13, ఆగస్టు 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 65

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ............
మాధవుని శిరమ్ము నెక్కె మందాకినియే.
వారాంతపు సమస్యా పూరణం - 4
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

8 కామెంట్‌లు:

  1. బాధల కోర్చి యపర్ణయు
    మోదంబున శివుని పతిగ మున్నుగ పొందెన్.
    మేదుర గతితో మెలగు యు
    మా ధవుని శిరమ్ము నెక్కె మందాకినియే.

    రిప్లయితొలగించండి
  2. ఈ ధరణీ తలమున హిమ
    భూధరమును చేరుటకును మును, పరిణయమై,
    స్వాధీన పతికయయ్యె - ఉ
    మాధవుని శిరమ్మునెక్కె మందాకినియే!

    రిప్లయితొలగించండి
  3. చింతా రామకృష్ణారావు గారూ,
    ఆచార్య ఫణీంద్ర గారూ,
    ఆణిముత్యాల్లాంటి పూరణ లందించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఈ ధర జేరగ వీడుచు
    మాధవుని, శిరమ్మునెక్కె మందాకినియే
    మా ధవుని జటను ముడివడి
    వేదనతో మ్రొక్క, భవుడు వేడ్కను వదలెన్ !

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు
    ‘మందాకిని + ఏమి + ఆ ధవుని’ అని చూడాలంటారా?

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! ధన్యవాదములు. మా.. ధవుని ( శివుని) అని నాభావన.
    అనవచ్చా ?

    రిప్లయితొలగించండి
  7. చిన్న సవరణ తో ..

    ఈ ధర జేరగ వీడుచు
    మాధవుని, శిరమ్మునెక్కె మందాకినియే
    వేద నుతుని జట ముడివడి
    వేదనతో మ్రొక్క, భవుడు వేడ్కను వదలెన్ !

    రిప్లయితొలగించండి
  8. బాధల నోర్తు ననగనె; ను
    మాధవుని శిరమ్ము నెక్కె మందాకినియే
    మాధవు డొల్లక పోవగ
    శ్రీధరు కాళ్ళ కడ జేరె శ్రీరమ కడలిన్

    రిప్లయితొలగించండి