1, జులై 2016, శుక్రవారం

సమస్య - 2076 (మాంసాహారముఁ గోరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“మాంసాహారముఁ గోరి కోరి తినినన్ మాన్యుండు విప్రుం డగున్”
(ఒకానొక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
లేదా...
“మాంసముఁ దిన విప్రవరుఁడు మాన్యుం డగురా”

59 కామెంట్‌లు:

  1. సంసారం బున సాగుచుం డుననగా చాంచల్య వైభోగముల్
    హింసింపంగను ప్రాణులన్ జగతిలో హేలన్వినో దింపగా
    వాసంతం బునబూలు పూయ గనుయా వాసంతు డేతెంచగా
    మాంసాహా రముఁ గోరికోరి తినినన్ మాన్యుండు విప్రుం డగున్

    రిప్లయితొలగించండి
  2. వంశాధి పితృ తర్పణ
    సంశయ మొందక పలలము చవు లూరంగన్
    హింసను జేయుట పాపము
    మాంసముఁ దినవిప్ర వరుఁడు మాన్యుం డగురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ రెండు పూరణలు ఎన్నిసార్లు చదివినా మీ భావం బోధ పడలేదు. మీరు సమస్యగా ఇచ్చిన వాక్యాన్ని సమర్థిస్తున్నారా?
      ‘పితృ’ అన్నపుడు ‘పి’ లఘువే. అందువల్ల అక్కడ గణదోషం.

      తొలగించండి
    2. హంసగ బ్రతికిన బాపడు
      ధ్వంసము జేయగ కులమును దౌర్బల్యమునన్
      హింసను జేయుట పాపము
      మాంసముఁ దినవిప్ర వరుఁడు మాన్యుం డగురా ?

      తొలగించండి
    3. సంసారం బునసా గుచుండును ననగా చాంచల్య వైభోగముల్
      హిసింపంగను ప్రాణులన్ జగతిలో హేలన్ వినోదింపగన్
      మాంసాహారముఁ గోరికోరి తినినన్ మాన్యుండు విప్రుండగున్
      కంసారా తియెబుద్ధి గాను మెలగన్ గాంచన్వి చిత్రంబగున్

      తొలగించండి
  3. సంశయ మేలర శౌర్యము
    మాంసము దిన; విప్రవరుడు మాన్యుం డగురా
    హంసకు మేలగు సాత్విక
    అంశముల గొనగ పటుత్వ యందము జేరన్ !


    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      స-శ లకు ప్రాసమైత్రి లేదు. ‘సాత్విక అంశములు’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ సవర్ణదీర్ఘసంధి తప్పదు.

      తొలగించండి
    2. శ - స లకు ప్రాస ఉన్నా అది అప్రసిద్ధము. అనుసరించరానిది.

      తొలగించండి
  4. గాసిన పూర్వపు ఋషులున్
    కాసారములన్ జిలుకగ కనుగొని రెన్నో!
    కూసిరి నేడును యల్పులు
    "మాంసముఁ దినవి ప్రవరుఁడు మాన్యుం డగురా"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనుస్వార పూర్వక సకారం ప్రాసాక్షరం. మీరు దానిని గమనించినట్టు లేదు. ప్రాస సవరించి మరో పూరణ చెప్పండి.

      తొలగించండి
  5. చిన్న సవరణతో

    హింసనుసహించకజనప్ర
    శంసలనుగొనుచు సతతముశాంతము నీడన్
    హంసగగడిపి, విముఖుడై
    మాంసముతిన, విప్రవరుడు మాన్యుండగురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరాం గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘హంసగఁ దా నిష్టపడక| మాంసము దిన...’ అంటే అన్వయం బాగుంటుంది.

      తొలగించండి
  6. కంసాలి వారి పెళ్లికి
    'హంసల యతిరాజశర్మ' హాజరగుచుఁ దా
    హింసను మెచ్చక వలదని
    మాంసముఁ, దిన విప్రవరుఁడు మాన్యుండగురా!

    రిప్లయితొలగించండి
  7. హంసుడు రుచులను గోరగ
    హింసింపగలేక జీవి నీప్సిత మందన్
    అంసలుడవ్వగ గోరుచు
    మాంసముదిన విప్రవరుడు మాన్యుండగురా!

    హంసుడు=జీవుడు
    అంసలుడు=బలిమిగలవాడు
    మాంసము=పలలము=నూవుపొడి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మాంసం దిన గోరినాడే కాని తినలేదంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. శర్మ గారు పలలము నకు మూడర్థములు గలవు. అందులో మాంసమొకటి. కానీ మాంసము పలలమునకు సర్వ సమానము కాదు. పలలము లోని మాంసమునకు మాత్రమే యది సమానము. నూవుపొడియను యర్థము రావలెనన్న పలల పదమునే వాడవలెను గదా.
      హరి యనిన కోతి అనుకుంటే సింహమును (హరి) కూడా కోతి యనలేము గదా.

      తొలగించండి
    3. గురువుగారూ నమస్సులు...మాంసమనగా పలలము..అనివుండుటచే....ఆ పలలము అర్థము నూవుపొడి యని వుండుటచే...దానిని స్వికరించి... వాడినాను.....అలా వాడవచ్చనుకున్నాను...వాడకూడదని తెలియదు..మన్నించండి...మీరేమైనా సూచించి సమస్యను పూరించ తోడ్పడగలరు

      తొలగించండి
    4. శర్మ గారు మీ భావము ప్రశంసనీయము.
      “అంసలు డవ నశనము సమ” యనిన నెట్లుండును? మాంసముతో సమానమైన భోజనము.

      తొలగించండి
    5. కృతజ్ఞతలు....అలా కూడా బాగుంటుంది

      తొలగించండి
  8. ధ్వంసమ్మగున్ పవిత్రత
    మాంసముఁదిన విప్రవరుడు, మాన్యుండగురా
    హింసింపకమృగజాతుల
    సంసారము నడుపునట్టి సాధుహృదయుడే

    రిప్లయితొలగించండి
  9. భూసారపు నర్సయ్య గారి పూరణ....

    మాంసమ్ములలో మినుముల
    మాంసమ్మే శ్రేష్ఠ మనుచు మాన్యు లెఱిఁగి రీ
    మాంస మ్మారోగ్య మనుచు
    మాంసముఁ దిను విప్రవరుఁడు మాన్యుం దగురా.
    (మినుములలో మాంసకృత్తులు అధికం. అది మాంసంతో సమాన మంటారు)

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. సంసారార్ణవ ముత్తరింప భువి సచ్ఛారిత్రుడై ద్వేషవి
      ధ్వంసం బింపుగఁ జేసి శ్రీహరినిఁ దా బ్రార్థింపగా నోపు వి
      ద్వాంసుల్ సత్కృత యజ్ఞయాగముల, నిర్వక్రంబుగం జెప్పరే,
      మాంసాహారముఁ గోరి కోరి తినినన్ మాన్యుండు విప్రుం డగున్

      దంసనములఁ జెరచును బ్ర
      ద్వంసము సేయంగ నేల వంశము శాకో
      త్తంసము భోజనము రహిత
      మాంసముఁ దిన విప్రవరుఁడు మాన్యుం డగురా

      తొలగించండి
    2. యజ్ఞయాగములకు సూక్ష్మ భేదము కలదన తలంపుతో నాసమాసమును వాడితిని. పునరుక్తియైనచో ”యజ్ఞకార్యముల” యని సవరణ.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్కృష్టంగా ఉన్నాయి. అభినందనలు.
      ‘యజ్జయాగాలు’ అన్న ద్వంద్వం సర్వసాధారణం. అందులో దోషం లేదు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీవివరణ తో నాయనుమానము తీరినది. ధన్యవాదములు.

      తొలగించండి
  11. హింసించుట యగు బ్రాణుల
    మాంసము దిన, విప్రవరుడు మా న్యు o డ గురా
    హింసల జోలికి బోవక
    కంసారిని గొలుచు నెడల కాంక్షలు లేమిన్

    రిప్లయితొలగించండి
  12. మాంసికునకు,లుబ్ధకునకు
    పాంసనులకు భ్రష్టులైన బ్రాహ్మ్యమ్మునకున్
    శంసను జేయుట పాడియె
    మాంసముఁదిన విప్రవరుడు, మాన్యుండగురా

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    [జూదరియు, జారుఁడునుఁ, జోరుఁడును, వంశాభిఘాతి యైన తన కుమారుఁడగు గుణనిధినిఁ దండ్రి దూషించిన వైనము]

    ధ్వంసోన్మాదము నెత్తి కెక్క నిపుడీ వైప్లవ్య దుష్కృత్యముల్
    హింసా సంస్కృతిఁ గొంచు నిట్లు మిగులన్ హేయంపు దుశ్చర్యలన్
    సంసారుల్ గనలేని రీతిఁ జలుపన్ సద్వంద్యుఁడౌనే? యెటుల్

    మాంసాహారముఁ గోరి కోరి తినినన్, మాన్యుండు విప్రుం డగున్??

    రిప్లయితొలగించండి
  14. హింసామార్గముతోడుతన్ పసువులన్ హీనమ్ముగాచంపుచున్
    సంసారమ్మునుచేయునీచుడుసదా సాగున్ యమావాసిగాన్
    మాంసాహారముఁగోరి కోరితినినన్, మాన్యుండు విప్రుండగున్
    హంసున్ గొల్చుచు తాను సంతసముగాయజ్ఞమ్ములన్ సల్పినన్

    రిప్లయితొలగించండి
  15. మాంసంబన్నది మారురూపమగుచున్ మాధుర్యమింపారగా
    హింసించంబనిలేక సాధుగరిమన్ హృద్యంపుశాకంబునాన్
    భాసించున్ మన పప్పులందు ఘనమై వర్థిల్లు సంతృప్తి నా
    మాంసాహారము గోరి కోరి తినినన్మాన్యుండువిప్రుండగున్.

    సంశయమదేల?బాపడు
    మాంసంబనుమాటకూడ మరిపలుకడుగా
    వంశముజెడి యపయశమున
    "మాంసముదిన,విప్రవరుడు మాన్యుండగురా?"

    రిప్లయితొలగించండి
  16. సంసారంబున వేదతత్త్వపరమై సాగించు జీవంబునిన్
    కంసారాతియె సారమిచ్చె మనకున్ కౌంతేయుడే సాక్షి, యా
    శంసారీతిగ శోధనంబు సలిపిన్ సామాన్యు కందించ మీ
    మాంసాహారము గోరి కోరి తినినన్ మాన్యుండు విప్రుండగున్॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీమాంసతో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
      ‘జీవంబునిన్-జీవంబునన్, సలిపిన్-సలిపెన్’... టైపాట్లనుకుంటాను.

      తొలగించండి
  17. గురువు గారికి మరియు కవిమిత్రులకు నమస్కారములు

    * హంస అను చెల్లెలితో అన్న పలుకు మాటలుగా నూహించిన పూరణము

    హంసా! యతనిష్ట పడడు
    మాంసము దిన, విప్రవరుడు, మాన్యుండగురా
    హంసవలె కీర్తి నొందె ప్ర
    శంసింపగ వలయునతని సద్గుణములనే

    ధ్వంసమ్మయ్యె కులమ్ములంచు పలుకన్ ధర్మమ్ము గాదంటినే
    సంసారమ్ములు గూలనేమి యిలలో సాద్గుణ్య శీలుండు తా
    హంసన్ బోలి చరించు శాకములనే యాశించుచున్ మానునా
    మాంసాహారము, గోరి కోరి తినినన్ మాన్యుండు విప్రుండగున్

    రిప్లయితొలగించండి
  18. . సంసారులలో కొందరు
    మాంసముదిన|”విప్రవరుడు మాన్యుండగురా
    హింసనుమానియు భక్తిగ
    హంసగ జీవించి నపుడె?నారాద్యుండౌ|”
    2.సంసారంబును సాగదీయుటకు విశ్వాసంబు వంశాంశమై
    మాంసా హారము గోరికోరి తినినన్ మాన్యుండు|”విప్రుండగున్
    హింసా మార్గముయింట బైట విడి.సాహిత్యాన సంస్కారముల్
    ద్వంసం బవ్వక భక్తిమార్గ మనుసంధానాన జీవించగా|”


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘మార్గము నింటి బైట...’ అనండి.

      తొలగించండి
  19. హింస విడనాడగ నెటుల
    మాంసము దిన! విప్రవరుడు మాన్యుండగురా,
    సంసారమ్మీదగ మీ
    మాంసల సూక్తులు నుడివెడు మార్గమున జనన్!

    రిప్లయితొలగించండి
  20. హింసనుచేయుకి రాతుడు
    మాంసముదిను విప్రవరుడు మాన్యుండగురా
    హంసుడగుచు సతతమ్మును
    కంసారిని దల్చుకొనుచు కాలము గడుపున్

    రిప్లయితొలగించండి
  21. సంసారమ్మున పూజలన్ జపములన్ సాగించకెన్నండు వి
    ధ్వంసోన్మత్తుడు క్షుద్రశక్తులను సంపాధింపగా నొక్క వి
    ​ద్వాంసుండాశగ లోకపాలకుడుగా దాష్టీకముల్ జేయ; నెటుల్
    మాంసాహారముఁ గోరి కోరి తినినన్; మాన్యుండు విప్రుం డగున్?

    రిప్లయితొలగించండి
  22. హంసా ! విడుమా నీ మీ
    మాంసను, సలుపగ పరీక్ష మాంసము, పండ్లన్
    హింసను పెట్టక నిడ, విడి
    మాంసము, దిన విప్రవరుఁడు మాన్యుం డగురా!

    రిప్లయితొలగించండి
  23. మాంసమ్మేలర ! పేదల
    మాంస మనెడు చిక్కుడైన మంచిని గూర్చున్
    హింసను విడి చిక్కుడనెడు
    మాంసము దిన విప్రవరుడు మాన్యుండౌరా
    (చిక్కుడు లో ఉన్న పోషకాలను బట్టి దానికి పేదలమాంసము అని శాస్త్రజ్ఞులు బిరుదు ఇచ్చారు.)

    రిప్లయితొలగించండి
  24. కంసున్ జంపిన కృష్ణు గాథ నిజమా కాదాయనన్ శంకనున్
    ధ్వంసంజేయు రిసర్చికై యమెరికా ధైర్యంబుగా పోవగా
    నింసం గూడను వేళ లేక తినబో నిడ్లీలు దోసల్లు గో
    మాంసాహారముఁ గోరి కోరి తినినన్ మాన్యుండు విప్రుం డగున్ :)

    రిప్లయితొలగించండి