5, ఆగస్టు 2010, గురువారం

సమస్యా పూరణం - 57

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
ఆంజనేయుఁడు ధరియించె నడ్డుబొట్టు.
వారాంతపు సమస్యా పూరణం - 3
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

6 కామెంట్‌లు:

  1. ఆంజనేయుఁడు ధరియించె నడ్డుబొట్టు
    సీత, రామయ్య పాత్రకే చెళ్ళెలాయె
    రామరావణ నాటకం రక్తిగట్ట
    చేరి వారంత మరలాడె "శివునిలీల"

    రిప్లయితొలగించండి
  2. ఆంజనేయశర్మ చతురుఁడందగాడు.
    యతఁడు శ్రీవైష్ణవుఁడయ్యును యాలి స్మార్త.
    మనువు జరుగ నతివ మీద మనసు మీర
    ఆంజనేయుఁడు ధరియించె నడ్డుబొట్టు.

    రిప్లయితొలగించండి
  3. నచికేత్ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు. చివరి పాదంలో "మరలాడె" అనడం కంటే " చేరి వారాడి రంతట శివుని లీల " అంటే బాగుంటుందేమో.

    రిప్లయితొలగించండి
  4. రవి గారూ,
    చక్కటి పూరణ. ధన్యవాదాలు. రెండవ పాదంలో గణదోషం ఉంది. దానిని ఇలా సవరించాను.
    అతఁడు శ్రీవైష్ణవుఁ డతని యాలి స్మార్త.

    రిప్లయితొలగించండి
  5. నా పూరణ -
    శివుని యవతారమే గద పవనజుండు
    రామభక్తుఁడై యూర్ధ్వపుండ్రము ధరించె
    హరిహరాద్వైతమును దెల్ప నచ్చెరువుగ
    నాంజనేయుండు ధరియించె నడ్డుబొట్టు.

    రిప్లయితొలగించండి