14, జూన్ 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1703 (గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్.

32 కామెంట్‌లు:

  1. కరివరదుని వాహన మగు
    గరుడుని నొకవాన పాము గ్రక్కున మ్రింగెన్
    వెఱగు బడువింత కాదది
    వరమొందెను తొల్లి తాను హరికృప చేతన్

    రిప్లయితొలగించండి
  2. హరి వాహ్యముగా చేకొనె
    గరుడుని, నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
    పెరటిన దిరుగుచు మట్టిని
    మురియుచు కబళించు గాదె భూలత రయమున్!!!

    రిప్లయితొలగించండి
  3. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...


    బిరుదయుత కళాకారుఁడు
    హరివాహనము నణు పరిమి తాంచిత గరిమన్
    విరచించ, "వ్రీహిబీజపు
    గరుడుని" నొక వానపాము గ్రక్కున మ్రింగెన్!

    రిప్లయితొలగించండి
  4. తిరముగ బొంకుము మంకా!
    గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
    ధరపై నేతలమాటలు
    నిరతమ్మట్లుండు సుమ్మ నిజమును గనుడీ!

    రిప్లయితొలగించండి
  5. నిన్నటి సమస్యాపూరణం :
    అదియు నిదియు వదలి ఆధ్యాత్మికమునంద
    జ్జ్ఞాన, ధ్యాన, భక్తి సరళిఁ దెలియ
    చీకు చింత తోడ నేకాగ్రతనిడని
    యింటికంటె మఠము హితమొసంగు.

    రిప్లయితొలగించండి
  6. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    ఉరగము గ్రుడ్డును బట్టగ
    కరివరదుని వాహనమ్ము గావగ దలచెన్,
    బురదను రెక్కల నింపగ
    గరుడునినొక వాన ;పాము గ్రక్కున మ్రింగెన్.

    రిప్లయితొలగించండి
  7. వరదల జిక్కిన నడవిన్
    తరువున కొమ్మల నడుమున తనకలి బడుచున్
    పొరపడి జారిన చిరుతౌ
    గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్!

    రిప్లయితొలగించండి
  8. తరుణీ ! వింటివె దీనిని
    గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
    ధరణిని నెచట ను జరిగినె ?
    పరువము నుందీ య సబబె ! వ్రాయుచు నిటులన్

    రిప్లయితొలగించండి

  9. ధరలో నాయువు తీరగ
    మరణమునొందిన గరుడుడు మట్టిన గలువన్
    చిరు రేణువులుగ మారిన
    గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్!

    రిప్లయితొలగించండి
  10. కం: శరవేగముతో సాగెడి
    గరుడుని గని వానపాము గ్రక్కున మ్రింగన్ !
    అరెరే వింత యటంచ
    చ్చెరువున గనిరి జనములు చిత్తము లదరన్

    రిప్లయితొలగించండి
  11. కం: శరవేగముతో సాగెడి
    గరుడుని గని వానపాము గ్రక్కున మ్రింగన్ !
    అరెరే వింత యటంచ
    చ్చెరువున గనిరి జనములు చిత్తము లదరన్

    రిప్లయితొలగించండి
  12. మరువని సంఘటనమ్మది
    గరుడుని ఒక వానపాము గ్రక్కున మ్రింగెన్
    వరమట|విఠ లాచార్యుని
    పరదాఫై చిత్ర మాయె|వైవిద్యముగా.

    రిప్లయితొలగించండి

  13. గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
    పూరణ:అరుదుగ మన గోల్కొండను
    మిరియమ్ములు తాటి కాయ మెరకు నెదిగెన్!?.
    సరి, భీమునిపట్నంబున
    గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్ !!?

    రిప్లయితొలగించండి
  14. గరళము గలిగిన ' నూడిల్స్ " (మ్యాగీ )
    సరి దెలియక గరుడ బాబు చక్కగ దెచ్చెన్
    మరిమరి తిని మరణించెను
    " గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్ "

    రిప్లయితొలగించండి
  15. నిన్న మధ్యాహ్నం నుండి ప్రయాణంలో ఉండి మీ పూరణలపై వెంట వెంట స్పందించలేకపోయాను. మన్నించండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భూతలరయమున్’...?
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    (సత్యనారాయణ మూర్తి గారూ, నాన్నగారి పేరు ముందు మీరు గౌరవసూచకమైన ‘శ్రీ’ చేర్చడంలో నాకు అభ్యంతరం లేదు. కన్నవారిని గౌరవించడం మన ధర్మం!)
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తన కలిబడుచున్’...?
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. భరత జనుల కారాధ్యగ
    మెరసిన యిందిర నొకండు మించెన్ గాదా
    మెరుగుగ నెన్నికలందున
    గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్

    రిప్లయితొలగించండి

  17. కురిసెను వానలు మెండుగ
    అరకున దున్నెను పొలమ్ము హలికుడు నచ్చో
    బురదను మడిసిన కుళ్ళిన
    గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  18. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సహదేవుడు గారూ,
    నిజమే... వివరణకు సంతోషం!
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. సరిగా పద్మవ్యూహము
    చొరబడు వేళకు పవనజు చొరబడనీకన్
    ఉరవడి సైందవుడడ్డెను
    గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్

    ఉరవడి యొక,వానదిరుగు
    నురగము నొక గ్రద్దపిల్ల నొడుపుగ బట్టెన్
    వెరగున జూడగ నందరు
    గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్

    గరుడునిచే భయమాగగ
    పరమేశ్వరు తానుకొలిచి భయమును వీడన్
    వరమున నొకచో వింతగ
    గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్

    తరుగని బలమది యున్నను
    వెరవెరుగక లేకయున్న వీడును జయమున్
    వెరవంది యున్నయప్పుడు
    గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  20. గరగరితల నెగతాళికి
    సరగున నొక కోడెగాడు సరసములాడన్
    పరుగున భటులను పిలువగ
    "గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్"

    సరి బలవంతుని బొడువగ
    తరుణమునకు వేచియుండి దాడికిదిగ నే
    మరుపాటున వేటు పడగ
    "గరుడునినొక వానపాము గ్రక్కున మ్రింగెన్"

    రిప్లయితొలగించండి
  21. క్షమాపణ లతో నిన్నటి సమస్యకు పూరణ

    బ్రహ్మ మెరుగ గోరి, భ్రాంతియె జగమంచు
    దెలిసి , సత్య తత్వ తెరగు నరయు
    మోక్ష సాధకునకు మోహమ్ము దొలగగ
    ఇంటికంటె మఠము హితమొసంగు

    రిప్లయితొలగించండి
  22. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    క్షమించండి... మీ పూరణ నా దృష్టికి రాలేదు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. సమకాలీనపూరణతో గోలివారు అదరగొట్టేశారు.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. మాస్టరు గారూ ! సహదేవుడు గారూ ! ధన్యవాదములు...

    రిప్లయితొలగించండి
  25. అరె! బక్క నరుడు గాంధీ
    మెరిసెడి సామ్రాజ్యమునహ! మ్రింగుచు మురిసెన్;
    సరిసరి యిది యెట్లన్నన్:
    గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్

    రిప్లయితొలగించండి


  26. అరయగ నహింస యేగొ
    ప్ప,రణము వలదిక తిననిక పాముల ననుచున్
    పరితాపముతో చిక్కిన
    గరుడుని, నొక వానపాము గ్రక్కున మ్రింగెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. వరుడగు నిక్సను ప్రభువును
    నిరుపేదగు హోచి మిన్ను నెగ్గుచు నవ్వెన్
    నరుడా! ఇది యెట్లన్నన్
    గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్

    రిప్లయితొలగించండి