16, ఆగస్టు 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 124

"రాకొట్టుట మోజు సుమీ!"
ఆ. వె.
కవులు పొగడు వేళఁ, గాంతలు రతివేళ,
సుతులు ముద్దు వేళ, శూరవరులు
రణము సేయువేళ రాకొట్టి పిలుతురు;
పాడి యదియ మిగుల భజన కెక్కు.

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము' నుండి)
కవి మిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
గురువు లైన నేమౌను రాకొట్టవచ్చు.

20 కామెంట్‌లు:

  1. బుద్ధి సుద్దులు నేర్పగా బోధ జేసి
    ధర్మ మార్గము నడిపించు ధరణి గురువు,
    పరువు దీసెడి పని జేయ పనికి మాలి
    గురువు లైన నేమౌను రా ! కొట్టవచ్చు.

    రిప్లయితొలగించండి
  2. చిన్న సవరణ తో..

    బుద్ధి సుద్దులు నేర్పు గా బోధ జేసి
    ధర్మ మార్గము నడిపించు ధరణి గురువు,
    పరువు దీసెడి పని జేయ పనికి మాలి
    గురువు లైన నేమౌను రా ! కొట్టవచ్చు.

    రిప్లయితొలగించండి
  3. మాస్టారూ, మంచి చాటుపద్యం ఉటంకించారు. పిచ్చయ్య శాస్త్రి గారి లిస్టుకి, భక్తి కలుపుదాం. భక్తి భావంతో కూడా రాకొట్టటం వున్నదికదా!
    రార! రామ!రఘుకుల రమణ! నాదు
    మాట వినరా! నను గనరా! మరువ కుమిక
    దారి జూపర!యనుచును దాస్య భక్తిఁ
    గురువు లైన నేమౌను రాకొట్టవచ్చు
    గురువు=కాపాడువాడు అనే అర్థంలో;

    రిప్లయితొలగించండి
  4. మొదటిపాదం సవరణతో:
    రార! రామ!రాఘవ ఘన రమణ! నాదు
    మాట వినరా! నను గనరా! మరువ కుమిక
    దారి జూపర!యనుచును దాస్య భక్తిఁ
    గురువు లైన నేమౌను రాకొట్టవచ్చు

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి ధన్యవాదాలు,నమస్కారములతో
    పరువును అరువుగాదెచ్చు పండితులకు
    గురువు స్థానమందుండిన గాడిదలకు
    సిరులు కోరుచు చదువు జెప్పు వారు
    గురువు లైన నేమౌను రా | కొట్టవచ్చు|

    రిప్లయితొలగించండి
  6. మంచి సోడా కలపవలె మందు నందు
    అనుభవము లేని వారల కదియె మేలు
    మెల్ల మెల్లగా దేహము ఝల్లుమనును
    గురువు లైన నేమౌను "రా" కొట్టవచ్చ!!

    రిప్లయితొలగించండి
  7. తల్లి దండ్రియు గురువులు తాత్వికులును
    కంటి కగుపడు దైవాలు గాదె భువిన,
    చెఱుపు గలిగించు రీతులు చెప్పువారు
    గురువు లైన నేమౌనురా కొట్టవచ్చు|

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, ఆగస్టు 16, 2011 7:05:00 PM

    ద్రోహచింతన కలిగిన దుష్టజనులు,
    చదువు ఇసుమంతయును లేని చవటలిచట,
    గురువు లైన, నేమౌనురా?? కొట్ట వచ్చు
    నట్లు తెలియును మనదేశ యధమ గతులు.

    ( కొట్టొచ్చినట్లుగా అని వాడుకలో వుంది కదా గురువు గారు )

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి పూరణ. "గురోరప్యవలిప్తస్య కార్యాకార్య మజానతః ..." శ్లోకాన్ని గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.
    ‘ధరణి గురువు’... ? ‘దైవ మయ్యు’ అంటే ఎలా ఉంటుంది?
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ దాస్యభక్తి పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మంచి భావంతో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    కాని గణదోషాలు, విసంధి తదితరాలు ... నా సవరణ ...
    పరువు (న)రువుగా దె(చ్చెడి) పండితులకు
    గురువు స్థానమందుండిన (కుత్సితు)లకు
    సిరులు కోరుచు చదువు(ను) జెప్పు వారు
    గురువు లైన నేమౌను రా | కొట్టవచ్చు|
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    వాళ్ళు ‘రా’ కొట్టడంలో గురువులా? అద్భుతమైన పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    ఉత్తమమైన పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ‘కొట్టొచ్చినట్లున్న’ భావంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘మన దేశ + అధమ’ అన్నప్పుడు సవర్ణదీర్ఘం వస్తుంది కదా! ‘దేశపు టధమ" అందాం.

    రిప్లయితొలగించండి
  10. మాస్టరు గారూ ! ధన్యవాదములు. సవరణ భేషుగ్గా వుంది.

    రిప్లయితొలగించండి
  11. శ్రీగురుభ్యో నమః

    పద్య రచన యందు మిగుల ప్రతిభ నొంద
    పంత మూనుచు మనమంత పంచ జేరి

    శంక యించుక లేకను శంకరా !(ర్యు)
    గురువులైన నేమౌను రాకొట్ట వచ్చు !

    రిప్లయితొలగించండి
  12. ఒక మధురవాణి పాఠంచెబుతోంది::

    రాత్రి వేళ రావ,నాత్రపడుచునెంతొ
    ముసుగుఁగప్పుకొనియె ముద్దుఁగోరి
    రాజు, మంత్రి, ద్విజుడు,రాణిగారలనాట్య
    గురువు లైన నేమౌను? "రా" కొట్టవచ్చు.

    రిప్లయితొలగించండి
  13. ఒక గురువు ::

    ప్రతిభఁజూపకున్నఫలితము నెఱుగవా?
    వెర్రిశంకలేల కుఱ్ఱవాడ?
    అదరగొట్టుమింక!నాటలందునెదురు
    గురువు లైన నేమౌను రా? "కొట్ట"వచ్చు. [ఓడగొట్టవచ్చు అనే అర్ధం లో]

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పద్యం బాగుంది. కాని భావం సందిగ్ధార్థాన్ని ఇస్తున్నట్లనిపిస్తున్నది. శంకరార్యుణ్ణి రాకొట్టవచ్చా? శంకరార్యుడు శిష్యులను రాకొట్ట వచ్చా? లేక గురువు ‘రా’ కొట్టవచ్చా?
    *
    ఊకదంపుడు గారూ,
    మంచి భావాలతో పూరణ చేసారు. అందుకు అభినందనలు.
    కాని సమస్య తేటగీతిలో ఉంటే మీరు ఆటవెలదుల్లో పూరణ చేసారు. సవరించే ప్రయత్నం చేస్తారా? లేక ఆ భారం నాదే అంటారా? సమయాభావం వల్ల ఇప్పుడు చేయలేను. వీలైతే సాయంత్రం వరకు చేస్తాను.

    రిప్లయితొలగించండి
  15. పూజ్యనీయులైన మిమ్ములను చేతు లెత్తి శంకరా ! అని సంబోధిస్తున్నప్పుడు అక్కడ 'రా 'కొడుతున్నాము. శంకరా(ర్యు ) గణాలు సరిపోడానికి.

    మీరు నన్నెప్పుడైనా 'ఒరే ! నరసిం హ మూర్తీ అని మా చిన్నప్పటి గురువుల వలె సంబోధించ వచ్చు.

    రిప్లయితొలగించండి
  16. ప్రతిభఁజూపకవచ్చునాఫలితమద్ది?
    వెర్రిశంకలన్నివిడుము కుఱ్ఱవాడ
    అదరగొట్టుపిడుగ!ఆటలందునెదురు
    గురువు లైన నేమౌను రా? "కొట్ట"వచ్చు. [ఓడగొట్టవచ్చు అనే అర్ధం లో]

    రాత్రి వేళ రావ,మిగులనాత్రపడుచు
    ముసుగుఁగప్పుకొనియె నీదు ముద్దుఁగోరి
    రాజు,మంత్రి,ద్విజుడుఁగాక రాణిగారలనాట్య
    గురువు లైన నేమౌను? "రా" కొట్టవచ్చు.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారూ, సవరించానండి, వీలుచూసుకొని ఒకమారు చూడండి.

    రిప్లయితొలగించండి
  18. ఊకదంపుడు గారూ,
    సవరించిన పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    రెండవపూరణ మూడవపాదంలో ‘రాణిగారల నాట్య’ అన్నచో గణదోషం. ‘రాణి నాట్య’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  19. కొన్న సీమటపాకాయలు చాలా ఆలస్యంగా పేలుతుంటాయి.

    ఏం చేయను మరి. ఈ ప్రసంగకాలానికి మీ బ్లాగును గూర్చి తెలియదు నాకు.
    రాకొట్టుట మోజు సుమీ అనేది చూస్తే అడిదం సూరకవి పద్యం గుర్తుకు వస్తుంది.

    సూరకవిగారు శ్రీ పూసపాటి విజరయామ గజపతి ఆస్థానంలోని వాడు. రాజు గారికి కవిగారికీ మధ్యన రాజావారి సవతి అన్నగారు సీతారామరాజుగారు శకునిలాగా అడ్డంగా ఉండేవాడు. ఒకసారి, రాజావారిని కవిగారొక పద్యంలో యేకవచనంలో సంబోధించినందుకు సీతారామరాజు ఆక్షేపించాడట. దానికి కవిగారి సమాధానం ధాటిగా యిలా వచ్చిందని చెబుతారు:

    చిన్నప్పుడు, రతికేళిని
    యున్నప్పుడు, కవిత లందు, యుధ్ధము లందున్,
    వన్నె సుమీ రా కొట్టుట!
    చెన్నగు నో పూసపాటి సీతారామా.

    బహుశః యీ పద్యం మీరు వినే ఉంటారని భావిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  20. సవరణ: రీ పూసపాటి విజయరామ గజపతి అనేది సరిగా టైప్ కాలేదు.

    రిప్లయితొలగించండి