1, ఆగస్టు 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 3

కవి మిత్రులారా,
ఈ వారం పూరించ వలసిన సమస్య ఇది ....
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

5 కామెంట్‌లు:

  1. బదుకఁగ వచ్చు రైతులుగ పంటలఁ జక్కగ సాగుజేయుచూ
    కదుకను వచ్చు గడ్డియును కష్టము జేసియు, కూలిసల్పియో.
    బ్రదికిన యన్నినాళ్ళు పెను బానిస వృత్తుల గూర్పు ఈ వృథా
    చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

    రిప్లయితొలగించండి
  2. చదువులు సంపదల్ ఇచును సౌఖ్యమునిచ్చును తోడ కష్టముల్!
    ఇది ఒక ర్యాటురేసు, ఇదె ఈసుకు వాసము, లేదు తృప్తియే
    పదిలపు జీవనం కొఱకు ప్రాధమ విద్యయె చాలునోయి, పై
    చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై !!

    రిప్లయితొలగించండి
  3. రవి గారూ,
    నచికేత్ గారూ,
    పూరణలు పంపినందుకు ధన్యవాదాలు. సమయాభావం వల్ల ఇప్పుడు విశ్లేషణ, సవరణ చేయడం లేదు. వీలు చిక్కగానే ఆ పని చేసి నా పూరణను కూడ ప్రచురిస్తాను.

    రిప్లయితొలగించండి
  4. నా పూరణ ........
    పదుగురు మెచ్చఁగాఁ దనదు భార్యయు బిడ్డల పోషణార్థమై
    సదమల వృత్తిఁ జేకొని ప్రశంసలఁ బొందఁగ వృత్తిధర్మమున్
    పదిలముగా వహించు నొక వ్యక్తికి వేరొక విద్య యేల నీ
    చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

    రిప్లయితొలగించండి
  5. కుదువకు నప్పులిచ్చుచును కూర్చొని వడ్డిలు కూడబెట్టి భల్
    పదవుల నాక్రమించుచును పండుగ జేయక భాగ్యనగ్రినిన్
    పదుగురు కూడనొల్లనివి పద్యములల్లెడి సంస్కృతమ్మునన్
    చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై!

    రిప్లయితొలగించండి