పీతాంబర్ గారూ ! ధన్యవాదములు. కవయిత్రి గారి మరియు కవి మిత్రుల అందరి పూరణలు చాలా బాగున్నవి. అందరకు అభినందనలు. ఆటవెలదులతో చంపకమును జేర్చి శ్రీపతి శాస్త్రి గారు చెప్పిన 'మన' సు మాట ఘనము గా నున్నది.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, పారిజాతాపహరణ ఘట్టంతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ మూడు పూరణలూ ముచ్చటగా మనోహరంగా ఉన్నాయి. అభినందనలు. * మందాకిని గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, మీ రెండు పూరణలు నిండుగ అలరించాయి. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మంచి సన్నివేశాన్ని ఎంచుకున్నారు పూరణకు . బాగుంది. అభినందనలు. ‘ప్రాకారమునకు జొచ్చిన’ అన్నచోట ‘ఆ కౌరవసభఁ జొచ్చిన’ అంటే ఎలా ఉంటుంది? * లక్కాకుల వెంకట రాజారావు గారూ, సూర్యుడు విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ‘జీకటి పాలయి రాహుకు’ అన్నచోట ‘చీకాకు పఱచ రాహువు’ అంటే ఎలా ఉంటుంది? * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. ‘కొమరుకు’ .. ‘సుతునకు’ అయితే ... ? కవిమిత్రులమీద లక్కాకులవారి సీసపద్యాన్ని ప్రస్తావిస్తూ ‘మన’బ్లాగుపైన, నాపైన ఛందోబద్దంగా వెలిబుచ్చిన భావాలకు సంతోషం, ధన్యవాదాలు. * చంద్రశేఖర్ గారూ, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, రాముడు లవకుశులకు లోకువైన వైనాన్ని చక్కగా వినియోగించుకొని మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏకాంతములో నలిగిన
రిప్లయితొలగించండిశ్రీ కాంతుని భామ సత్య ఛీ కొట్టగనే!
తా కాళ్ళకు మ్రొక్కెను గద,
లోకాతీత పురుషుండు, లోకువ యయ్యెన్!!
రాముని చేత హతుడైన రావణుడు :
రిప్లయితొలగించండి01)
_________________________________
శాఖా చరములు తోడుగ
పాకారి విరోధి తలలు - పాలాడగనే
కాకులు, గ్రద్దలు తన్నిన
లోకాతీత పురుషుండు - లోకువ యయ్యెన్ !
_________________________________
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిశాస్త్రీజీ ! బావుంది !
వేలాది కోట్లు మింగిన ముఖ్య మంత్రి :
02)
_________________________________
తోకాడించెడి మంత్రులు
బాకాలూదుచునుండగ - భయమే లేకన్
కాకారి వలెను మెక్కిన
లోకాతీత పురుషుండు - లోకువ యయ్యెన్ !
_________________________________
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ
రిప్లయితొలగించండి"ఏకాంతములో నలిగిన
శ్రీ కాంతుని భామ సత్య ఛీ కొట్టగనే!" మీ పూరణ బాగుంది.
లక్క రాజు గారూ! ధన్య వాదములు.
రిప్లయితొలగించండికిషోర్ జీ ! ధన్య వాదములు. మీ రెండవ పూరణ కాలానుగుణంగా బాగుంది.
కాకారి అంటే .. గ్రద్ద ..అనియా !
శాస్త్రీజీ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండికాకారి = గుడ్లగూబ
సత్యా ప్రహరుడు కృష్ణుడు :
రిప్లయితొలగించండి03)
_________________________________
నాకిడ లేదని కుములుచు/ (పుష్పము)
కాకోలం బైన సుదతి - కాలున దన్నన్
శేఖరము నేల బడగా
లోకాతీత పురుషుండు - లోకువ యయ్యెన్ !
_________________________________
కాకోలము = సర్పము
శేఖరము = కిరీటము
శ్రీకరుఁడును, రణమందునఁ
రిప్లయితొలగించండిభీకరుఁడు నగుచును, రజక భృత్యుని వలనన్,
లోకుల దృష్టినిఁ నేడా
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్
"ఏకాంతములోనలిగిన,శ్రీకాంతుని భామ" శాస్త్రి గారి పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండిగోకులమందున,కృష్ణుడు
చీకాకులు బెట్టుచుండ,చెట్టుల చెంతన్
రోకలికి గట్టి వేసిరి
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్!!!
లోకులు పలుగాకులుగద,
రిప్లయితొలగించండిచాకలి పలుమాటలాడ,సాద్విని సీతన్
కీకారణ్యము బంపెను
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్!!!
శోకమునకు నిలయంబగు
రిప్లయితొలగించండిభీకరయుద్ధప్రయత్న విరమణ కొఱకై,
ప్రాకారమునకు జొచ్చిన
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్.
ప్రాకారము = రజాస్థానము, రాజ దర్బారు
మంద పీతాంబర్ గారూ
రిప్లయితొలగించండి"లోకులు పలుగాకులుగద," మీ పూరణ బాగుంది.
శ్రీకరుడు ప్రాణి కోటికి
రిప్లయితొలగించండిప్రాకటముగ వెలుగు సూర్య భగవానుడు తా
జీకటి పాలయి రాహుకు
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్
శ్రీగుభ్యోనమ:
రిప్లయితొలగించండిమూకుమ్మడి దాడులతో
లోకేస్వరు గట్టనెంచె లోలోపలనే
ఆ కురురాజుకు మదిలో
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్
శ్రీగుభ్యోనమ:
రిప్లయితొలగించండిచనువుగ సీసపద్యమును సాటికవీంద్రుల ఖ్యాతి గొల్చుచున్
ఘనముగ జెప్పినారు మన గౌరవనీయులు రాజరావు తా
ననఘుడు,హర్షమొందితిని నాకిటు నర్హత లేకపోయినన్
దినమునకొక్కసారి కవి దివ్వెల దీప్తులు కాంచుచుండగాన్
పూల లోన జేరి పూజార్హతను పొందు
దారమట్లు నేను జేరినాను
కవుల మాటులోన గౌరవంబందితి
శంకరాభరణమ జయము జయము
శంకరార్యు జెలిమి శంకలు తొలగించి
మనకు మనకు మంచి మైత్రి గూర్చె
పండితకవులకును ప్రణతులు శతకోటి
చేయు చుంటి నేను చిత్తగింప
శ్రీగుభ్యోనమ:
రిప్లయితొలగించండిఏకాకృతిగా నిలచిన
లోకేస్వరుజూడలేని లోపముతోడన్
ఆకురునాథుని కొమరుకు
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్
టైపాటు లోకేశ్వరునిన్
రిప్లయితొలగించండిచంద్రశేఖర్:
రిప్లయితొలగించండిఆకాశము నంటి బలికి,
చీకాకగుచు శరణన గజేంద్రాదులకున్
ఏకాగ్ర చిత్తులకు నా
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్.
చీకాకగుచు=శ్రమనొందిన; నలిగిన అనే అర్థంలో; లోకువ=అధీనం; లోబడటం.
పీతాంబర్ గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండికవయిత్రి గారి మరియు కవి మిత్రుల అందరి పూరణలు చాలా బాగున్నవి.
అందరకు అభినందనలు.
ఆటవెలదులతో చంపకమును జేర్చి శ్రీపతి శాస్త్రి గారు చెప్పిన 'మన' సు మాట ఘనము గా నున్నది.
మిత్రుల పూరణలు సొంపుగా యున్నాయి. పీతాంబరుల వారి మాటలే మరో విధముగా ;
రిప్లయితొలగించండిచాకలి తిమ్మడు పలుకులు
మేకులుగాఁ దాక హృదిని మేదిని సుతకున్
రాకొమరులు లవ కుశులకు
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిపారిజాతాపహరణ ఘట్టంతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ ముచ్చటగా మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
*
మందాకిని గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ రెండు పూరణలు నిండుగ అలరించాయి. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మంచి సన్నివేశాన్ని ఎంచుకున్నారు పూరణకు . బాగుంది. అభినందనలు.
‘ప్రాకారమునకు జొచ్చిన’ అన్నచోట ‘ఆ కౌరవసభఁ జొచ్చిన’ అంటే ఎలా ఉంటుంది?
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
సూర్యుడు విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘జీకటి పాలయి రాహుకు’ అన్నచోట ‘చీకాకు పఱచ రాహువు’ అంటే ఎలా ఉంటుంది?
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
‘కొమరుకు’ .. ‘సుతునకు’ అయితే ... ?
కవిమిత్రులమీద లక్కాకులవారి సీసపద్యాన్ని ప్రస్తావిస్తూ ‘మన’బ్లాగుపైన, నాపైన ఛందోబద్దంగా వెలిబుచ్చిన భావాలకు సంతోషం, ధన్యవాదాలు.
*
చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రాముడు లవకుశులకు లోకువైన వైనాన్ని చక్కగా వినియోగించుకొని మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
మాబండి లేటు.
రిప్లయితొలగించండిఓ కోటిత్తును నీకే-
నో కొండలరాయ స్కాము నోపగ జాలన్
చేకొను మను మొర నేతది !
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఆలస్యమయినా అమృతము అమృతమే !మాటలు కోటేలా ! అదరగొట్టారు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమూర్తి గారన్నట్లు అమృతతుల్యమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమూర్తిమిత్రమా మీ అభిమానం గానీ ఇదంతా మిమ్మల్నీ మిమ్మల్నీ చూసి
నేర్చుకొన్నదే. ధన్యవాదాలు.
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ ! మీ పద్యము వెనుక మా పద్యములు వున్నాయి. ( ఇటునుండి చూస్తే ) కాబట్టి మీ బండి ముందున్నట్లు.
హనుమచ్చాస్త్రి గారూ ఇదేదో బాగుంది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమిత్రు లందరి పూరణలూ ఎంతో ముచ్చటగా ఉంటూ
పోటీని మరింత పెంచుతూ మన బుర్రకు బలే పదును పెడుతున్నాయి.
శంకరాభరణంపు ప్రశస్తి జేసి
రిప్లయితొలగించండిసాటి మిత్రుల చెలిమిని సంస్తుతించి
పెద్ద మనసును ప్రకటించి పెద్ద లైన
శ్రీ పతీ! మీకు కవనంపు శ్రీలు గాత!
హనుమచ్ఛాస్త్రిగారు, మిస్సన్నగారు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీరన్నట్లు పద్యపు జల్లులు ఆనందకరమైన పోటీని సృష్టిస్తున్నాయి.
కాకులలో కోకిలగా
రిప్లయితొలగించండిచీకాకుల మధ్య సింగు ఛీఛీ పనులన్
స్వీకారము జేయగ నా
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్
సింగు = మన్మోహన సింగు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వేకువ జామున త్రాగుచు
రిప్లయితొలగించండిపీకను కోపమ్ము నిండు పెండ్లము పైనన్
చాకలి మాటలు తాళక
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్