ఇది ఏమిటి?
కం.శిలవృక్షలతలఁ బుట్టిన
చెలువలు మువ్వురును గూడి చిడిముడిపడుచున్
దలవాకిట రమియింతురు
సలలితముగ దీని నెఱుఁగు సరసులు గలరే?
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,అదేమిటో తెల్పండి. సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com
అలవాటు కొద్దీ సమాధానాన్ని ఇక్కడే పోస్ట్ చేశాను. తరువాత గమనించి తొలగించాను. క్షమించండి.
రిప్లయితొలగించండిమందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానం తప్పు. మరోసారి ప్రయత్నించండి. నిన్నటి ప్రహేళికను చూడండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యరూప సమాధానం సరియైనది. అభినందనలు.
ఱాతి నుండి పుట్టి రంగుగ సున్నమ్ము
రిప్లయితొలగించండిచెట్టునుండు పోక చెక్క గలసి
లతను తమలపాకు లభియించ జతకట్టి
పండ నోటి యందు పండు గౌను.
హనుమచ్చాస్త్రి గారు ఎలాగా ఇక్కడ వ్రాసేరని నేనూ అలాగే చేశాను. మన్నించండి.
రిప్లయితొలగించండి:-)
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారి సమాధానం ...
రిప్లయితొలగించండిశిల బుట్టినదే సున్నం
దలపగ లత నాగవల్లి దళమే బుట్టెన్ !
చెలి ! పోక బుట్టె చెట్టుకు
కలుపుచు నమలిన, ముఖమున కాంతులు వెలుగున్ ! !
*
మందాకిని గారి సమాధానం ...
తలవాకిట కట్టిన తోరణము
శంకరార్యా !
రిప్లయితొలగించండిమిత్రుల వర్ణనలు సొగసుగా నున్నవి !
చూర్ణకారుడు గాల్చిన - సుధను గొంత
నాగవల్లీ దళంబున - నయము నిలిపి
పూగ భాగంబులను జేర్చి - పొలుపు మీర
ఆననంబుంచి నమలిన - నమరు(నమర) సుఖము !
లక్కాకుల వెంకట రాజారావు గారి సమాధానం ...
రిప్లయితొలగించండిచం.
‘పలుకుల’ ముద్దులొల్క వలపై చెలి ‘పోకొ’క వంక, తీవెలో
కులుకులు ‘పల్లవింప’ తళుకుంజెలి ‘తమ్మల’ మొక్కవంక, పూ
ములుకులచొక్కి ‘చూర్ణమయి’ ‘ముద్దగు’ చేడియ ‘సున్న’మొక్కటన్
వలపులు పండ ‘వీడ్య’మయి వాంఛిత మిచ్చిరి శంకరార్యుకున్.
లక్కాకుల వారు మంచి సరసంగా సమాధాన మిచ్చారు. అభినందనలు.
రిప్లయితొలగించండికవిమిత్రులకు వందనాలు.
రిప్లయితొలగించండిఈసారి అందరూ ప్రహేళికకు సమాధానాన్ని పద్యరూపంలో ఇచ్చి నాకు మహదానందాన్ని కలిగించారు. అందరికి ధన్యవాదాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారు, మిస్సన్న గారు, వసంత కిశోర్ గారల పద్యాలు బాగున్నాయి. అభినందనలు.
వృత్తంలో సమాధానం చెప్పిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ప్రత్యేక అభినందనలు. అన్నట్టు వారికి ఎలా తెలిసిందో ... నాకు వీడ్యం (కారాకిళ్ళీ) వేసికొనే అలవాటు ఉందని. ముద్దులొలికే చెలులతో నాకు తాంబూలం ఇప్పించారు. ధన్యవాదాలు.