వసంత కిశోర్ గారూ, బాగుది మీ పూరణ. అభినందనలు. ‘అన్నియూ’ అని వ్యావహారిక పదాన్ని ‘అన్నియున్’ అంటే ... ? * మంద పీతాంబర్ గారూ, మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * మందాకిని గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. మీ పంచచామరం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, సమయోచితమైన పూరణ. బాగుంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘చెప్పేటి’ అనే వ్యావహారిక రూపాన్ని ‘చెప్పెడి’ అంటే ..?
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండి01)
_______________________________
పలుకు పలుకున నీతులే - ప్రబల మవగ
పదవి లేనప్పుడే వారు - పలుకు చుంద్రు !
పదవి చేజిక్క నన్నియూ - పాతకములె
పచ్చకామెర్ల రోగము - పాలకులకు !
_______________________________
పదవి మదమున సత్యమ్ము పలుకలేరు,
రిప్లయితొలగించండికనగ జాలరు, చెవియొగ్గి వినగ లేరు
పిచ్చి ముదిరెనో యవినీతి హెచ్చి,వచ్చె
పచ్చ కామెర్ల రోగము పాలకులకు
నీతిఁ దప్పిన వారలు నేతలయిన
రిప్లయితొలగించండితమనుఁ బోలిన వారని తలచి, పరుల
మంచి తనమునుఁ దెలియక మసలి నారె!
పచ్చకామెర్ల రోగము పాలకులకు.
భేషైన పూరణలు చేసిన మిత్రులకు అభినందనలు.
రిప్లయితొలగించండికార్యాలయపు పని వత్తిడి మూలముగా రెండు రోజులుగా తరగతులకు హాజరు కాలేదు ....
మంట జూడరు వెలుగుల వెంట జూచు
పాచి జూడరు పైపైని పచ్చ జూచు
వెచ్చ, పచ్చగ దేశమ్ము వెలుగు ననును
పచ్చకామెర్ల రోగము పాలకులకు !
మీ సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
రిప్లయితొలగించండిపచ్చకామెర్ల రోగము పాలకులకు
నేడు, మంచిజెడులకును నేరమంట
గట్టి, "తీహారె" మందనె ఖలులు, కూడి
నారు సామాన్య జనులకు నడ్డి విరువ|
జనాళి బాధ తీర్చగాను సమ్మతించి వత్తురా
రిప్లయితొలగించండిధనాశ తో, దురాశ తోడ ధాత్రినేల వత్తురా
మనుష్య జన్మనెత్తినారు, మానవత్వమున్నదా
వినాశబుద్ధితో చరించు వీరు మారనేరరా!
అక్రమార్జన చేసిరత్యాశతోటి,
రిప్లయితొలగించండితమదు భాగ్యమ్ము గాంచి యీ ధరణి యందు
పేదరికమిక లేదని ప్రేలుచుండ్రు,
పచ్చ కామెర్ల రోగము పాలకులకు.
నీతి లేనట్టి నేతలు నిజము దేవ!
రిప్లయితొలగించండిమాయ మాటలు జెప్పేటి మంత్రు లనఘ;
మంచి నెక్కడ గాంచును? మనసు రాదు
పచ్చ కామెర్ల రోగము పాలకులకు.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుది మీ పూరణ. అభినందనలు.
‘అన్నియూ’ అని వ్యావహారిక పదాన్ని ‘అన్నియున్’ అంటే ... ?
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది.
మీ పంచచామరం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
సమయోచితమైన పూరణ. బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘చెప్పేటి’ అనే వ్యావహారిక రూపాన్ని ‘చెప్పెడి’ అంటే ..?
లోక పాలును తెస్తిరి లోటు లేక !
రిప్లయితొలగించండిజనుల కొనుగోలు శక్తితో నినుమ డించె
ధరలు! అయినను పాప మందురు గదయ్యొ
' పచ్చకామెర్ల రోగము పాలకులకు. '
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
నా పూరణ ...
రిప్లయితొలగించండిఎఱ్ఱబుగ్గల కారుల నెక్కి తిరిగి
తాము వాతానుకూల సౌధముల నుండి
"ఒహొహొ! దేశము పచ్చగా నున్న"దంద్రు
పచ్చకామెర్ల రోగము పాలకులకు.
గురువుగారూ మీ పూరణ మన చిన్నప్పటి పాట ' కారులో షికారు కెళ్ళే '
రిప్లయితొలగించండిపాటను గుర్తు చేస్తూ చాలా బాగుంది.
గురువుగారూ, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఒహొహొ అనిపించింది మీ పూరణ.అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !