8, ఆగస్టు 2011, సోమవారం

చమత్కార (చాటు) పద్యాలు - 121

కం.
కవితాకన్యక గుణములు
కవికన్న రసజ్జుఁ డెఱుఁగుఁ గవి యే మెఱుఁగున్?
భువిలోఁ గన్యక గుణములు
ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవి మిత్రులారా,
క్రింది సమస్యము పూరించండి.
ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

23 కామెంట్‌లు:

  1. ఎవడెవ్విధి తా మారునొ
    ఎవనికి తల వ్రాత జూడ నెటు లుండునొ; యా
    స్తవనీయ జగత్పిత మా
    ధవుఁ డెఱుఁగును గాక, కన్నతండ్రేమెఱుఁగున్?

    రిప్లయితొలగించండి
  2. భువనేశ్వరియౌ రమణిని
    నవిరళమగుతన మనమున నాడెడి తలపుల్
    శివుడను జగదీశు డుమా
    ధవుఁ డెఱుఁగును గాక, కన్నతండ్రేమెఱుఁగున్?

    రిప్లయితొలగించండి
  3. శాస్త్రిగారూ, పద్యం అదిరింది సార్, వేదాంతం దించేశారు.

    రిప్లయితొలగించండి
  4. ఓ కన్నెపిల్ల స్వగతము:
    రవికంచు పెరిగె రాత్రుల
    సవడికిని నిదుర చెదరెను సవరిలు నాక
    న్నెవయసు కలలు కుముదబాం
    ధవుఁ డెఱుఁగును గాక; కన్నతండ్రేమెఱుఁగున్?

    రిప్లయితొలగించండి
  5. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, ఆగస్టు 08, 2011 9:59:00 AM

    అవినీతి యుద్ధమందున
    నవమన్మథ రూపు, నరుడి నందను జంపన్,
    సవరించిన సైనము, సైం
    ధవుడెరుగును గాక కన్న తండ్రేమెరుగున్.

    రిప్లయితొలగించండి
  6. ధవుడెఱుంగును కాని తండ్రియు,త ల్లెఱుంగనె లేదు లె
    మ్ము, వర పుత్రుని కన్నకుంతియు ముద్దుకర్ణునినీటి లో
    న విడలేకను; బాధ, వేదననంత మింగుచు, యా విచా
    ర వదనమ్మునుఁ జూప జాలక రాకుమారి భరించెనే!

    రిప్లయితొలగించండి
  7. రుక్మిణి:
    అవనీసురా!జనుమయా!
    వివరింపుముతరుణిగతిని వేదనలేకన్
    లవలేశమైన నను మా
    ధవుడెరుగును గాక! కన్న తండ్రేమెరుగున్?

    రిప్లయితొలగించండి
  8. భువనైక బుధ్ధి , భుజ బల
    నివహాంగుడు - రామకార్య నిర్వహణా సం
    భవ మారుతిని భువన బాం
    ధవుడెరుగును గాక కన్న తండ్రే మెరుగున్?

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చంద్రశేఖర్ గారన్నట్లు వేదాంతపరమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ మొదటి పూరణ ఉత్తమంగా ఉంది. ఇక రెండవ పూరణగా సమస్యపాదాన్ని స్వల్పంగా మార్చి తరలవృత్తంగా వ్రాయడం ప్రశంసనీయం. అభినందనలు.
    *
    (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. ‘సవడి, సవరిలు’ శబ్దప్రయోగం అపూర్వం. అభినందనలు.
    *
    సైంధవుణ్ణి ఆశ్రయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘సైనము’ ?
    *
    అజ్ఞాత గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, ఆగస్టు 08, 2011 7:16:00 PM

    గురువు గారూ,

    అది సైన్యము.......... ( టైపాటు ).

    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారూ, ధన్యవాదాలు.
    తరల వృత్తాన్ని కూడా గుణదోషవిచారణ చేస్తారని ఆశించాను.

    రిప్లయితొలగించండి
  12. వారాంతపు సమస్యలో కూడా నేనూ, రవిగారూ పూరణలు కొత్త చేసి యున్నాము. దయచేసి పరిశీలించగలరు.
    మీ ఆరోగ్యం ఇపుడు మెఱుగ్గా ఉందని భావిస్తూ.....

    రిప్లయితొలగించండి
  13. శివునిం గోరెద దీర్ఘా-
    యువునని సుతుడన మృకండు డుద్విగ్నుండౌ,
    నవు నాతని దీక్ష నుమా-
    ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

    రిప్లయితొలగించండి
  14. ధృవు డయ్యెడ శ్రీహరికై
    ప్రవిమల తప మాచరించి బడసెను కీర్తిన్
    భువిఁ! బాలుని భక్తిని మా-
    ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

    రిప్లయితొలగించండి
  15. ' పవలున్ రేయియు సెల్లును
    చెవినుంచును కూతు రేమి చెప్పు కొనెదరో! '
    ఇవి నేటి తండ్రి మాటలు,
    ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ,
    మీ మూడు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. ధన్యవాదాలు, మాస్టారూ.

    రిప్లయితొలగించండి
  18. అవినీతి దొరల సంగతి
    కవిపుంగవుడేల యెఱుగు? కాలుడు యెఱుగున్ ,
    సవినయ ప్రహ్లాదుని మా
    ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

    రిప్లయితొలగించండి
  19. మంద పీతాంబర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘కాలుడు + ఎఱుగున్’ అన్నప్పుడు యడాగమం రాదు కదా! ‘కాలుఁ డెఱుంగున్’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  20. వివశపు వంటల నుప్పుల్
    పవళించు సమయపు గుఱ్ఱు ప్రక్కన తాపుల్
    సవరపు జుత్తులు పేలున్
    ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

    రిప్లయితొలగించండి