1, సెప్టెంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 83

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అల్లా! కాపాడు మనుచు హరి వేడుకొనెన్.

11 కామెంట్‌లు:

  1. చల్లఁగఁ జూడుమ ఈశ్వర,
    అల్లా! కాపాడు మనుచు హరి వేడుకొనెన్
    యుల్లము నందున గాంధీ;
    ఎల్లరు దేవులుఁ దనకును ఏకమె యనుచున్.

    రిప్లయితొలగించండి
  2. ప్రల్లద మెరుగని ముల్లా
    బళ్ళారికి వోయియచట పామున్ జూచెన్
    బెల్లడిలి లేచి మ్రొక్కుచు
    అల్లా! కాపాడుమనుచు హరిఁ వేడుకొనెన్.
    (ఇక్కడ హరి=పాము)

    మరొక పూరణ, చిత్తగించండి- ఇది ఇంకొంత పామరపుది-
    మల్లాపురమున గల హరి
    నల్లాల రిపేరివాడు- నాటకమాడెన్
    ముల్లా వేసము గట్టుక
    అల్లా! కాపాడుమనుచు హరిఁ వేడుకొనెన్.
    (ఇక్కడ నాలుగో పాదంలో హరి=భగవంతుడు)

    రిప్లయితొలగించండి
  3. కల్లా కపటము తెలియక
    కల్లోలిత లోకమయ్యెనిల కలి ప్రాభవమునన్
    చల్లగ నీయగ సమతను
    అల్లా ! కాపాడు మనుచు హరి వేడు కొనెన్

    రిప్లయితొలగించండి
  4. రవి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.

    నారాయణ గారూ,
    రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    బెదరి, భయపడి అనే అర్థంలో "బెల్లడిలి" అనే పదాన్ని వాడారు. కాని ఆ పదం ఉన్నట్లు నాకైతే తెలియదు. నిఘంటువులోనూ లేదు.

    రాజేశరి నేదునూరి గారూ,
    చక్కని భావంతో పూరణ చేసారు. అభినందనలు.
    కాని రెండవ పాదంలో గణదోషం ఉంది. "కల్లోలిత లోకమయ్యె కలి ధర్మమునన్" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  5. నిజమేనండీ, వెతికితే 'బెగ్గడిల్లు' అని కనిపించింది :( కానీ మనకు ఆ పదం సరిపోదు- వేరేది ఆలోచిస్తాను.

    రిప్లయితొలగించండి
  6. అల్లాబక్ష ను వాడే
    ఇల్లాలికి జబ్బు చేయ నీశ్వరు గొలిచెన్!
    చల్లగ చూడగ మిత్రుడు
    అల్లా ! కాపాడు మనుచు హరి వేడు కొనెన్ !!

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ

    "అల్లాబక్ష ను వాడే
    ఇల్లాలికి జబ్బు చేయ నీశ్వరు గొలిచెన్!" పూరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. సరదాగా:

    నల్లని బురకా లందున
    తల్లుల, పిల్లలను దాచి దాడీ ప్రియులౌ
    చిల్లర బుద్ధుల తురకల
    నల్లా! కాపాడు మనుచు హరి వేడుకొనెన్ :)

    రిప్లయితొలగించండి