4, ఆగస్టు 2011, గురువారం

చమత్కార పద్యాలు - 118 (ప్రహేళిక)

శ్లో.
ఏకచక్షు ర్న కాకో೭యం
బిలమిచ్ఛే న్న పన్నగః |
క్షీయతే వర్ధతే చైవ
న సముద్రో న చంద్రమాః ||

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం ...
ఆ. వె.
ఏకచక్షు వగును, కాకమ్ము కాదది;
బిలముఁ గోరుఁ, గాదు విషధరమ్ము;
క్షయము వృద్ధిఁ గనును గా దబ్ధి, చంద్రుఁడు;
దీని భావ మేమి తెలుపఁ గలరె?

కవిమిత్రులారా,
అదేమిటో తెల్పండి. సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

1 కామెంట్‌:

  1. పై ప్రహేళిక సమాధానం ...
    "సూది"
    వివరణ అవసరం లేదనుకుంటాను.
    ఈసారి కవిమిత్రు లెవరూ స్పందించలేదు ?! :-)

    రిప్లయితొలగించు