14, ఆగస్టు 2011, ఆదివారం

సమస్యా పూరణం -425 (సంహరించువాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
సంహరించువాఁడు సచ్చరితుఁడు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

  1. పాపి యైన గాని పరివర్తనము జెంది
    హరి ! హరి ! యని వేడ నార్తి తోడ
    పాపములను తీసి భక్తుల మంచి కో
    సం, హరించు 'వాఁడు' సచ్చరితుఁడు.

    రిప్లయితొలగించండి
  2. తపము జపముఁ జేయు ధన్యుల దండించి
    చిత్ర హింస పాలు చేసినట్టి
    రాక్షసాధములను రయమునఁ దాఁ వచ్చి
    సంహరించువాఁడు సచ్చరితుఁడు.

    రిప్లయితొలగించండి
  3. పుడమి బాధ దీర్చ పుట్టుచు ప్రతి సారి
    హాయి నిచ్చి నాడు హరియె, చూడ
    శిష్ట జనుల గాచి దుష్టల తాబట్టి
    సంహరించు 'వాఁడు' సచ్చరితుఁడు.

    రిప్లయితొలగించండి
  4. రావణునకు చావు రాదా పితామహా!
    యనిన సురుల కనియె నాది జుండు
    హరియె రామ మూర్తి యై దాన వేంద్రుని
    సంహరించువాఁడు సచ్చరితుఁడు.

    రిప్లయితొలగించండి
  5. మనిషి మనిషిలోన మంచియు,చెడునుండు
    మనసులోకివెళ్ళి మథన జేసి
    దైవగుణము లుంచి,దనుజగుణమ్ముల
    సంహరించు వాడు సచ్ఛరితుడు!!!

    రిప్లయితొలగించండి
  6. మిత్రుల పూరణలు అద్భుతము !
    మన దేశముపై బడే టెర్రరిస్టులను అమెరికా గాడు తంతే బాగుంటుందని మనము అనుకుంటాము గదా !

    ఒడలు పైన నీగ నొబ్బిడిగా గొట్ట
    నుత్తముండు గాడె - యుచితముగను
    దండయాత్రఁ జేయు దుండగులను బట్టి
    సంహరించు వాఁడు సచ్చరితుడు !!!

    రిప్లయితొలగించండి
  7. మంచి జెప్ప గానె మండిప డుటవద్దు
    మేలు గోరు వారు మెచ్చు కొనరు
    చెడును దునుము వారు చెడ్డగా నేరరు!
    సంహరించువాఁడు సచ్చరితుఁడు

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, ఆగస్టు 14, 2011 3:13:00 PM

    వ్యాస సుతుడు, మిగుల వైరాగ్య సంపన్ను,
    డాత్మ కథలు జెప్పు నార్తి తోడ,
    కర్మఫలము వలన కలిగిన పాపముల్
    సంహరించు వాడు, సచ్చరితుడు.

    రిప్లయితొలగించండి
  9. కరము ధర్మ మాది పురుషార్ధ మరయుచు
    చిత్త మందు భక్తి జేర్చి, విబుధ
    జనుల గొల్చుచు ,నరిషడ్వర్గ మెవ్వడు
    సంహరించు-వాడు-సచ్చరితుడు

    రిప్లయితొలగించండి
  10. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, ఆగస్టు 14, 2011 5:23:00 PM

    రాజా రావు గారూ,

    అద్భుతమైన పూరణనిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    అయితే మొదటి పూరణలో ‘మంచికోసం’ అని వ్యవహార రూపాన్ని వాడారు. ‘... భక్తుల కష్టముల్/ సంహరించువాడు’ అందామా?
    *
    మందాకిని గారూ,
    అతి మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    సచ్చరితుని లక్షణాలను మీ పూరణలో చక్కగా వివరించారు. బాగుంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ‘అరిషడ్వర్గ సంహారము’ అంశంగా (నేను పూరించాలనుకున్నది ఇదే!) మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. రుక్మిఁ విడువు డంచు రుక్మిణి వేడగా
    వాసు దేవు డంత వాని బట్టి
    ఛురిక తీసి సగము జుట్టును మూతిమీ-
    సం హరించు, వాఁడు సచ్చరితుఁడు.

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    మీరూ గోలివారి దారి పట్టారు. పూరణలోని చమత్కారం అలరించింది.
    కాని ‘మీసం’ వ్యావహారికరూపం ..?

    రిప్లయితొలగించండి
  14. గురువుగారూ మీరన్నది నిజమే.
    కానీ సరదా ఆపుకోలేక .......

    రిప్లయితొలగించండి