గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ‘మారమ్మ’ విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, నా కన్నతల్లి ‘మల్లమ్మ’. ఆ మాతృదేవత పాదపద్మాలకు నమస్కరిస్తూ చక్కని పూరణ నిచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. కాకుంటే వ్యావహారిక పదాడంబరం ఎక్కువయించి. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, గౌరమ్మను విషయంగా చేసిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ, అద్భుతమైన పూరణ. అభినందనలు. కాకుంటే కొన్ని లోపాలు. నా సవరణలతో (బ్రాకెట్లలో) మీ పూరణ ...
రమ్మున్ (ద్రా)గుటలో మునింగి దలచెన్ రాజ్యాని కిన్ రాజుగా (న)మ్మూటల్ పసిడిన్, సమస్త జన (మే) యాధీన (మైపో)యె వో యమ్మో! జూచితి(వా! య)హా! (కల నిదే) యేమర్చి (యో)సే! హు! నీ అమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్ * చింతా రామకృష్ణారావు గారూ, ‘నేరమ్మా’ అని ప్రశ్నించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
అమ్మామిత్రులఁతోడనాడవలె నే నంచున్ సుతుండాత్రుడై అమ్మారమ్మని బిల్చె; భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్ పొమ్మాబాబుకు లాల బోయమని పంపున్ భార్య నీ వేళ కీ కొమ్మన్ పూలను మాలగట్టగను నే కూర్చుందు దైవమ్ముకై.
నేదునూరి రాజేశ్వరి (అక్కయ్య)గారూ, ధన్యవాదాలు. * మందాకిని గారూ, మీ మూడు పూరణలు వైవిధ్యంగా ముచ్చటగా ఉన్నాయి. ముఖ్యంగా రెండవపూరణ ధారాశుద్ధి కలిగి చక్కగా సరసంగా ఉన్నాయి. మీకు అభినందనత్రయం!
అమ్మా నాన్నమరుద్వతీ యనుచు నానాడేమొ పేర్వెట్టగా
రిప్లయితొలగించండిఅమ్మాయిప్పుడు పెండ్లి గాగ నడువ న్నత్తింటి లో భర్తయే
కొమ్మన్ ముద్దుగ బిల్వ తాను పలుకున్ మారమ్మనిన్ ప్రేమతో
'అమ్మారమ్మని' పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్.
ఆ + మారమ్మని = 'అమ్మారమ్మని'
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిశాస్త్రీజీ ! బావుంది !
01)
_________________________________________
సమ్మోహంబగు కంఠమున్ , తన పతిన్ - శ్రావ్యంబ కీర్తించగన్
సమ్మోదంబును బొందినట్టి పతి , యా - సన్మార్గ, సంసేవితన్
సమ్మానింప దలంచి,మెచ్చి ,బిగియౌ- సంశ్లేష మందివ్వ, మ
ల్లమ్మా, రమ్మని పిల్చె భర్త తన య - ర్ధాంగిన్ ప్రమోదమ్మునన్.
_________________________________________
01అ )
రిప్లయితొలగించండి_________________________________________
సమ్మోహంబగు కంఠమున్ , భగవతిన్ - శ్రావ్యంబ కీర్తించగన్
సమ్మోదంబును బొందినట్టి పతి , యా - సన్మార్గ, సంసేవితన్
సమ్మానింప దలంచి,మెచ్చి ,బిగియౌ- సంశ్లేష మందివ్వ, మ
ల్లమ్మా, రమ్మని పిల్చె భర్త తన య - ర్ధాంగిన్ ప్రమోదమ్మునన్.
_________________________________________
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగురువులకు,కవిమిత్రులకు శ్రీకృష్ణాష్టమిపర్వదిన శుభాకాంక్షలు.
అమ్మానాన్నలు బెంగపెట్టుకొనుచూ అబ్బాయినిన్ పంపగా
చెమ్మల్ చిందెడు ప్రేమతో మృదువుగా చెల్లిన్ సమీపించుచూ
అమ్మా రమ్మని పిల్చె, భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్
పొమ్మంజెప్పెను అన్నవెంట ముదమున్ పుట్టింటికిన్ పంపుచున్
ముల్లోకములలోను విశెషంగా పూజింపబడుతున్న వినాయకుడికి భూలోకములో పత్రి పూజను చేయుచున్నరని ఈశ్వరుడు పార్వతితో అంటున్నట్లుగా ( చమత్కార ధోరణిలో )
రిప్లయితొలగించండిబొమ్మన్ జేసితివీవు నాడు మహిమన్, పూజింప ముల్లోకముల్,
చెమ్మల్ చిమ్మెడు నావినాయకుని, సంక్షిప్తంబుగా జేసి యా
కొమ్మల్ పూలను దెచ్చి భూజనులు గైకొమ్మందురే చూడు గౌ
రమ్మా!! రమ్మ!ని పిల్చె భర్త తనయర్ధాంగిన్ ప్రమోదంబునన్.
రమ్మున్ దాగుటలో మునింగి దలచెన్ రాజ్యాని కిన్ రాజుగాన్;
రిప్లయితొలగించండియమ్మూటల్ పసిడిన్, సమస్త జనమున్ యాధీన మంబాయె వో
యమ్మో! జూచితిరా! అహా! యని కలన్ యేమర్చి ఓసే! హు! నీ
అమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్
సమ్మాన్యున్ నను పల్కరింపవుకదా, సఖ్యంబుతో బిల్చినన్
రిప్లయితొలగించండిగొమ్మంచున్ గొన నీయలేదని కదా కోపంబు నాపై.సఖీ!
సొమ్ముల్ చాలక తేక పోవుటదియే శోభాంగి! నావల్ల నే
రమ్మా! రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండి‘మారమ్మ’ విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
నా కన్నతల్లి ‘మల్లమ్మ’. ఆ మాతృదేవత పాదపద్మాలకు నమస్కరిస్తూ చక్కని పూరణ నిచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాకుంటే వ్యావహారిక పదాడంబరం ఎక్కువయించి.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
గౌరమ్మను విషయంగా చేసిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
అద్భుతమైన పూరణ. అభినందనలు.
కాకుంటే కొన్ని లోపాలు. నా సవరణలతో (బ్రాకెట్లలో) మీ పూరణ ...
రమ్మున్ (ద్రా)గుటలో మునింగి దలచెన్ రాజ్యాని కిన్ రాజుగా
(న)మ్మూటల్ పసిడిన్, సమస్త జన (మే) యాధీన (మైపో)యె వో
యమ్మో! జూచితి(వా! య)హా! (కల నిదే) యేమర్చి (యో)సే! హు! నీ
అమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్
*
చింతా రామకృష్ణారావు గారూ,
‘నేరమ్మా’ అని ప్రశ్నించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిశంకరయ్య గారూ! మీ సవరణలకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఒక్కోసారి ఎంత ప్రయత్నించినా మంచి పదాలు పడవు.
ఒక్కోసారి అలవోకగా వాటంతట అవే గణాలు సర్దుకుంటాయి.
అదీ విషయం.. సమయం ఉండాలి. ఒక పది నిముషాలు కేటాయించి
ఈలోపు పద్యం అయిపోవాలి అనుకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయి.
ధన్యవాదములతో.... టేకుమళ్ళ వెంకటప్పయ్య.
గురువుగారూ ధన్యవాదములు
రిప్లయితొలగించండిశ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా [ గురువులకు ] ప్రియ సోదరులకు శుభా కాంక్షలు
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅమ్మారమ్మిటు చేతు వందనములన్ హర్షాతిరేకంబుతో
రిప్లయితొలగించండినమ్మానా సతితోడ! నీ పలుకు మాకాశీస్సుగా నౌను లే
వమ్మారమ్మని పిల్చె; భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్
రమ్మంచున్ తనఁ జేయిపట్టినడచెన్ రారాజుగా ఠీవితోన్.
నెమ్మేనే పులకించెనేమొ, మదనా నీ బాణఘాతమ్ములే
రిప్లయితొలగించండిసమ్మోహాస్త్రముగాను నాథుని మదిన్ చల్లంగ, బంగారు చి
ల్కమ్మా ,రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్
ముమ్మార్లచ్చెలినప్డు, ముద్దు మొగమున్ ముద్దాడ మోహమ్ముతోన్.
అమ్మామిత్రులఁతోడనాడవలె నే నంచున్ సుతుండాత్రుడై
రిప్లయితొలగించండిఅమ్మారమ్మని బిల్చె; భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్
పొమ్మాబాబుకు లాల బోయమని పంపున్ భార్య నీ వేళ కీ
కొమ్మన్ పూలను మాలగట్టగను నే కూర్చుందు దైవమ్ముకై.
నేదునూరి రాజేశ్వరి (అక్కయ్య)గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
మందాకిని గారూ,
మీ మూడు పూరణలు వైవిధ్యంగా ముచ్చటగా ఉన్నాయి. ముఖ్యంగా రెండవపూరణ ధారాశుద్ధి కలిగి చక్కగా సరసంగా ఉన్నాయి.
మీకు అభినందనత్రయం!
ధన్యవాదాలు గురువుగారూ!
రిప్లయితొలగించండిశ్రీ గురుభ్యో నమః
రిప్లయితొలగించండికొమ్మన్ బ్రేమను బెండ్లియాడి ఘనమున్ గ్రొంగొత్త దేశమ్ములో
నమ్మా నాన్నల జూపెదంచు దనతో నాత్రమ్ము జేరింట 'యో !
యమ్మా రమ్మని బిలిచె !' -భర్త తన యర్ధాంగిన్ 'బ్రమోదమ్మునన్
గొమ్మాశీస్సులు నమ్మ చేత ' ననగాఁ గోటిచ్చె నా యమ్మయున్ !
" సొమ్ముల్ చాలును నీ సమక్ష మొకటే శోభిల్ల జేయున్ గదా
రిప్లయితొలగించండికొమ్మన్, పెట్టుము క్రొత్త కాపురము నీకున్ మేల " టం చాడరే
అమ్మా నాన్నలు, నీదు ముచ్చటలు భామా తీరుగా ! ముద్దు లే-
వమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్.
గుమ్మంబందున నన్ను నాప తలనున్ కోపమ్ముతో త్రుంచి నే
రిప్లయితొలగించండికమ్మందైన గజాసురుండి శిరమున్ గమ్మత్తుగా కూర్చగా
కొమ్మల్ కాయలు పండ్లు మెచ్చు కొడుకున్ కొండాడి ముద్దాడు గౌ
రమ్మా! రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్