7, ఆగస్టు 2010, శనివారం

సమస్యా పూరణం - 59

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
సంసారిగ మారి యోగి సంతసమందెన్.
వారాంతపు సమస్యా పూరణం - ( రోజు చివరి రోజు)
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

8 కామెంట్‌లు:

  1. సంసార విరక్తుడయి ప్ర
    శంసగ జీవించనెంచి చనె కానలకున్
    హింసించగ కౌపీనము
    సంసారిగ మారి యోగి సంతసమందెన్.

    రిప్లయితొలగించండి
  2. కంసారి సోదరీ మణి
    సంసేవల నందె యోగి చక్కగ; నామెన్
    హింసింపక చేపట్టెను.
    సంసారిగ మారి యోగి సంతసమందెన్.

    రిప్లయితొలగించండి
  3. సంసారిని కాదు, పరమ
    హంస ననుచు నమ్మబలికె, అద్భుతముగ మీ
    మాంసను భోదించె, కడకు
    సంసారిగ మారి యోగి సంతసమందెన్

    రిప్లయితొలగించండి
  4. హరి దోర్నాల గారూ,
    చింతా రామకృష్ణారావు గారూ,
    నచికేత్ గారూ,
    ముగ్గురి పూరణలు దేనికదే ప్రత్యేకంగా, అద్భుతంగా ఉండి అలరించాయి. అందరికీ ధన్యవాదాలు. నేను రాసిపెట్టుకున్న పూరణ హరి గారి పూరణకు కార్బన్ కాపీలాగా ఉంది. అందుకే దాన్ని ఇవ్వడం లేదు. మరో భావంతో పూరించాలి.

    రిప్లయితొలగించండి
  5. శాంసన్ యోగీ నక్సల్
    హంసా లక్ష్మిని వరింఛి ; ఆమెయె జెప్పన్
    హింసా ప్రవృత్తి విడచి
    సంసారిగ మారి యోగి సంతసమందెన్.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వాహ్! ఏం ఆలోచన చేసారండీ అద్భుతం! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. హంసల కొలనుకు ప్రక్కన
    సంసారము వీడి శూలి జరుపుచు తపమున్
    ధ్వంసము జేయగ మరునున్
    సంసారిగ మారి యోగి సంతసమందెన్

    రిప్లయితొలగించండి