21, ఆగస్టు 2010, శనివారం

సమస్యా పూరణం - 73

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
రాముఁడు ముదమున ఖురాను చదివె.
వారాంతపు సమస్యా పూరణం - 5 ( చివరి రోజు )
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

15 కామెంట్‌లు:

  1. తాను మహమదీయుడైనగాని, తెలుగు
    నందు నారితేరె - ఆంధ్రుడొకం డంత
    తెచ్చి ఇడ ’ఖురాను’ తెలుగులో, ’మల్కిభ
    రాముడు’ ముదమున ’ఖురాను’ చదివె!

    రిప్లయితొలగించండి
  2. కం||
    నరలోకపు భూకబ్జా
    సురులంతంబొందగ సురసురమని విడిచెన్
    శరములు [రాముడు. ముదమున
    ఖురాను చదివె]ను రహీము కుశలము తోడన్

    రిప్లయితొలగించండి
  3. రామరావు గారు రంజాను మాసాన
    ఇఫ్ఫుతారునిచ్చె ఈదు చెయ్య
    తలకు కుచ్చు టోపి, ధరియించె శల్వారు
    రాముఁడు ముదమున ఖురాను చదివె

    రిప్లయితొలగించండి
  4. ఉ||
    క్షామముతోడిరాజ్యమున గద్దలు భిక్కుల భక్షమైననూ
    కామమదమ్ములందు గురిగల్గిన శిక్షకులుండుటే నిజం.
    క్షేమము లేనియా వికృతకేంద్రములో దయ విస్మరించి యా
    రాముని జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడరే

    రిప్లయితొలగించండి
  5. భూములు పంచె పేదలకు భూపతులెల్లరు పెక్కటిల్ల; రా
    జ్యమ్ములు కంపమొంద జన జాగృతి సల్పెను; పోరు తప్ప ఇం
    కేమియు మిమ్ము కావవని యెర్రపతాకమునెత్తె-నట్టి మా
    రాముని జంపి హర్షమున రాక్షసులెల్లరు నాట్యమాడిరే!

    పద్యం అలవాటు తప్పింది..చాలా రోజుల తర్వాత ప్రయత్నిస్తున్నాను..తప్పులుంటే క్షమించాలి. దయతో సరిచేస్తే దిద్దుకుంటాను.

    రిప్లయితొలగించండి
  6. క్రమాలంకారం తప్ప తోచటం లేదండీ

    తండ్రి మాటనుజవ దాటని దెవ్వరు?
    ఏసు శిక్షలగొనె నెటుల? వరలు
    మహమ దీయుడెటుల మతమున? వరుసను
    రాముఁడు ముదమున ఖురాను చదివె.

    రిప్లయితొలగించండి
  7. యేమది గొప్ప సంబరములిత్తరి లంకను మిన్నుముట్టెడిన్
    రాముని జంపి హర్షమున రాక్షసులెల్లరు నాట్యమాడిరే
    భూమిజ మారి నాపయిని మోహము జెందెనె యన్న రాజుతో
    స్వామి క్షమింపుడద్ది కపిబంధన హేలని మంత్రి వాకొనెన్

    దువ్వూరి సుబ్బారావు

    రిప్లయితొలగించండి
  8. అసంఖ్య గారూ,
    ఆటవెలది పాదాన్ని కందంలో ఎంత చక్కగా ఇమిడ్చి పూరణ పంపారు! అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.
    రెండవ పాదం చివర "ఆంధ్రు డొకం డంత" అన్నచోట "ఆంధ్రుఁ డొకఁడు" అంటే సరిపోతుంది కదా!

    రిప్లయితొలగించండి
  10. నచికేత్ గారూ,
    సమయానుకూలమైన పూరణ. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఊకదంపుడు గారూ,
    చక్కని పూరణ పంపారు. ధన్యవాదాలు.
    సమస్యా పూరణంలో క్రమాలంకారాన్ని ప్రయోగించడం ప్రశస్తమైన సంప్రదాయమే. పండితామోదమే.

    రిప్లయితొలగించండి
  12. నారాయణ గారూ,
    మిస్సన్న అను దువ్వూరి సుబ్బారావు గారూ,
    "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీ పూరణలను వారాంతపు సమస్యా పూరణం - 5 లో ప్రచురించాను. మీ పూరణలపై నా వ్యాఖ్యలను అక్కడ చూడండి.

    రిప్లయితొలగించండి
  13. శంకరయ్య గారు!
    పరాకులో రెండవ పాదాన్ని మొదటి పాద లక్షణాలతో పూరించాను. మీ సవరణ సరిపోయింది.
    సరి చేసిన పద్యం :
    తాను మహమదీయుడైనగాని, తెలుగు
    నందు నారితేరె - ఆంధ్రు డొకడు
    తెచ్చి ఇడ ’ఖురాను’ తెలుగులో, ’మల్కిభ
    రాముడు’ ముదమున ’ఖురాను’ చదివె!
    మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. రామ దాసు బట్టి రాజు తానీషాయె
    బాధ పెట్టె తాను బంది ఖాన;
    అప్పు తీర్చి దాసు గొప్పతనము జెప్ప
    రాముఁడు, ముదమున ఖురాను చదివె.

    రిప్లయితొలగించండి
  15. ఏమని చెప్పెదన్ సుమతి? ఏడ్వగ రాముని భక్తులెల్లరున్
    గోముగ రంగనాయకమ కోపము మీరగ నిట్లు వ్రాసెబో:👇
    "రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే"
    చీమలు కుట్టగా గజము చిందులు త్రొక్కుచు చచ్చురీతినిన్

    రిప్లయితొలగించండి