గురువు గారి ప్రోద్భలంతో నేను ఇంతటివాడనైతిని.ఈ రోజు గురువుగారికి ఇక పద్యపత్రమును సమర్పించవలెననిపించినది " శంకరయ్యగారి శంకరాభరణము సప్తఖండములకు సప్త, దత్త పదులనివ్వ, తెలుగు పదముల మాలలు గట్టి, వేయనాశ కవులకెల్ల " ఇది మాఅందరి ఆశ , కలకాలము ఇలా సాగిపోవలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ| మీ శిష్యుడు వరప్రసాద్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణలోని చమత్కారం ప్రశంసనీయం. అభినందనలు. ‘చెలి యనన్నచొ చూడగా స్త్రీయె యగును ’ పాదాన్ని ‘చెలి యను పదము చూడగా స్త్రీకె తగును’ అంటే ఎలా ఉంటుంది? * మందాకిని గారూ, పూరణ ద్వారా మీ ‘సమర్థన’ బాగుంది. చక్కని పూరణ. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మేలు చేసిన వాడి చెలికాడే కదా! మంచి భావన. పూరణ బాగుంది. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, ధన్యవాదాలు. * శ్రీపతి శాస్త్రి గారూ, ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు. ‘భక్తుఁడు + ఇంద్రుఁడు’ అన్నపుడు యడాగమం రాదు. ‘భక్తుఁడై యింద్రుఁడు’ అంటే సరి! * మంద పీతాంబర్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * చింతా రామకృష్ణారావు గారూ, ఉత్తమమైన పూరణ. అభినందనలు. * రాజారావు గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదములు. పద్యపాదం మధ్యలో అచ్చుకు బదులు హల్లు వేసినాను. నేను మన్మథుడు శివునకు పరమభక్తుడని, ఇంద్రుడు మన్మథుని వరమడిగినాడని భావించినాను. కనుక మీ అనుమతితో "యి" బదులు "ఇ" గా సవరిస్తున్నాను.
మిస్సన్న గారూ, విష్ణువు చుట్టరికాలను చక్కగా వివరించింది మీ అద్భుతమైన పూరణ. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మూడు పద్యాలతో ‘ఒక’ పూరణ చేసిన ఘనులు మీరు. బాగుంది. అభినందనలు. ‘హితవరి + అనిన’ అన్నచో సంధి లేదు. ‘హితవరి యన’ అంటే సరి! * రాజేశ్వరక్కయ్యా, మనోహరమైన పూరణ. అభినందనలు. కాకుంటే ‘దేవుడు’ అనకుండా ‘దేముడు’ గ్రామ్యపదాన్ని ప్రయోగించారు.
చెలి యనన్నచొ చూడగా స్త్రీయె యగును
రిప్లయితొలగించండిచెలి భవానియె భవునికి చెప్పగాను,
చిచ్చు కంటను గని మసిజేసి నట్టి
చెఱకువిలుకాఁడు చెలి, కాఁడు శివున కెపుడు.
రౌద్ర మద్భుత బీభత్స రసము, వీర
రిప్లయితొలగించండిహాస్య శృంగార కరుణ భయానకములు,
దెలియుడీ, శాంతమ,నుచున దెట్టు లొచ్చి
చేరె,నవరసమ్ములలోన నీరసమ్ము!
గురువుగారూ, బీభత్సము అలా రాయకూడదనుకోలేదు, మన్నించండి.
గురువులందఱి యందున గొప్పగురువు
దక్షిణామూర్తి యై యొప్పు దాను శివుఁడు
లోక కళ్యాణ మొనరింపఁ లుప్తమైన
చెఱకువిలుకాఁడు చెలికాఁడు శివున కెపుడు.
అందరికీ గురువై ధర్మబోధ చేయగలిగిన వానికి చెఱకు విలుకాఁడు చేసిన పని వెనుక ఉద్దేశ్యం తెలియదా, ఆయనకు కోపం లేకపోగా మరింత నచ్చాడు అని భావము.
కోల లవ్వియు దామర పూలు గాదె
రిప్లయితొలగించండిసింగిణీ గన దీయని చెఱకు తుండు
బాణ మేయగ నర్ధమ్ము భాగ మొదవె
చెఱకు విలుకాఁడు చెలికాఁడు శివుని కెపుడు !
లగ్గ మొనరింప వచ్చిన సిగ్గు పడక
రిప్లయితొలగించండిఅగ్గి కన్నుతో తనువును బుగ్గిఁ జేసె
చెఱకువిలుకాఁడు పగవాడు శివున కెపుడు!
చెఱకువిలుకాఁడు చెలికాఁడు శివున కెపుడు?
గురువు గారి ప్రోద్భలంతో నేను ఇంతటివాడనైతిని.ఈ రోజు
రిప్లయితొలగించండిగురువుగారికి ఇక పద్యపత్రమును సమర్పించవలెననిపించినది
" శంకరయ్యగారి శంకరాభరణము
సప్తఖండములకు సప్త, దత్త
పదులనివ్వ, తెలుగు పదముల మాలలు
గట్టి, వేయనాశ కవులకెల్ల "
ఇది మాఅందరి ఆశ , కలకాలము ఇలా సాగిపోవలని
ఆ భగవంతుని ప్రార్థిస్తూ|
మీ శిష్యుడు
వరప్రసాద్
గురువు గారు క్షమించాలి,
రిప్లయితొలగించండి"గురువుగారికి ఒక పద్యపత్రమును సమర్పించవలెననిపించినది"
త్వరగా పూర్తి చేయాలని పై విధముగా వ్రాసితిని. మన్నించప్రార్థన
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిమదన మోహనరూపుడు,మగువ రతికి
చెరకువిలుకాడు చెలికాడు, శివునకెపుడు
పరమ భక్తుడు,యింద్రుడు వరము గోర
తనువు నర్పించె జగతికై త్యాగధనుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలోకపావని పార్వతి శోక మణచ
రిప్లయితొలగించండిరాగ దేహుండు భస్మాంగ రాయ కంటి
మంటలో భస్మమాయె పూవింటి తోడ
చెఱకువిలుకాఁడుచెలి కాఁడు శివున కెపుడు.
తాను భర్తయు తన జీవితాన రతికి
రిప్లయితొలగించండిచెఱకువిలుకాఁడు చెలికాఁడు. శివున కెపుడు
కోర్కె రగిలించి గిరిజను కోరునటుల
చేయ బాణంబులను వేసె చేడియెనపుడె.
వచ్చె నామని విచ్చె పూ మచ్చె కంటి
రిప్లయితొలగించండియచ్చరలును వసంతుండు మెచ్చ వచ్చె
చెఱకు విలుకాడు చెలికాడు - శివునకెపుడు
ఘన తపో ముద్ర దాల్చు నేకాగ్ర దీక్ష
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలోని చమత్కారం ప్రశంసనీయం. అభినందనలు.
‘చెలి యనన్నచొ చూడగా స్త్రీయె యగును ’ పాదాన్ని ‘చెలి యను పదము చూడగా స్త్రీకె తగును’ అంటే ఎలా ఉంటుంది?
*
మందాకిని గారూ,
పూరణ ద్వారా మీ ‘సమర్థన’ బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మేలు చేసిన వాడి చెలికాడే కదా! మంచి భావన. పూరణ బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
ధన్యవాదాలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
‘భక్తుఁడు + ఇంద్రుఁడు’ అన్నపుడు యడాగమం రాదు. ‘భక్తుఁడై యింద్రుఁడు’ అంటే సరి!
*
మంద పీతాంబర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
చింతా రామకృష్ణారావు గారూ,
ఉత్తమమైన పూరణ. అభినందనలు.
*
రాజారావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
నా పూరణ ...
రిప్లయితొలగించండిప్రణయభావమ్ముఁ దెచ్చు దైవ మ్మెవండొ?
యగ్నిదేవుఁడు గాలి కేమగును? రావ
ణుండు పూజలు సేయుచునుండు నెట్లు?
చెఱకు విలుకాఁడు; చెలికాఁడు; శివున కెపుడు.
శంకరార్యా ! చక్కని సవరణ చేసినందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఈ రోజు ఎవరూ చేయని క్రమాలంకార పూరణ చక్కగా చేసి చూపారు.
మీ సూచన ప్రకారము సవరణ తో ...
‘చెలి యను పదము చూడగా స్త్రీకె తగును’
చెలి భవానియె భవునికి చెప్పగాను,
చిచ్చు కంటను గని మసిజేసి నట్టి
చెఱకువిలుకాఁడు చెలి, కాఁడు శివున కెపుడు.
పాన్పు చూడంగ హారికి పాప రేడు!
రిప్లయితొలగించండిభార్య జగముల నేలు సౌభాగ్య లక్ష్మి!
పుత్రి పాపఘ్ని గంగమ్మ! పుత్రుడగును
చెఱకువిలుకాఁడు! చెలికాఁడు శివున కెపుడు!
గురువుగారూ మీ పూరణ అద్భుతముగా ఉంది. మిస్సన్న గారూ మీ పూరణ అదిరింది.
రిప్లయితొలగించండిగురువుగారూ ధన్యవాదములు. పద్యపాదం మధ్యలో అచ్చుకు బదులు హల్లు వేసినాను. నేను మన్మథుడు శివునకు పరమభక్తుడని, ఇంద్రుడు మన్మథుని వరమడిగినాడని భావించినాను. కనుక మీ అనుమతితో "యి" బదులు "ఇ" గా సవరిస్తున్నాను.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_________________________________
తనువు త్యాగ మొనర్చిన - ధన్యజీవి
దనుజు దండింప నెంచిన - దగ్ధకాయు
తారకాసుర సంహార - కారకుండు
స్కందు జన్మకు మూలమీ - స్కంద నాశి
చెఱకు విలుకాడు యెట్లౌను - శివుని వైరి ?
పెళ్ళి చేసిన వాడెగా - పెద్ద యనిన
మేలు గోరెడి వాడెపో - మిత్రు డనిన
హితము గోరెడి వాడెయౌ - హితవ రనిన
లోక కల్యాణ కాముడు - లుప్త మూర్తి
చెఱకు విలుకాడు యెట్లౌను - శివుని వైరి ?
మంచినే గోరి కడతేరె - మదన మూర్తి
చెంత జేర్చగ చండిని - శివుని దరిని
చెఱకు విలుకాడు యెట్లౌను - శివుని వైరి ?
కాడు కాలేడు కాబోడు - కానివాడు
చెఱకువిలుకాఁడు చెలికాఁడు - శివున కెపుడు !
_________________________________
కిశోర్ జీ శభాష్ !
రిప్లయితొలగించండిమూర్తీజీ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమోహ పరవశుడాయెను మోహిని గని
రిప్లయితొలగించండిదేముడై యుండి మాయను తెలిసి కొనక
సంత సించెను హరుడెంతొ వింత చెలిమి
చెఱకు విలుకాఁడు చెలికాఁడు శివుని కెపుడు !
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండివిష్ణువు చుట్టరికాలను చక్కగా వివరించింది మీ అద్భుతమైన పూరణ. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మూడు పద్యాలతో ‘ఒక’ పూరణ చేసిన ఘనులు మీరు. బాగుంది. అభినందనలు.
‘హితవరి + అనిన’ అన్నచో సంధి లేదు. ‘హితవరి యన’ అంటే సరి!
*
రాజేశ్వరక్కయ్యా,
మనోహరమైన పూరణ. అభినందనలు.
కాకుంటే ‘దేవుడు’ అనకుండా ‘దేముడు’ గ్రామ్యపదాన్ని ప్రయోగించారు.
సవరణకి ధన్య వాదములు తమ్ముడూ !
రిప్లయితొలగించండిశంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండిగురువుగారూ ధన్వ్యవాదాలు.
రిప్లయితొలగించండిమీ పూరణ మనోహరంగా ఉంది.
మూర్తి మిత్రమా ధన్యవాదాలు.
వసంత మహోదయా అదిరింది.