ఇది ఏమిటి?
కం.వండిన దెండిన దొక్కటి,
ఖండించిన పచ్చి దొకటి, కాలిన దొకటై
తిండికి రుచియై యుండును
ఖండితముగఁ దీనిఁ దెల్పు కవియుం గలఁడే?
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,అదేమిటో తెల్పండి. సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిపద్యరూపంలో మీ రిచ్చిన సరియైన సమాధానం చాలా బాగున్నది. అభినందనలు.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిఊకదంపుడు గారూ,
మీరు సరియైన సమాధానాన్ని పంపారు. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారి సమాధానం ....
రిప్లయితొలగించండివండగ వచ్చిన సున్నము
ఖండించిన తమల పాకు , కాల్చిన పోకన్
ఖండితముగఁ కలిపి నమల
తిండికి రుచియగు; విడియము తినవలె నెపుడున్ !
మందాకిని గారి సమాధానం ...
రిప్లయితొలగించండివక్క, తమలపాకు, సున్నము - తాంబూలము
తెలిపేవాళ్ళు, కవులు, తెల్పు కవులూ ఉన్నారు గురువు గారూ!
నేను మొదటిరకం మాత్రమే. అందుకే ఛందో రూప సమాధానం కష్టం.
*
ఊకదంపుడు గారి సమాధానం ...
vakka, Aku, sunnam kaligina taaMbUlam.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసమాధానంలో వరుస తప్పినట్టున్నారు. సున్నం, పోక తారుమారయ్యాయి.
శంకరార్యా ! ధన్యవాదములు. తాంబూలం వెసుకునే తొందరలో అలా జరిగింది. సవరిస్తు న్నాను...
రిప్లయితొలగించండివండగ వచ్చిన పోకను
ఖండించిన తమల పాకు , కాల్చిన సున్నం
ఖండితముగఁ కలిపి నమల
తిండికి రుచియగు;విడియము తినవలె నెపుడున్ !