26, ఆగస్టు 2011, శుక్రవారం

సమస్యా పూరణం -438 (సౌరభము సుంత లేని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
సౌరభము సుంత లేని పుష్పములె మేలు.
ఈ సమస్యను పంపిన
చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

51 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    ఇప్పుడు అలంకరణకు ఉపయోగపడే ఆకులతో ,చివుళ్ళతో,
    రకరకాల , రంగు రంగుల , పువ్వులు బజార్లో !
    ఒకసారి తెచ్చి పెట్టేస్తే - అస్తమానం మార్చే పనుండదు ! వాడిపోవు !


    01)
    __________________________________

    కృత్రి మంబైన నేమాయె - కిసలయములు
    రంగు రంగుల పూవులు - రక రకాలు
    మెరియు చుండును గృహమున - మిల మిల మిల
    సౌరభము సుంత లేని పు - ష్పములె మేలు !
    __________________________________

    రిప్లయితొలగించండి
  2. పూజ సేయగ పరిమళ పుష్ప చయము
    వద్ద లేవని భక్తుడా బాధ పడకు !
    మంత్ర పుష్పమ్ము భక్తిని మనసు విరియ
    సౌరభము సుంత లేని పుష్పములె మేలు!

    రిప్లయితొలగించండి
  3. శాస్త్రీజీ ! మంత్ర పుష్పమా !!! శహబాష్ !

    02)
    __________________________________

    సర్వ భక్షకు రీతిగా - జనుల మేయు
    సౌరభము కరమున గల - చవట కన్న
    అంద రానందమును గోరు - అన్న వంటి
    సౌరభము సుంత లేని పు - ష్పములె మేలు !
    __________________________________
    సౌరభము - (అధికారమునకు ప్రతీకగా తీసుకొనబడినది !)

    రిప్లయితొలగించండి
  4. హనుమఛ్ఛాస్త్రి గారూ, కిశోర్ జీ చాలా బాగున్నయి మీ ,మీ పూరణలు.

    రిప్లయితొలగించండి
  5. సౌరభము కల్గి వాడెడి స్రజము కన్న
    స్వర్ణ రజిత ప్రసూనముల్ ప్రభను గొలుపు.
    భక్తికాకరమై యొప్పు, వాడనట్టి
    సౌరభము సుంత లేని పుష్పములె మేలు.

    రిప్లయితొలగించండి
  6. మిత్రమా! కృష్ణునకు మారు మేలు జేయు
    యోధులను కోరితిని వేల నొడుపు గాను
    పరిమళము తోడ పని యేమి వాడిపోని
    సౌరభము సుంత లేని పుష్పములె మేలు!

    రిప్లయితొలగించండి
  7. మూర్తీజీ ! ధన్యవాదములు !
    చింతావారి స్వర్ణ, రజత పుష్పాలు చూడండి ! ధగ ధగ మంటున్నాయ్ !

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న మహాశయా ! బావుంది !
    కానీ సుయోధనుడు మీకు మిత్రుడెప్పుడైనట్టో ?

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న మహాశయా ! బావుంది !
    ఓహో ఇవి సుయోధనుడు కర్ణునితో చెప్పినట్టా !
    నేనే "కోరితివి" అని మీరన్నారనుకొని పొరబడ్డాను !
    "కోరితిని" - కదా ఉందక్కడ !

    రిప్లయితొలగించండి
  10. 01అ )
    __________________________________

    కృత్రి మంబైన నేమాయె - కిసలయములు
    రంగు రంగుల పూవులు - రక రకాలు
    మెరయు చుండును గృహమున - మిల మిల మిల
    సౌరభము సుంత లేని పు - ష్పములె మేలు !
    __________________________________

    రిప్లయితొలగించండి
  11. అతిశయము తోడ గూడిన యందమైన
    పడతి కన్న ప్రేమించెడి భార్య మేలు
    పూజకు సుగందపు మొగలి పూలకన్న
    సౌరభము సుంత లేని పుష్పములె మేలు

    రిప్లయితొలగించండి
  12. నిజమే కిశోర్ జీ శ్రీ చింతా రామకృష్ణా రావు గారి స్వర్ణ రజిత పుష్ప ధగ ధగలు సత్యభామకైనా ప్రీతి గొలుపు తాయి.
    పూజ కైనా,పూబోణుల కైనా :

    సౌరభము గల్గి హృదయమ్ము సౌరు గొల్పు
    పుష్పములు విలపించునే పూని ద్రుంప
    యంత్రముల బుట్టి పడియుండు నలుక లేక
    సౌరభము సుంత లేని పుష్పములు మేలు !

    రిప్లయితొలగించండి
  13. మూర్తీజీ ! మీ పుష్ప విలాపం ! ఇంకా బావుంది !
    కరుణశ్రీ గారు చెప్పినట్టు !
    ఔను మరి ! అవేడుస్తాయ్ ! యివేడవవ్ !

    రిప్లయితొలగించండి
  14. తెలుగుయాంకీగారూ ! మీ ప్రేమించే భార్య ముద్దులొలుకుతోంది !!

    రిప్లయితొలగించండి
  15. కిశోర్ జీ పుష్ప విలాపాన్ని అమృతభాండములో మీరే గుర్తు చేసారు

    రిప్లయితొలగించండి
  16. గురువు గారికి, పెద్దలందరికీ నా నమస్కారములు
    నాకు జున్ను చాల ఇష్టము, మూర్తి గారు మా ఉరోస్తే తప్పక జున్ను తినిపించెదను ,
    నేటి జనులకు కావలసినవి ఈ రూపమున
    తే: సౌరభము సుంత లేని పుష్పములె మేలు
    నీతి లేని వాడు ప్రభుత నైను జాలు,
    కోతి రూపమున్న వెనుక కోట్లు జాలు ,
    నేడు మధ్యము, ధనమిచ్చు నేత జాలు

    రిప్లయితొలగించండి
  17. వసంత కిశోర్ గారూ,
    ఇప్పటికి చేరిన మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ‘మంత్రపుష్ప’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    బంగారు, వెండి పూల మీ పూరణ తావి అబ్బిన స్వర్ణంలా ఆనందాన్నిచ్చింది. అభినందనలు.
    *
    కాజ సురేశ్ (తెలుగు యాంకి) గారూ,
    ధన్యవాదాలు. స్వాగతం!
    చక్కని అర్థాంతరన్యాసంతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘కిశోర్’జీ చెప్పినట్లు మీ పుష్పవిలాప పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    కందుల వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    కాకుంటే రెండవపాదంలో యతి తప్పింది. సవరించండి.

    రిప్లయితొలగించండి
  18. వన్నె వన్నెల పూలన్ని వాడిపోవు.
    చిన్న రజతములైనను జిలుగు తగ్గు.
    మానసమ్ము లెసుమములు మాధవుండ!
    సౌరభము సుంత లేని పుష్పములె మేలు

    రిప్లయితొలగించండి
  19. ఇంటి పక్కల నున్నట్టి యిరుగు పొరుగు
    గోడ దూకేసి కోసేరు కోతు లల్లె
    మల్లె, విరజాజి పూలెల్ల మనసు లేక!
    సౌరభము సుంత లేని పుష్పములె మేలు.
    - టేకుమళ్ళ వెంకటప్పయ్య.

    రిప్లయితొలగించండి
  20. నా పూరణ ...
    (ఈ సమస్యను పంపుతూ ‘చంద్రశేఖర్’ గారు పూలవాసన వల్ల ఎలర్జీ వస్తుందని అమెరికన్లు వాసనలేని పువ్వులనే ఇష్టపడతారని తెలిపారు)

    తమ కెలర్జీని కల్గించు సుమసుగంధ
    మందు రమెరికావాసు లటంచుఁ దెలిపె
    ‘చంద్రశేఖరు’; కనుక పాశ్చాత్యులకును
    సౌరభము సుంత లేని పుష్పములె మేలు!

    రిప్లయితొలగించండి
  21. మందాకిని గారూ,
    మనస్సును పూవుగా భావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. గురువు గారికి ధన్యవాదములతో

    రెండొవ పాదము సవరించి



    తే: సౌరభము సుంత లేని పుష్పములె మేలు

    నీతి నిండుకున్న ప్రభుత జాతి చాలు,

    కోతి రూపమున్న వెనుక కోట్లు జాలు ,

    నేడు మధ్యము, ధనమిచ్చు నేత జాలు

    రిప్లయితొలగించండి
  23. పసిడి , రజితాల విరుల సంపదలు గలిగి
    పండితులు లేని యే జనపదము లైన
    సౌరుభము సుంత లేని పుష్పములె - మేలు
    జరుగదు బుధుల మార్గదర్శనము లేక

    వెంకట రాజారావు .లక్కాకుల

    రిప్లయితొలగించండి
  24. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, ఆగస్టు 26, 2011 3:17:00 PM

    రాజా రావుగారు,

    అద్భుతమైన పూరణను ఇచ్చారండి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ఉదాత్తమైన పోలికతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. సౌరభము సుంత లేని పుష్పములె మేలు,
    లేక పోయిన రంగుల రేకులున్న
    కాగితపు పూలు చాలును ,వేగిరమున
    తీసుకొని రమ్ము ,చిత్రమ్ము తీయవలెను.

    రిప్లయితొలగించండి
  27. మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. సాహితీ మిత్రులందరికీ నమస్కారము. మీ పూరణలు అద్భుతముగా ఉన్నాయి. కంది శంకరయ్యగారికి, వసంత కిశోర్ గారికి ధన్యవాదములు.

    -కాజ సురేష్

    రిప్లయితొలగించండి
  29. తులసి దళముతో తూచెను తోయజాక్షి,
    పిడికె డటుకులతో గొల్చె పేదసఖుడు.
    ఆత్మసౌందర్య మేగదా హరికినచ్చు ,
    సౌరభము సుంతలేనిపుష్పములె,మేలు
    జేయగనువచ్చు భక్తితోజేయ పూజ!!!

    రిప్లయితొలగించండి
  30. ఆకాశము నుండి జారిపడిన సౌగంధికాపుష్ప సౌరభానికి
    దాని అందానికి ముగ్ధుడైన భీమసేనుడు ,వాటికోసం
    పడిన కష్టాలు మనకందరికీ యెరుకే గదా !

    3)
    __________________________________

    నాడు సానువు లందున - నడచు నపుడు
    సత్య సౌగంధికా పుష్ప - సౌరు ,సౌర
    భముల ; యిక్కట్ల పాలాయె - పవన సుతుడు !
    పూల కోసము, యిక్కట్ల - పొందు కన్న
    సౌరభము సుంతలేని పు - ష్పములె మేలు !
    __________________________________

    రిప్లయితొలగించండి
  31. శంకరుల స్ఫూర్తితో :

    ఉబ్బసం వ్యాధి గలవారికి పూల వాసన తగిల్తే తీవ్రతర మౌతుందట !

    4)
    __________________________________

    ఉబుకు నూపిరి తిత్తుల - నుబ్బసంబు
    పూల పుప్పొడి గలసిన - గాలి బీల్చ !
    ఊరకుండుట గాదొకొ - యుత్తమంబు !
    సౌరభము సుంతలేని పు - ష్పములె మేలు !
    __________________________________

    రిప్లయితొలగించండి
  32. భార్య ప్రేమను మరచిన భర్త కన్న
    కన్న వారిని కాదన్న కొడుకు కన్న
    సౌరు విరజిమ్ము వన్నెల విరుల కన్న
    సౌరభము సుంత లేని పుష్పములె మేలు !

    రిప్లయితొలగించండి
  33. భార్య ప్రేమను మరచిన భర్త కన్న
    కన్న వారిని కాదన్న కొడుకు కన్న
    సౌరు విరజిమ్ము రంగుల విరుల కన్న
    సౌరభము సుంత లేని పుష్పములె మేలు !
    [ " వన్నెల " తప్పేమో అని ]

    రిప్లయితొలగించండి
  34. @రాజేశ్వరి గారూ "భార్య ప్రేమను మరచిన భర్త కన్న" పూరణ సింపుల్ గ బాగుంది.

    రిప్లయితొలగించండి
  35. శంకరార్యా ! కిషోర్ జీ ! మూర్తి గారూ ! ధన్యవాదములు.
    మాస్టరు గారూ ! వాససనలు పడని అమెరికా వాసుల పూరణ చాల బాగుందండీ ! మిత్రులు చెప్పినట్లు రాజారావు గారి విరుపు బాగుంది .
    కవి మిత్రుల "సౌరభము సుంత లేని పుష్పములె మేలు" పూరణా సుమములు కవితా సౌరభములు విరజిమ్ముచున్నవి. అందరకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  36. మంద పీతాంబర్ గారూ,
    `ఆత్మసౌందర్యాన్ని" ఆవిష్కరించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ 3వ, 4వ పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి భావంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కానీ ... 2,4 పాదాలలో యతి తప్పింది.
    "కన్న వారిఁ గాదను నంగజుని కన్న
    సౌరు విరజిమ్ము రంగు ప్రసవము కన్న " అంటే ఎలా ఉంటుంది?
    (అంగజుడు = కొడుకు; ప్రసవము = పువ్వు)

    రిప్లయితొలగించండి
  37. నమస్కారములు.
    లక్కరాజు వారు నా తప్పుల్ని బాగుం దనడం ఏమి బాగా లేదు.
    తమ్ముడూ ! తప్పు లేకుండా వ్రాయడం నాకీ జన్మకి రాదు

    రిప్లయితొలగించండి
  38. తల్లి తుమ్మెద పలికెను పిల్ల తోడ
    "వెళ్ల వలదీవు సంపంగి విరుల కడకు
    మత్తు లోన మునిగి నీవు చిత్తవుదువు
    సౌరభము సుంత లేని పుష్పములె మేలు"!!

    రిప్లయితొలగించండి
  39. కవి మిత్రులకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  40. శ్రీగురుభ్యోనమ:

    మఱ్ఱియాకులు మనకేల వెఱ్ఱివాడ
    కృత్రిమంబగు కాగిత{ప్లాస్టికు} పత్రముండె
    సుమ సుగంధము లెందుకు సొమ్మసిల్ల
    సౌరభము సుంత లేని పుష్పములె మేలు !

    రిప్లయితొలగించండి
  41. రాజేశ్వరి అక్కయ్యగారూ మీరు గురువుగారికి పని చెప్పాలనే ఉద్దేశంతో కావాలనే తప్పులు వ్రాస్తుంటారని నేననుకొంటాను.
    "మీరనుకొన్నచో కవులు మెచ్చగ పద్యము వ్రాయ శక్యమే"

    రిప్లయితొలగించండి
  42. నమస్కారములు
    శాస్త్రి గారూ ! నన్నుత్తగా పొగుడు తున్నారంతే .నాకు కొన్ని సందేహాలు తీరటల్లేదు . ఆంటే నా నాలెడ్జి సరిపోవటల్లేదు . అదన్నమాట అసలు సంగతి !

    రిప్లయితొలగించండి
  43. చంద్రశేఖర్:
    కవిమిత్రులకు మన:పూర్వక ధన్యవాదాలు. సమస్య తయారు చేసి పంపినపుడు ఈ సమస్యని ఇన్నిరకాలుగా ఇంత అద్భుతంగా పూరించ వచ్చని నేను ఊహించలేదు. మీమీ కల్పనా శక్తికి జోహార్లు. మనకి కల్పనా శక్తి ఇచ్చిన దేవుడికి శతకోటి వందనాలు.
    శంకరయ్య మాస్టారు, "అమెరికా అలెర్జీ"ని అద్భుతంగా పట్టి పద్యంలో బంధించారు. మీవంటి మాస్టార్లు మాకు దొరికినందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా కూడా వుంది. శతమానం భవతి!

    రిప్లయితొలగించండి
  44. రాజేశ్వరి గారూ తప్పులు పట్టడం నా పని కాదుగా, శంకరయ్య మాస్టారి పని.

    రిప్లయితొలగించండి
  45. అంటే ? ? ?
    మా తమ్ముణ్ణి , అందునా గురువు గార్ని ? అబ్బే , నేనస్సలోప్పుకోను ." ఇది మన బడి. " గురువు గార్ని ఏమైనా అంటే ? [ గోడ కుర్చీ వేయాలి , లేదా గుంజీలు తీయాలి ] " పాఠం నేర్పడం అనాలి. లేదా తప్పులు సరిదిద్దడం అనాలి సరేనా ? [ సరదాగా కొన్నేళ్ళు వెనక్కి వెడదాం ]

    రిప్లయితొలగించండి
  46. రాజేశ్వరి గారూ తప్పయింది క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి
  47. భలే వారె ! ఇంత మత్రానికా ? " సరదాకి " అని వ్రాసాను కదా ? { ఇవన్నీ బడిలో సరదాలు మాత్రమె ] క్షమా పణలా ? అబ్బే అస్సలు ఒప్పుకోను

    రిప్లయితొలగించండి
  48. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  49. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ ‘మాతృహితబోధ’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్ర్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.
    *
    మిత్రులు పరస్పరం సరదా ముచ్చట్లు చెప్పుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి