1, ఆగస్టు 2011, సోమవారం

సమస్యా పూరణం -412 (అల్పుఁ డెపుడు పల్కు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
అల్పుఁ డెపుడు పల్కు నాదరమున.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. కట్టె విరిచి నట్లు కఠినంపు మాటలు
    అల్పుఁ డెపుడు పల్కు; నాదరమున
    పల్కు నయము ప్రీతి వాక్కులు చూడగ
    సజ్జనుండు మహిని సరస హృదయ !

    రిప్లయితొలగించండి
  2. చంద్రశేఖర్:
    సాఫ్టు వేరు పనులు సలుపుటెరుంగని
    అల్పుఁ డెపుడు పల్కు నాదరమున
    అడ్డదారి త్రొక్కి అందుకొన్నట్టియా
    జాబు వూడు ననెడి జంకు తోడ!
    మనవి: మేము ఇట్లాంటి వారిని చూసినపుడు, "Don't try to be extra nice" అని సరదాగా అంటూ వుంటాము. తొందరగా pick up చేసుకొని line లో పడతారు.

    రిప్లయితొలగించండి
  3. అప్పు నడుగు నపుడు నవసర మున్నప్డు
    ఆశ సభకు నోటు నడుగు నపుడు
    మోసగింపఁ బూన భాషించు మృదువుగా
    నల్పుఁ డెపుడు పల్కు నాదరమున

    ఆశ సభ = శాసన సభ

    రిప్లయితొలగించండి
  4. అంది నపుడు శిఖను నందక కాళ్ళను
    బట్టు వానిఁ జూచి భ్రాంతిఁ బడకు
    సాహసింప లేక సంధి కార్యముఁ జేయు
    నల్పుఁ డెపుడు పల్కు నాదరముగ

    రిప్లయితొలగించండి
  5. డా. మూర్తి మిత్రమా! మీ రెండవ పూరణ అదిరింది.

    రిప్లయితొలగించండి
  6. దైవ భక్తి యున్న దైన్యముఁ గట్టిరి
    ద్రవిడ మూర్ఖ జగతి రాచి మంట
    కరుణ కూతురుయును జెరఁ జిక్క, " దైవమా !"
    అల్పు లెపుడు పల్కు రాదరమున !

    కరుణానిధి కుటుంబ సభ్యులు దేవాలయములకు వెళ్ళి ప్రార్ధనలు చేస్తున్నారని వార్త !

    రిప్లయితొలగించండి
  7. చంద్రశేఖర మిత్రమా కృతజ్ఞతలు !

    రిప్లయితొలగించండి
  8. శ్రీపతి శాస్త్రి గారి పూరణ ...

    ఎంత చదువు జదివి యెన్ని విన్ననుగాని
    అల్పుడెపుడు పలుకు నాదరముగ?
    డాబు దర్పములతొ డాంబికంబులుపల్కు
    సూటి పోటి కటువు మాటతోటి

    రిప్లయితొలగించండి
  9. ఇచ్చకాలకు మెరమెచ్చుకోలుకు లొంగి
    ప్రాకులాడుచుండు పండితునికి
    నున్నమాట లన్న నుక్రోషమెక్కువ
    అల్పుడెపుడు పల్కు ? నాదరమున !

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  10. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, ఆగస్టు 01, 2011 10:59:00 AM

    ప్రీతి పలుకబోడు, భేషజముల వాడు
    మంచి పనుల మదిని నెంచ బోడు,
    ఒరుల కష్ట బెట్ట నుత్సాహమును జూపు,
    నల్పుడెపుడు పల్కు నాదరముగ??

    రిప్లయితొలగించండి
  11. గురువు కన్న నెంత గొప్పదౌ స్థానంబు
    పొంది యున్నగాని- బుద్ధిశాలి;
    అల్పుడెపుడు; పల్కు నాదరము గలిగి
    వినయశీలి యగుచు వెలుగుచుండు.

    రిప్లయితొలగించండి
  12. శిష్యుఁడన్న వాడు చిన్నగురువుకన్న,
    అల్పుడెపుడు . పల్కునాదరముగ
    గురువు ముందు నిలిచి, గొప్పగ దైవపు
    భావమునను గొలిచి ఫలముఁ బొందు.

    అభినందించిన మిత్రులు మిస్సన్నగారికి , మూర్తిగారికి ధన్యవాదములు. గురువుగారూ, మీ ఆరోగ్యం కుదుటపడిందని భావిస్తాను.
    మిత్రులు అందరూ నలకూబరునితో పాటు నల్లుల బాధ పడుతూ చెప్పుకున్న ముచ్చట్లు భలే సరదాగా సాగాయి. అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. చిన్న మార్పు,

    దైవ భక్తి యున్న దైన్యముఁ గట్టిరి
    ద్రవిడ మూర్ఖ జగతి రాచి మంట
    కరుణ కూతురు విధిఁ జెరఁ జిక్క, " దైవమా !"
    అల్పు లెపుడు పల్కు రాదరమున !

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులకు వందనాలు.
    ఈ రోజు అన్నీ వేమనను తలపింపజేసే నీతి పద్యాలు వెల్లువెత్తాయి. సంతోషం! ఉత్సాహంతో పూరణలు పంపిన అందరికీ ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘మాటలు + అల్పుడు’ .. దీనిని ‘మాటల నల్పుడు’ అందాం.
    *
    చంద్ర శేఖర్ గారూ,
    చమత్కారభరితమైన పూరణ. బాగుంది. అభినందనలు.
    ‘వూడు’ ... ?
    ‘యకారమును, వువూవొవోలును, ణళలును దెలుఁగు మాటలకు మొదట లేవు’
    ‘జాబు పోవు/తొలఁగు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  15. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ముచ్చటైన మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    లక్కరాజు వెంకట రాజారావు గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    ‘ఆదరముగ’ను ‘ఆదరము గలిగి’ అన్న మీ నైపుణ్యం ప్రశంసనీయం.

    రిప్లయితొలగించండి
  16. ధన్యవాదాలు, మాష్టారు. "పోవు" వేద్దామనుకొని, పంచ్ రావటంకోసం "ఊడు" ని "వూడు" గా వేశాను పాద మధ్యమం గాబట్టి. మీ సూచన ద్వారా మంచి పాఠ౦ నేర్చుకొన్నాను.

    రిప్లయితొలగించండి
  17. అల్పుడెపుడు పలుకు నాడంబరముగను
    గొప్ప వారినైన తప్పు బట్టు
    సద్గుణాఢ్య వేద సాగర శోధనా
    నల్పుఁ డెపుడు పల్కు నాదరమున!!


    శోధన + అనల్పుఁడు = శోధనానల్పుఁడు

    రిప్లయితొలగించండి
  18. సత్యనారాయణ గారి పూరణ అద్భుతంగా ఉంది.

    శకుని మాట లాడె ' చాలు మేనల్లుడా!
    ఐదు యూళ్ళ నిత్తు ననెద వేమి?
    గొల్ల వాని మాయ కల్ల నమ్మకుమయ్య
    అల్పుఁ డెపుడు పల్కు నాదరమున! '

    రిప్లయితొలగించండి
  19. చింతా రామకృష్ణారావు గారూ,
    ఉత్తమమైన పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మిస్సన్న గారు చెప్పునట్లు మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    ‘ఐదు + ఊళ్ళు’ యడాగమం రాదు కదా! ‘ఐదె యూళ్ళ’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  20. అల్పు డెపుడు బల్కు నాదరమున మోస
    గించు వేళ ,కొంప ముంచు వేళ .
    అంతరంగ మెపుడు నధమాధమము గదా
    చేటు గల్గు వాని మాట వినిన !!!

    రిప్లయితొలగించండి
  21. అల్పుడెపుడు పల్కు నల్పంబుగా చూడ.
    స్వల్పమధీకమవదు. సహజ గుణము
    నల్పుడెటుల మాను? ఆర్యులు మన్నింప
    నల్పుడెపుడు పల్కు నాదరమున?

    రిప్లయితొలగించండి
  22. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    సాటి వారి మీద - చాడీలు చెప్పగ
    బంధు మిత్రుల కడ - బదులు గోర
    ప్రభువు జేరి, మిగుల - భజన జేయ
    నల్పు డెపుడు పల్కు - నాదరమున !
    _________________________________

    రిప్లయితొలగించండి
  23. శంకరార్యా !

    ‘యకారమును, వువూవొవోలును, ణళలును దెలుఁగు మాటలకు మొదట లేవు’
    అన్నారు !
    మరి "య-కారము" తో మొదలయ్యే పదాలు చాలా యున్నవి గదా !

    రిప్లయితొలగించండి
  24. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    02)
    _________________________________

    మందు త్రాగు నపుడు - మద్య బేహారితో
    మగువ మోస పుచ్చ - మాట లాడ
    దొంగిలించు వేళ - దొరికిపోయి నపుడు
    అల్పు డెపుడు పల్కు - నాదరమున !
    _________________________________

    రిప్లయితొలగించండి
  25. 03)
    _________________________________

    జూద శాల జేరి - జూదమాడు కొఱకు
    సార మవసర మగు - సమయ మందు
    భార్య మోస పుచ్చి - బంగారు హరియింప
    నల్పు డెపుడు పల్కు - నాదరమున !
    _________________________________
    సారము = సొమ్ము

    రిప్లయితొలగించండి
  26. 01 అ)
    _________________________________

    సాటి వారి మీద - చాడీలు చెప్పగ
    బంధు మిత్రుల కడ - బదులు గోర
    ప్రభువు జేరి మిగుల - భజన జేసెడి వేళ
    నల్పు డెపుడు పల్కు - నాదరమున !
    _________________________________

    రిప్లయితొలగించండి