5, ఆగస్టు 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 119 (ప్రహేళిక)

శ్లో.
దంతై ర్హీనః శిలాభక్షీ
నిర్జీవో బహుభాషకః |
గుణస్యూతి సమృద్ధో೭పి
పరపాదేన గచ్ఛతి ||

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం ...
ఆ. వె.
దంతహీన మయ్యుఁ దాఁ దిను రాళ్ళను,
ప్రాణరహిత మైన వదరుబోతు,
గుణసమృద్ధ మయ్యుఁ గొల్చు నన్యుల పాద
ములను బట్టి; దానిఁ దెలుపఁగలరె?

కవిమిత్రులారా,
అదేమిటో తెల్పండి. సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

6 కామెంట్‌లు:

 1. మిస్సన్న గారూ,
  పద్యరూపంలో మీ సమాధానం చక్కగా ఉంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఛందోబద్ధంగా బల్లగుద్ది చెపితే కాదంటామా? చక్కని సమాధానం. అభినందనలు.

  రిప్లయితొలగించు
 2. మిత్రులు మన్నించాలి.
  సమాధానాలు పోస్ట్ చేయడం మరిచిపోయాను.
  ఇవిగో ... మిత్రుల సమాధానాలు ...

  రిప్లయితొలగించు
 3. మిస్సన్న గారి సమాధానం ...

  పళ్ళు లేవు కఱచి పట్టు నైనను కాళ్ళఁ!
  ప్రాణ మదియు లేదు పట్టి చూడ!
  గుణము దొడ్డ దగును! గొప్పగా మన పాద-
  సేవ జేయు చెప్పఁ! చెప్పు ! జోడు!

  రిప్లయితొలగించు
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారి సమాధానం ...

  కిర్రు కిర్ర్రు మనే చెప్పులు.

  చెప్ప, లోన రాళ్ళు చెప్పకనే దూరు
  సద్దు సేయ కుండ సాగ వెపుడు
  ఎన్ని గుణము లున్న నెన్ను పాదములను
  పాద రక్ష లవియె, కాదె ? చెపుమ !

  రిప్లయితొలగించు