మిస్సన్న గారూ ! మూర్తి గారూ !ధన్యవాదములు. వెన్నెలఱేఁడు సాక్షిగా శివ కేశవుల వైరాన్ని చూపిన మూర్తి గారి పూరణ, సమస్యను విడదీసి శివ కేశవులను కలిపిన సంపత్కుమార శాస్త్రి గారి పూరణ అలరించాయి.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, దబాయించి ప్రశ్నించి శివుణ్ణి విష్ణువుకు శత్రువుగా చేసిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, ఉత్తమమైన పూరణ. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ఇద్దరి వైరుధ్యాలను వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు. ‘పన్నగ మొక్క రలంకరింపగా’ అంటే ఎలా ఉంటుంది? * అజ్ఞాత గారూ, ధన్యవాదాలు. ‘తార్చు’ శబ్దానికి రూఢ్యర్థం సంగతి వదిలేస్తే ‘చేర్చు, కూర్చు, దగ్గరగా తీయు, ఉంచు, పొందించు’ మొదలైన అర్థాలున్నాయి. మూర్తి గారి ప్రయోగం అర్థవంతమే అనుకుందాం. మీ సవరణ బాగుంది. * జిగురు సత్యనారాయణ గారూ, ఉషాపరిణయ ఘట్టాన్ని ఆలంబన చేసికొన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, అద్వైతాన్ని ప్రతిబింబించిన మీ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
గురువు గారూ ధన్యవాదములు. అజ్ఞాత గారూ ధన్యవాదములు. తార్చు,చేర్చు పదాలు మూడు పర్యాయము లిటునుంచి అటు,అటునించి యిటు మార్చి చివరికి నా కోతి బుధ్ధితో' తార్చు ' పదానికే ఓటు వేసాను. ఒకసారి నిఘంటువు ( ఆంధ్రభారతి ) కూడా పరిశీలించి గురువుగారు చెప్పిన అర్ధాలు చూసి ఫరవా లేదనే ఆ పదము ప్రయోగించాను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ఇప్పుడు అనుమాననివృత్తి జరిగింది. మీరు ‘సంపన్నత మేన దాల్చు’ అంటే సంపదను (లక్ష్మిని) మేన దాల్చిన వాడొకడు అనుకున్నాను. మళ్ళి పన్నగమెక్కి త్రొక్కడం విష్ణువుకే అన్వయిస్తుంది కదా అని అలా సూచించాను. ఇప్పుడు మీ సవరణతో సార్థకమయింది. ధన్యవాదాలు.
మందాకిని గారూ, ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మూడవపాదంలో అఖండయతి పండితామోదమే. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, సవరించిన దాని కంటే ముందున్నదే బాగుందనిపిస్తున్నది.
దక్షయజ్ఞభగ్న సమయంలో విష్ణుదేవుడుయును భయపడ్డాడని ఒక హరికథదాసు చెప్పగా విన్నాను. విష్ణుదేవుడు యజ్ఞానికే రాలేదని చదివినాను. ఏది సరియైనను దేవతలను బాధ పెట్టుటవలన తాత్కాలికంగా శివుడు విష్ణువుకు వైరి ఐనాడనే భావంతో వ్రాశాను.భావాన్ని పద్యంలో సరిగా యిమడ్చలేకప్ పొయినాను. మన్నించప్రార్థన.
శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. మీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. అభినందనలు. * మిస్సన్న గారూ, సమస్య చిన్నదైనా పెద్దదైనా పూరించడం మీకు ‘సమస్య’ కాదని ఎప్పుడో నిరూపించారు. చక్కని పూరణ. అభినందనలు. * పింగళి వేంకట శ్రీనివాస రావు (శ్రీకాశ్యప) గారూ, పింగళి శశిధర్ గారితో పాటు మీకూ సవినయంగా స్వాగతం పలుకుతున్నాను. సంతోషం! అద్భుతమైన పూరణతో బ్లాగుకు వన్నెతెచ్చారు. ధన్యవాదాలు. మీ ‘జాబిల్లి రావె’ బ్లాగును, అందులో మీ శశిధర్, మోహిని గారల పద్యాలను చదివి ఆనందించాను. మంచి ప్రయత్నం. కొనసాగించండి.
శ్రీనివాస రావు (శ్రీకాశ్యప) గారూ, మీరు సమస్యలను పంపిస్తామంటే అందకంటె భాగ్యం మరొకటి ఉందా. నేను సమస్యలు పంపమని కవిమిత్రు లందరినీ అభ్యర్థించాను కూడా. మిస్సన్న, చంద్రశేఖర్, లక్కాకుల వెంకట రాజారావు, వరప్రసాద్ తదితర మిత్రులు పంపిన సమస్యలను స్వీకరించి ప్రకటించి వారికి ధన్యవాదాలూ తెలుపుతున్నాను. తప్పకుండా పంపండి. నాకు ఎంతో మేలు చేసిన వారవుతారు. ధన్యవాదాలు.
నా చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఒకపద్యం చదువుకున్న గుర్తు. అయితే మెదటిపాదమే గుర్తుంది. మిగతావి గుర్తులేవు. ఎవరైనా తెలిసినవారు వుంటే చెప్పండి.
"సరసిజనేత్రి నీ మగని చక్కని పేరువచింపుమన్న" అని అడిగితే భర్తపేరు చెప్పడానికి సిగ్గుపడి కొన్నిపదాలు చెప్పిందట. ఆ యా పదాల లోని మధ్యాక్షరాలు కలిపితే అతని పేరు వస్తుందట. బహుశ: "రంగనాయకులు" అనుకుంటాను అతనిపేరు.
శ్రీనివాస రావు గారూ, ‘సరసిజనేత్రి ...’ పద్యాన్ని ‘శంకరాభరణం’ బ్లాగులో 7-1-2011 నాడు ‘ప్రహేళికలు’ శీర్షికపై పరిచయం చేసాను. ఈ విషయం మరిచిపోయి (వయోభారం .. జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోంది!) 24-7-2011 నాడు ‘చమత్కార పద్యాలు - 111 (ప్రహేళికలు) శీర్షికపై మళ్ళీ ప్రకటించాను. ఒకసారి పాతపోస్టులను చూడండి.
పింగళి మోహిని గారూ, మీ కవిపండిత కుటుంబానికి నా నమోవాకాలు. మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు. అయితే చిన్న లోపాలు ... పద్యం మధ్యలో అచ్చు రావడం ‘రణాంగనమ్మున ఉషాపతి’, సరళాదేశం రావలసినచోట రాకపోవడం ‘బాణునిన్ కదియు’, యడాగమదోషం ‘శత్రులట్లు యా’... ‘రణాంగనమ్మున నుషాపతి’, ‘బాణునిన్ గదియు’, ‘శత్రులట్టు లా’ అంటే సరి! దోషైకదృక్కు నని కోపం తెచ్చుకోకండి.
స్వంత కుమారు డయిన మన్మధుడిని కాల్చిన వాడు శత్రువు గాక మిత్రు డవుతాడా !
రిప్లయితొలగించండికన్నియఁ దార్చ బూని దమకమ్మున బుష్పము లేయు పుత్రునిన్
గ్రన్నన జిచ్చుకంట గని గాల్చగ నెంచె శివుండు గ్రూరతన్
వెన్నెలఱేఁడు సాక్షిగను వేలుపు లందఱు చూచు చుండగాఁ,
బన్నగ భూషణుం డరయ పన్నగ శాయికి వైరి యయ్యెడిన్ !
ఎన్నగ శుభ్రకీర్తియుతుడీశ్వరుడుత్తమ భక్తజాతి సం
రిప్లయితొలగించండిపన్నుడు, యుద్దమందిచట బాసటయయ్యెను శూలపాణియై
పన్నగ భూషణుండరయ పన్నగ శాయికి, వైరి యయ్యెడిన్
మున్ను జలంధరుండనెడు మూర్ఖుడు యీ జగతిన్ కృశింపగాన్.
అన్నిట వైర మిద్దరకు నడ్డము నిల్వులు నామమందు, సం
రిప్లయితొలగించండిపన్నత మేను దాల్చ మరి పన్నగ మొక్కరు యెక్కి త్రొక్కుగా !
నెన్నగ తెల్లవా డొకరు నీలపు చాయన నల్ల నొక్కరౌ
పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్ !!
ముగ్గురూ ముగ్గురే!
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ ధన్యవాదములు. సంపత్కుమార శాస్త్రి గారూ మీ పదజాలముతో మీరు శుభ్రకీర్తియుతులు. హనుమచ్ఛాస్త్రి గారూ మీ పద్యము హృద్యముగా ఉంది.
రిప్లయితొలగించండిమూర్తి గారికి మరియు మిస్సన్న గారికి నా ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ ! మూర్తి గారూ !ధన్యవాదములు.
రిప్లయితొలగించండివెన్నెలఱేఁడు సాక్షిగా శివ కేశవుల వైరాన్ని చూపిన మూర్తి గారి పూరణ,
సమస్యను విడదీసి శివ కేశవులను కలిపిన సంపత్కుమార శాస్త్రి గారి పూరణ
అలరించాయి.
మూర్తి గారూ - కన్నియఁ జేర్చ బూని అందామా?
రిప్లయితొలగించండిపన్నగ భూషణుండె తన వాకిటి కావలి కాగ గర్వియై
రిప్లయితొలగించండిమన్నన లేని బాణుడు కుమార్తె నెపంబున వైరమూని ఆ
వెన్నల చోరునిన్ తెగిడెఁ పిల్చిన పల్కెడి శూలి అండతో
పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్!!
ఎన్ని పఠింపనేమిటికి నేడ్వన? నా పరమాత్మ రూపమున్
రిప్లయితొలగించండిఛిన్నముజేసి, రెండుగను జీల్చి, మతాలుగ మార్చి,జాతినే
భిన్నము జేసిరే!యకట!భేదములేడ?-విమూఢచిత్తులన్
పన్నగ భూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడున్
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిదబాయించి ప్రశ్నించి శివుణ్ణి విష్ణువుకు శత్రువుగా చేసిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
ఉత్తమమైన పూరణ. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఇద్దరి వైరుధ్యాలను వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
‘పన్నగ మొక్క రలంకరింపగా’ అంటే ఎలా ఉంటుంది?
*
అజ్ఞాత గారూ,
ధన్యవాదాలు.
‘తార్చు’ శబ్దానికి రూఢ్యర్థం సంగతి వదిలేస్తే ‘చేర్చు, కూర్చు, దగ్గరగా తీయు, ఉంచు, పొందించు’ మొదలైన అర్థాలున్నాయి. మూర్తి గారి ప్రయోగం అర్థవంతమే అనుకుందాం. మీ సవరణ బాగుంది.
*
జిగురు సత్యనారాయణ గారూ,
ఉషాపరిణయ ఘట్టాన్ని ఆలంబన చేసికొన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
అద్వైతాన్ని ప్రతిబింబించిన మీ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
గురువు గారూ ధన్యవాదములు. అజ్ఞాత గారూ ధన్యవాదములు. తార్చు,చేర్చు పదాలు మూడు పర్యాయము లిటునుంచి అటు,అటునించి యిటు మార్చి చివరికి నా కోతి బుధ్ధితో' తార్చు ' పదానికే ఓటు వేసాను. ఒకసారి నిఘంటువు ( ఆంధ్రభారతి ) కూడా పరిశీలించి గురువుగారు చెప్పిన అర్ధాలు చూసి ఫరవా లేదనే ఆ పదము ప్రయోగించాను.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు. పామును ఒంటి మీద ఒకరు వుంచుకుంటే వేరొకరు ఎక్కి త్రొక్కు చున్నారని నాభావం.
రిప్లయితొలగించండిచిన్న సవరణతో..
అన్నిట వైర మిద్దరకు నడ్డము నిల్వులు నామమందు, పై
చెన్నుగ మేన దాల్చొకరు పన్నగ మొక్కరు యెక్కి త్రొక్కుగా !
నెన్నగ తెల్లవా డొకరు నీలపు చాయన నల్ల నొక్కరౌ
పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్ !!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఇప్పుడు అనుమాననివృత్తి జరిగింది.
మీరు ‘సంపన్నత మేన దాల్చు’ అంటే సంపదను (లక్ష్మిని) మేన దాల్చిన వాడొకడు అనుకున్నాను. మళ్ళి పన్నగమెక్కి త్రొక్కడం విష్ణువుకే అన్వయిస్తుంది కదా అని అలా సూచించాను. ఇప్పుడు మీ సవరణతో సార్థకమయింది. ధన్యవాదాలు.
కన్నులు మిన్నులుం గనక కావరమెక్కిన దైత్యులందరున్
రిప్లయితొలగించండిమన్ననఁ జేసిరంచుఁ ఘనమైన వరమ్ముల నిచ్చి, శంభుడా
పన్నగ భూషణుండరయ, పన్నగశాయికి వైరియయ్యెడిన్
దన్నుగఁ నిర్వురన్గొలుతుఁ; దప్పుల నెంచగ నాతరమ్మటే?
గురువుగారూ మన్నించండి.
రిప్లయితొలగించండిహనుమచ్చాస్త్రి గారూ మీ పూరణలోని ౨, ౩ పాదాలలో యతిని సరిజేసుకోండి.
మిస్సన్న గారూ ! ధన్యవాదములు.సవరణ చేయు తొందరలో చూసుకో లేదు. కానీ మూడవ పదం లో 'నే , నీ ' కి యతి సరి పోయింది కదా .. ౨ వ పాదం సరి చేస్తున్నాను.
రిప్లయితొలగించండిఅన్నిట వైర మిద్దరకు నడ్డము నిల్వులు నామమందు, చె
ప్ప న్నగ వోలె దాల్చొకరు పన్నగ మొక్కరు యెక్కి త్రొక్కుగా !
నెన్నగ తెల్లవా డొకరు నీలపు చాయన నల్ల నొక్కరౌ
పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్ !!
శ్రీ గురుభ్యో నమః
రిప్లయితొలగించండినా పద్యానికి చిన్న సవరణ ;
కన్నియఁ దార్చ బూని దమకమ్మున బుష్పము లేయు పుత్రునిన్
గ్రన్నన జిచ్చుకంట గని గాల్చగ నెంచె శివుండు గ్రూరతన్
వెన్నెలఱేఁడు సాక్షిగను వేల్పులు గాంచగ భీతిఁ జెందుచున్
బన్నగ భూషణుం డరయ పన్నగ శాయికి వైరి యయ్యెడిన్ !!!
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మూడవపాదంలో అఖండయతి పండితామోదమే.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
సవరించిన దాని కంటే ముందున్నదే బాగుందనిపిస్తున్నది.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిజన్నము జేసె దక్షుడటు శంభుని ఖిన్నుని జేసినంత వి
చ్ఛిన్నము జేసె యజ్ఞమును చేగొని వీరుడు వీరభద్రుడే
వెన్నుగ నిల్చి రుద్రునకు వేల్పులు నెల్లరు పారిపోవగా
పన్నగభూషణుండరయ పన్నగశాయికి వైరియయ్యెడిన్
దక్షయజ్ఞభగ్న సమయంలో విష్ణుదేవుడుయును భయపడ్డాడని ఒక హరికథదాసు
చెప్పగా విన్నాను.
విష్ణుదేవుడు యజ్ఞానికే రాలేదని చదివినాను. ఏది సరియైనను దేవతలను బాధ పెట్టుటవలన తాత్కాలికంగా శివుడు
విష్ణువుకు వైరి ఐనాడనే భావంతో వ్రాశాను.భావాన్ని పద్యంలో సరిగా యిమడ్చలేకప్
పొయినాను. మన్నించప్రార్థన.
హనుమచ్చాస్త్రి గారూ మన్నించాలి. ౩వ పాదంలో యతి భంగ మైనదనుకొన్నాను.
రిప్లయితొలగించండిగురువుగారూ దయచేసి ' అఖండ యతి ' లక్షణాలను విశదీకరించండి.
గురువు గారూ అలా అయితే సవరణ పద్యము తొలగించండి. నాకు చిత్తు బుట్ట అందుబాటులో లేదు.
రిప్లయితొలగించండిచిన్న సమస్య నిచ్చి రని చేయగ పూరణ నిన్ని రోజులున్
రిప్లయితొలగించండియెన్ని పురాణముల్ కథల నెన్ని పఠించితి! నేమి చెప్పుదున్
చిన్న తగాద యేని కడు చిత్రము కన్పడకుండె ! నెత్తరిన్
పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్ ?
క్రన్నన దీక్షబూననిడె కామిత పాశుపతమ్ము మెఛ్చుచున్
రిప్లయితొలగించండిమన్నన జేసి పార్థుని సమాహిత మాయ కిరాతమూర్తి యా
పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరియయ్యె నా
పన్నుని యార్తునిన్ గయుని పార్థుడె కావదలంచి యేర్పడన్
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. మీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
సమస్య చిన్నదైనా పెద్దదైనా పూరించడం మీకు ‘సమస్య’ కాదని ఎప్పుడో నిరూపించారు.
చక్కని పూరణ. అభినందనలు.
*
పింగళి వేంకట శ్రీనివాస రావు (శ్రీకాశ్యప) గారూ,
పింగళి శశిధర్ గారితో పాటు మీకూ సవినయంగా స్వాగతం పలుకుతున్నాను. సంతోషం!
అద్భుతమైన పూరణతో బ్లాగుకు వన్నెతెచ్చారు. ధన్యవాదాలు.
మీ ‘జాబిల్లి రావె’ బ్లాగును, అందులో మీ శశిధర్, మోహిని గారల పద్యాలను చదివి ఆనందించాను. మంచి ప్రయత్నం. కొనసాగించండి.
ధన్యవాదములు. మా బ్లాగ్ చూసినందుకు సంతోషం. సమస్యలను కూడా పంపవచ్చంటే చెప్పండి, నేనూ పాలుపంచుకుంటాను. అందుకేమయినా నిబంధనలుంటే తెలుపండి.
రిప్లయితొలగించండిశ్రీనివాస రావు (శ్రీకాశ్యప) గారూ,
రిప్లయితొలగించండిమీరు సమస్యలను పంపిస్తామంటే అందకంటె భాగ్యం మరొకటి ఉందా. నేను సమస్యలు పంపమని కవిమిత్రు లందరినీ అభ్యర్థించాను కూడా. మిస్సన్న, చంద్రశేఖర్, లక్కాకుల వెంకట రాజారావు, వరప్రసాద్ తదితర మిత్రులు పంపిన సమస్యలను స్వీకరించి ప్రకటించి వారికి ధన్యవాదాలూ తెలుపుతున్నాను.
తప్పకుండా పంపండి. నాకు ఎంతో మేలు చేసిన వారవుతారు.
ధన్యవాదాలు.
గురువుగారూ ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిక్రొత్త మిత్రులు పింగళి వారి పూరణ మనోజ్ఞంగా ఉంది.
కవిమిత్రులారా!
రిప్లయితొలగించండినా చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఒకపద్యం చదువుకున్న గుర్తు. అయితే మెదటిపాదమే గుర్తుంది. మిగతావి గుర్తులేవు. ఎవరైనా తెలిసినవారు వుంటే చెప్పండి.
"సరసిజనేత్రి నీ మగని చక్కని పేరువచింపుమన్న" అని అడిగితే భర్తపేరు చెప్పడానికి సిగ్గుపడి కొన్నిపదాలు చెప్పిందట. ఆ యా పదాల లోని మధ్యాక్షరాలు కలిపితే అతని పేరు వస్తుందట. బహుశ: "రంగనాయకులు" అనుకుంటాను అతనిపేరు.
పింగళి వారూ ఈ బ్లాగులోని " చమత్కార పద్యాలు - 111 (ప్రహేళిక) "
రిప్లయితొలగించండిచూడండి.
శ్రీనివాస రావు గారూ,
రిప్లయితొలగించండి‘సరసిజనేత్రి ...’ పద్యాన్ని ‘శంకరాభరణం’ బ్లాగులో 7-1-2011 నాడు ‘ప్రహేళికలు’ శీర్షికపై పరిచయం చేసాను.
ఈ విషయం మరిచిపోయి (వయోభారం .. జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోంది!) 24-7-2011 నాడు ‘చమత్కార పద్యాలు - 111 (ప్రహేళికలు) శీర్షికపై మళ్ళీ ప్రకటించాను.
ఒకసారి పాతపోస్టులను చూడండి.
మున్ను వరాన బాణునకు ముంగిలి కావలి యయ్యె శూలి యా
రిప్లయితొలగించండిసన్న రణాంగనమ్మున ఉషాపతి యయ్యనిరుద్ధు కోసమై
వెన్నుడు బాణునిన్ కదియు వేళ పరస్పర శత్రులట్లు యా
పన్నగ భూషణుండరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్
పింగళి మోహిని గారూ,
రిప్లయితొలగించండిమీ కవిపండిత కుటుంబానికి నా నమోవాకాలు.
మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
అయితే చిన్న లోపాలు ... పద్యం మధ్యలో అచ్చు రావడం ‘రణాంగనమ్మున ఉషాపతి’, సరళాదేశం రావలసినచోట రాకపోవడం ‘బాణునిన్ కదియు’, యడాగమదోషం ‘శత్రులట్లు యా’... ‘రణాంగనమ్మున నుషాపతి’, ‘బాణునిన్ గదియు’, ‘శత్రులట్టు లా’ అంటే సరి! దోషైకదృక్కు నని కోపం తెచ్చుకోకండి.
మున్నెపుడో వరమ్మిడగ ముప్పులు రాగనె భస్మమయ్యెడిన్
రిప్లయితొలగించండివిన్నప మొల్లుచున్ చనుచు భీషణ దైత్యుని కాల్చినందునన్
చిన్నగ చూచినాడనుచు చెప్పుడు మాటలు నమ్మినందునన్
పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్