య దనృత" మన్న శ్రుతిబోధ నెఱుఁగఁజెప్పి
    తిఁ "దరుమూలః శుష్యతి" యటంచుఁ బలుమార్లు; వినఁ డయ్యె ధృతరాష్ట్రుఁ డనృతపరుఁడు;
    దమ్ముని కొడుకులఁ దక్కించి రాసిరిఁ దన తనయాళికిఁ దక్కఁబెట్టె;
    ద్యూతంబు నాపక; ద్రోవది నోమక; చివ్వకుఁ బోనాడెఁ జేటుఁ గోరి

    నేఁడు గురువంశనాశంబుఁ జూడలేక
    వగచుచున్నాఁడు దుర్నీతుఁ డగతికుండు
    ననుభవింపక దీఱ; దన్యాయ్య మనెడి
    చిఱులతయె రావిచెట్టును జీఱి యణఁచె.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  15. పెద్దలకు ప్రణామములు.

    అంపశయ్యపై నున్న తనను చూడవచ్చిన శ్రీకృష్ణ పరమాత్మతో కురుకులపితామహు డంటున్న మాటలుగా భావించి చేసిన పూరణ మిది:

    ఐతరేయమునఁ "దథైతద్వచో య దనృత" మన్న శ్రుతిబోధ నెఱుఁగఁజెప్పి
    తిఁ "దరుమూలః శుష్యతి" యటంచుఁ బలుమార్లు; వినఁ డయ్యె ధృతరాష్ట్రుఁ డనృతపరుఁడు;
    దమ్ముని కొడుకులఁ దక్కించి రాసిరిఁ దన తనయాళికిఁ దక్కఁబెట్టె;
    ద్యూతంబు నాపక; ద్రోవది నోమక; చివ్వకుఁ బోనాడెఁ జేటుఁ గోరి

    నేఁడు గురువంశనాశంబుఁ జూడలేక
    వగచుచున్నాఁడు దుర్నీతుఁ డగతికుండు
    ననుభవింపక దీఱ; దన్యాయ్య మనెడి
    చిఱులతయె రావిచెట్టును జీఱి యణఁచె.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  16. మిత్రులారా!
    ఈనాటి సమస్య చిన్నదే అయినా చాలా బాగున్నది. మంచి మంచి పూరణలకి అవకాశము ఉన్నది.

    1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు ఒక మోసపోయిన లతాంగి యొక్క ప్రతిచర్యను ఉటంకించేరు. బాగున్నది.

    2. శ్రీమతి లక్ష్మీదేవి గారు చక్కగా కాళీయ మర్దనమును ఉదహరించేరు. చాల బాగున్నది.

    3. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు రాక్షసుల హృదయాన్ని ఆవిష్కరించేరు. ఇదొక వైరభక్తి వంటిది. బాగున్నది.

    4. శ్రీ మూర్తి గారు భోంస్లే పరాక్రమాన్ని వర్ణించేరు. చాల బాగున్నది.

    5. శ్రీ వసంత కిశోర్ గారు 2 విధాలుగా పూరించేరు.
    - కృష్ణ లీలలను గురించి - చాల బాగున్నది.
    - అన్నా హజారె గురిచి. బాగున్నది.

    6. శ్రీ సుబ్బా రావు గారు బలవంతమైన సర్పము చలిచీమలకు చిక్కుటను ఉదహరించేరు. బాగున్నది. సమస్యలో లతలు అని బహువచనము లేదు. చీమలు బహువచనము.

    7. శ్రీ ఆదిభట్ల వారు తాటక వధను వర్ణించేరు. బాగున్నది. కాని రాముడు అప్పటికే సకల శస్త్రాస్త్ర విద్యా ప్రవీణుడయ్యేడు.

    8. శ్రీ మురళీధర్ గారు ఉపనిషత్తులని వెలికిదీస్తూ భీష్ముని మనోవేదనను వర్ణించేరు. బాగున్నది. కాని పాండవులని చిరులతగ చెప్పలేము కదా. అందరూ దైవాంశ సంభూతులే. పైగా శ్రీకృష్ణుని అండ ఉన్నవాళ్ళే.

    అందరికీ పేరు పేరునా అభినందనలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. నేమాని పండితార్యా మురళీ ధరులు అన్యాయమనే లత కురువంశ మనే రావి చెట్టును అణచింది అని అభిప్రాయ పడినటులున్నారు.

    రిప్లయితొలగించండి
  18. చిఱులతయె రావిచెట్టును జీఱి యణఁచె
    నన్న చందము రోటిని చిన్న వాడు
    లాగుకొని పోయి కూల్చెను లావు గల్గు
    మద్ది చెట్లను గోపమ్మ మ్రాన్పడగను.

    రిప్లయితొలగించండి
  19. శ్రీపతిశాస్త్రిశనివారం, మార్చి 24, 2012 7:33:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    తీవ్ర విద్యుత్తు ప్రవహించు తీగె యొకటి
    తాకె రయమున తెగిపడి తరువు నంత
    మాడె మలమల శాఖలు మ్రాను లోన
    చిరు లతయె రావి చెట్టును చీరి యణచె.

    గురువుగారికి నమస్సులు. గురువుగారూ నెట్ సమస్యవలన బ్లాగులు చూడలేకపోతున్నాను. మీరు అనారోగ్యముతో బాధపడుతూ కూడా శంకరాభరణమును నిరాటంకముగా నిర్వహిస్తూ మాలో పద్యపఠనాసక్తిని,పద్యరచనాశక్తిని పెంపొందిస్తున్నందుకు సర్వదా కృతజ్ఞులము. మీరు కొన్నాళ్ళు విశ్రాంతి తీసికొని సంపూర్ణ ఆరోగ్యముతో మీ వాత్సల్యవర్షమును మాపై కురిపించవలసినదిగా ప్రార్థన. అయురారోగ్యసంపదలను మీకనుగ్రహింపవలసినదిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ గురువులకు ప్రణామము.

    భీష్ముడు ప్రస్తావించినది ఐతరేయారణ్యకమని నా అభ్యూహ. శాంత్యానుశాసనిక పర్వాలలోనూ ఆంబికేయుని అనృతం కులాన్ని కూల్చివేసిన ఈ ఔపమ్యమే మఱింత విపులంగా ఉన్నది. "అథైతన్మూలం వాచో యదనృతమ్ తద్ యథా వృక్ష ఆవిర్మూలః శుష్యతి" అనికూడా ఐతరేయారణ్యకంలోని ద్వితీయప్రపాఠం అంటున్నది. అనృతపరుడైన ధృతరాష్ట్రుని అన్యాయ్యమనే లత కురువంశమనే గొప్ప రావిచెట్టును అణచివేసినదని భీష్ముని పరివేదనగా పద్యాన్ని వ్రాశాను. పాండవులను ఉద్దేశింపలేదు.

    అనుభవరాహిత్యం వల్ల కల్పన స్పష్టంగా రూపుకట్టలేదేమో అనుకొంటున్నాను.

    సాధనదశలో ఉన్న సాధకునిగా సాధనీయం ఈ విధమైన ప్రసాధనమే అని నేను ఈ కృషిని శంకరాభరణ ముఖంగా చేపట్టాను, మీ తోడ్పాటును, ఆశీస్సును ఆర్థిస్తూ.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  21. శ్రీపతిశాస్త్రిశనివారం, మార్చి 24, 2012 7:40:00 PM

    ఆయురారోగ్యసంపదలను మీకనుగ్రహింపవలసినదిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  22. మల్లె తీగలు మామిడి నల్లు కొనగ
    వేప చెట్టున తియ్యని వెలగ కాసె
    కలి యుగంబున సాధ్యము కాని దేది ?
    చిరు లతయె రావి చెట్టును చీరి యణచె !

    రిప్లయితొలగించండి
  23. ఇంతమంది హృదయాలలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తున్న మాన్యులు శ్రీ శంకరయ్య గారికి సర్వశివంకరుడు శ్రీ శంకరుడు పూర్ణారోగ్యాన్ని, స్వస్థతను అచిరకాలంలో ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  24. కవి శిఖామణులకు నమస్సులు.
    పండిత నేమాని వారి పద్యంలో "చిన్ని శిశువయ్యు కృష్ణుండు చన్ను ద్రావి" అని వ్రాశారు. మొదటి అక్షరం 'చి' కు నాల్గవ గణం మొదటి అక్షరం 'చ' కు యతి కుదిరినట్లేనా అని నా అనుమానం - తీర్చ ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
  25. శ్రీమాన్ మిస్సన్న గారి హృద్య హృదయసంవాదభాజనకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. విస్తరించిరి రాజ్యంబు విశ్వమెల్ల
    నాంగ్లపాలకులానాడు నట్టిదొరల
    తరిమి గొట్టెను మోహనదాసుగాంధి
    చిరులతయె రావిచెట్టును చీరి యణచె!!!

    రిప్లయితొలగించండి
  27. అయ్యా! మురళీధర రావు గారూ! శుభాశీస్సులు.
    నేను భారతములో మీరు ఉదహరించిన భాగములు గాని ఐతరేయ ఉపనిషత్తు గాని చదువలేదు. అందుచేత తొందరపడి యుండవచ్చును. అయితే నాది మరొక సందేహము - అన్యాయమును చిరు లతతో పోల్చగలమా? అన్యాయమునకు చిన్నది, పెద్దది, ఇంకా పెద్దది, ఎంతో పెద్దది అనే కొలతలకు ప్రమాణములు ఉంటాయా? అన్యాయము అన్యాయమే కదా. మీ పద్యము బాగున్నది. నావి సందేహములు మాత్రమే. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. అయ్యా! వామన కుమార్ గారూ!
    మీకు యతి గురించి పూర్తిగా అవగాహన లేదని తెలియుచున్నది. నేను వేసినది ప్రాస యతి. యతి స్థానములో ప్రాసను వేయుట ప్రాసయతి అంటారు. ఇలా ప్రాస యతిని తేటగీతి, ఆటవెలది, సీసము మొదలైన పద్యములలో వాడుతారు. ప్రాసనియమము లేని పద్యములలో మాత్రమే ప్రాసయతిని సాధారణముగా వాడవచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  29. మిత్రులారా! మరికొన్ని పూరణలను ముచ్చటిద్దాము:

    9. శ్రీ మిస్సన్న గారు ఉలూక బంధనమును వర్ణించేరు - బాగున్నది.

    10. శ్రీ శ్రీపతి శాస్త్రి గారి విద్యుత్ తీగ ఉదాహరణ అధునాతనముగా బాగుగ నున్నది.

    11. శ్రీమతి రాజేశ్వరి గారి వింతలు బాగున్నవి.

    12. శ్రీ మంద పీతాంబర్ గారు గాంధీజి గారి స్వాతంత్ర్య సాధనను చక్కగా చెప్పేరు. బాగున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  30. పండిత నేమాని గారికి నమస్సులు.
    తెలుసుకుందామన్న నా జిజ్ఞాసకు తగ్గట్టుగానే తెలియ జెప్పారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  31. నందనానికందరికీ హృదయ పూర్వక వందనములు మరియు శుభాకాంక్షలు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    జిలేబీగారి స్పూర్తితో :

    అఙ్ఞాతగారికి ధన్యవాదములతో :


    02అ)
    _____________________________________________


    రావిచెట్టల్లె యవినీతి - రాక్షసముగ
    దేశమందున నూడలన్ - దింపుకొనగ
    అన్న యనునొక ముదుసలి , - యర్భకుండు
    దేశపౌరులు తనవైపు - తిరిగి మసల
    పార్ల మెంటును గడబిడ - పరచె నంత !
    చిరు లతయె రావి చెట్టును - చీరి యణచె !

    _____________________________________________
    అర్భకుడు = కృశుఁడు = a weak or lean man

    రిప్లయితొలగించండి